ETV Bharat / politics

నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై చంద్రబాబు కసరత్తు - త్వరలోనే నియామకం - Chandrababu Focus Nominated Posts - CHANDRABABU FOCUS NOMINATED POSTS

Nominated Posts in AP 2024 : నామినేటెడ్‌ పదవుల కోసం ఎదురుచూస్తున్న ఆశావహులకు త్వరలోనే శుభవార్త అందనుంది. నామినేటెడ్‌ పదవుల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న విస్తృత కసరత్తు దాదాపు తుదిదశకు వచ్చింది. ఎన్డీయే మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలకు 18 నుంచి 20 శాతం పోస్టులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

Nominated Posts in AP 2024
Nominated Posts in AP 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 7, 2024, 6:59 AM IST

Chandrababu Focus on Nominated Posts : రాష్ట్రంలో వైఎస్సార్సీపీని గద్దె దించి అధికార పగ్గాలు చేపట్టిన కూటమి ప్రభుత్వం, నామినేటెడ్‌ పోస్టులపై ఫోకస్ పెట్టింది. టికెట్లు త్యాగం చేసిన వారితోపాటు, పార్టీ గెలుపు కోసం నిరంతరం శ్రమించిన నాయకులు కూడా పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఎన్నికల సమయంలో టికెట్లు దక్కని వారికి పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు వారికి కూడా సర్దుబాటు చేయాల్సి ఉండడంతో సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.

NDA Govt Focus on AP Nominated Posts : ఇందులో భాగంగా ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత ఉన్నా పొత్తులో భాగంగా సీటు త్యాగం చేసిన వారు, గత ఐదేళ్లు కష్టకాలంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచినవారికి గుడ్​న్యూస్ చెప్పనుంది. అధికార అండతో వైఎస్సార్సీపీ చేసిన ఆరాచకాలపై పోరాడినవారు ఇలా వివిధ వర్గాల నాయకులకు త్వరలోనే శుభవార్త అందనుంది. వీరిలో పనితీరు, సమర్థత ఆధారంగా నామినేటెడ్ పదవుల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కసరత్తు ముమ్మరం చేశారు.

తుదిదశకు చేరిన నామినేటెడ్‌ పదవుల భర్తీ ప్రక్రియ : మరో రెండు వారాల్లోపే ఈ భర్తీ ప్రక్రియ చేపట్టనున్నట్లు సమాచారం. పొత్తులో భాగంగా పోటీచేసిన బీజేపీ, జనసేన పార్టీలకు దామాషా పద్దతిలోనే నామినేటెడ్ పోస్టులు దక్కనున్నాయి. పనితీరు, సమర్థత, పార్టీపై అంకితభావం వంటి అంశాలే నామినేటెడ్ పదవులకు ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు కష్టపడి పనిచేశారు? పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను ఎవరు అంకితభావంతో నిర్వహించారు? ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల కోసం చిత్తశుద్ధితో పని చేసినవారు ఎవరనే అంశాల ప్రాతిపదికన రెండు, మూడు నివేదికలు తెప్పించుకున్నారు.

మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్​ల నుంచి విడిగా ప్రతిపాదనలు తీసుకున్నారు. ఐవీఆర్ఎస్ విధానం ద్వారా కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. మిత్రపక్షాల నాయకులతోనూ చంద్రబాబు విస్తృతంగా చర్చించి, అభిప్రాయాలు తెలుసుకున్నారు. వాటన్నింటినీ క్రోడీకరించి పనితీరు, సమర్థతకు మొదటి ప్రాధాన్యమిస్తూ, అదే సమయంలో సామాజిక, ప్రాంతీయ సమీకరణాల్ని బేరీజు వేసుకుంటూ, సమతూకం పాటిస్తూ నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు.

Competition for Nominated Posts in AP : మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి పోస్టుల వరకు ఇదే సూత్రాన్ని పాటించనున్నారు. పోస్టులు తక్కువ, నాయకుల్లో ఆకాంక్షలు ఎక్కువగా ఉండడంతో ఎక్కువ కసరత్తు అవసరమైంది. పోస్టులన్నీ ఒకేసారి భర్తీ చేయకుండా, దశలవారీగా ఆ ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు సమాచారం.

అసమర్థ ప్రభుత్వం అనిపించుకోవడానికి సిద్ధంగా లేను: చంద్రబాబు - CM Chandrababu on Law and Order

నిర్ణయాల్లో స్పీడ్ పెంచిన చంద్రబాబు - కలెక్టర్ల సదస్సు ఒక్కరోజుకే పరిమితం - Chandrababu Mark Rule in AP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.