ETV Bharat / politics

భువనేశ్వరి కోసం రెండు చీరలు కొన్న చంద్రబాబు - CBN in Handloom Day Celebrations

CM Chandrababu in National Handloom Day Celebrations: విజయవాడలో జాతీయ చేనేత దినోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని, సతీమణి భువనేశ్వరి కోసం చీరలు కొనుగోలు చేశారు.

CM_Chandrababu_in_National_Handloom_Day_Celebrations
CM_Chandrababu_in_National_Handloom_Day_Celebrations (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 7, 2024, 5:08 PM IST

Updated : Aug 7, 2024, 6:59 PM IST

CM Chandrababu in National Handloom Day Celebrations: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలోని మేరీస్ స్టెల్లా కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తమ ఉత్పత్తులతో నేతన్నలు స్టాల్ ఏర్పాటు చేశారు. స్టాళ్లలో ఉత్పత్తులు పరిశీలించి, చేనేత కార్మికులతో మాట్లాడిన సీఎం సతీమణి భువనేశ్వరి కోసం వెంకటగిరి చీర, ఉప్పాడ జాందాని చీరలు కొనుగోలు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. చేనేతకారులకు ఇచ్చే అన్ని రుణాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. చేనేత కార్మికుల ఆదాయం పెరిగేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నాలుగోసారి సీఎం అయ్యాక మొదట కలిసింది చేనేత కార్మికులనేనన్న చంద్రబాబు సహకార సంఘాల నేతలు సమర్థవంతమైన వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలు, విభాగాల్లోనూ చేనేత వస్త్రాలను ప్రోత్సహిస్తామన్నారు. ఈ నేపథ్యంలో చేనేత సంఘాల నాయకులు కూడా సరికొత్తగా ఆలోచించాలన్నారు. చేనేత పరిశ్రమను కాపాడటం మన బాధ్యతని, ప్రజలంతా నెలకు ఒకరోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపు నిచ్చారు.

రాష్ట్రంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం వేడుకలు- ప్రముఖుల స్పెషల్ విషెస్ - National Handloom Day celebrations

చేనేత కుటుంబాలకు 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. చేనేత, మరమగ్గాల కార్మికులకు సౌరవిద్యుత్ ప్యానెళ్ల ద్వారా ఉచిత విద్యుత్‌ అందిస్తామని తెలిపారు. పీఎం సూర్య ఘర్‌ ద్వారా ఇంటివద్దే సోలార్‌ విద్యుదుత్పత్తి చేయవచ్చని, వీరు ఉత్పత్తి చేసిన కరెంట్‌ను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా చేనేతలో సహజ రంగులను ప్రోత్సహిస్తామన్నారు. చేనేత కార్మికుల్లో చైతన్యం రావాలని, చేయూత ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

"చేనేత కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చేనేత కార్మికులతో మాట్లాడాను. స్టాళ్లలో ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తులు పరిశీలించాను. చేనేత కార్మికులకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. చేనేత రంగానికి చారిత్రక నేపథ్యం కూడా ఉంది. స్వాతంత్య్రోద్యమంలో ఆగస్టు 7నే చేనేత ఉద్యమం ప్రారంభమైంది. చేనేత కార్మికుల ఆదాయం పెరిగేందుకు చర్యలు తీసుకుంటాం. నేతన్నల జీవితాల్లో వెలుగులు వచ్చేవరకు అండగా ఉంటాం." - సీఎం చంద్రబాబు

జగనన్న మొండి చెయ్యి - తెగిన దారం పోగులా నేతన్నల బతుకులు - WEAVERS PROBLEMS

Last Updated : Aug 7, 2024, 6:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.