ETV Bharat / politics

ముంబయి నటి వ్యవహారంలో ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టం: చంద్రబాబు - Chandrababu Chit Chat With Media

CM Chandrababu Naidu Chit Chat With Media: ముంబై నటి వ్యవహారంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోని పోలీసులు వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రతిష్ఠను మంటగలిపిందని చంద్రబాబు మండిపడ్డారు. తప్పు చేసిన పోలీసులు ఏ స్థాయిలో ఉన్నా క్షమించేది లేదని స్పష్టం చేశారు. గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్‌ హాస్టల్​లో ఎలాంటి పరికరాలు లభించలేదని తెలిపారు.

CM Chandrababu Naidu Chit Chat With Media
CM Chandrababu Naidu Chit Chat With Media (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 30, 2024, 9:39 PM IST

Updated : Aug 30, 2024, 10:11 PM IST

CM Chandrababu Naidu Chit Chat With Media : ముంబై నటి వ్యవహారంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోని పోలీసులు వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రతిష్ఠను మంటగలిపిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన పోలీసులు ఏ స్థాయిలో ఉన్నా క్షమించేది లేదని స్పష్టం చేశారు. మహిళలు, ఆడబిడ్డల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని తేల్చి చెప్పారు. వ్యవస్థల్ని ఎంత నిర్వీర్యం చేశాడో ముంబై నటి వ్యవహారమే ఓ నిదర్శమని అన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో జరిగిన మీడియా చిట్ చాట్​లో చంద్రబాబు పలు విషయాలపై ఆయన మాట్లాడారు.

Chandrababu on Hidden Cameras in Girls Hostel : కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్‌ కళాశాలలో జరిగిన ప్రచారం పట్ల అంతా భయాందోళనలకు గురయ్యారని సీఎం అన్నారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశానని తెలిపారు. అందరి సమక్షంలోనే ఇప్పటి వరకూ హాస్టల్ మొత్తం తనిఖీలు చేశారని చేశారు. వసతి గృహంలో ఎలాంటి పరికరాలు లబించలేదని సీఎం చెప్పారు. అయినా దర్యాప్తు ఆపకుండా, సమగ్ర విచారణ కొనసాగుతుందని వెల్లడించారు. కొన్ని ప్రచారాల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా, ధైర్యంగా ఉండాలని సూచించారు. తప్పు చేసిన ఎవరినీ ప్రభుత్వం ఉపేక్షించదని స్పష్టం చేశారు.

చేరికలు ఉంటాయి : వైఎస్సార్సీపీలో ఇమడలేక చాలా మంది తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని చంద్రబాబు తెలిపారు. అందరినీ కాకుండా మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే చూసి తీసుకుంటామని అన్నారు. పార్టీకి, నేతలకు, కార్యకర్తలకు ఇబ్బంది లేకుండానే చేరికలు ఉంటాయని స్పష్టం చేశారు.

ఇంజినీరింగ్ కాలేజీ బాలికల బాత్​రూమ్​లో సీక్రెట్‌ కెమెరాలు! - విచారణకు సీఎం ఆదేశం - Hidden Cameras in Girls Hostel

CM Chandrababu Participated in Vana Mahotsava Program : రాష్ట్రంలో ఎర్ర చందనం స్మగ్లర్లు ఇన్నాళ్లూ ఆడిన ఆటలు ఇక సాగవని, అడవిలో స్మగ్లర్లు అడుగుపెడితే ఇక అదే వారికి చివరి రోజని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. అడవుల సంరక్షణకు డ్రోన్లను వినియోగిస్తామన్న చంద్రబాబు, స్మగ్లర్ల కంటే ముందే డ్రోన్లే అడవుల్లో ఉంటాయని తెలిపారు. ప్రతీ ఒక్కరూ ఆక్సిజన్ తీసుకోవటం ఎంత అవసరమో, ఆక్సిజన్ ఇచ్చే చెట్లు నాటటమూ అంతే ముఖ్యంగా భావించాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ వద్ద ఎకో పార్కులో ఏర్పాటు చేసిన వనమహోత్సవంలో చంద్రబాబు పాల్గొన్నారు.

అడవిలో అడుగుపెడితే అదే చివరిరోజు - ఎర్ర చందనం స్మగ్లర్లకు చంద్రబాబు వార్నింగ్ - Vana Mahotsava Program in AP

విజయవాడ సీపీ కార్యాలయానికి బాలీవుడ్‌ నటి - వేధింపులపై ఫిర్యాదు - Mumbai Actress Complaint to Police

Last Updated : Aug 30, 2024, 10:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.