ETV Bharat / politics

రోడ్డుపై కాన్వాయ్​ ఆపిన సీఎం- ఆప్యాయంగా పలకరించి, వినతులు స్వీకరించిన చంద్రబాబు - CM Chandrababu

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 12, 2024, 3:32 PM IST

CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయానికి వెళ్తూ తన ఇంటి వద్ద సమస్యలతో వచ్చిన ప్రజల్ని చూసి రోడ్డుమీద కాన్వాయ్ ఆపారు. అందరినీ ఆప్యాయంగా పలకరించిన ఆయన, యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వినతులు స్వీకరించారు.

cbn_convoy
cbn_convoy (ETV Bharat)

CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయానికి వెళ్తూ తన ఇంటి వద్ద సమస్యలతో వచ్చిన ప్రజల్ని చూసి రోడ్డుమీద కాన్వాయ్ ఆపారు. అందరినీ ఆప్యాయంగా పలకరించిన ఆయన, యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వినతులు స్వీకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ప్రజల పట్ల సహృదయత చాటుకున్నారు. ఉండవల్లి నివాసం నుంచి సచివాలయానికి వెళ్తుండగా సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చిన ప్రజల్ని చూసి రోడ్డుపై కాన్వాయ్ ఆపారు. ప్రజల సమస్యలు ఆలకించారు. మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ భార్య ఇచ్చావతితోపాటు కుమారుడిని ఆప్యాయంగా పలకరించారు. కుమారుడు చదువు విషయాన్ని ఆమె ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బాలుడి చదువు బాధ్యత తాము తీసుకుంటామని, ధైర్యంగా ఉండాలని చంద్రబాబు హామీ ఇచ్చారు. మరికొందరు తమ సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వగా పరిష్కరిస్తామని సీఎం చెప్పారు.

విశాఖను సింగపూర్​ చేద్దాం - యువతకు అవకాశాలు కల్పిద్దాం: చంద్రబాబు - CII National Council meeting

మాజీ ఎమ్మెల్యే సివిరి సోము భార్య సీఎం చంద్రబాబుని కలిశారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే సివిరి సోము నక్సల్స్ చేతిలో హతమయ్యారు. సోము భార్య ఇచ్చావతి యోగక్షేమాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. కుమారుడు చదువు విషయం ఆమె ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సోము కొడుకు చదువు బాధ్యత తాను తీసుకుంటానని ధైర్యంగా ఉండాలని చంద్రబాబు హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ గూండాల దాడిలో సర్వస్వం కోల్పోయానని అరకు లోయ సర్పంచ్ శ్రీనివాస్ చంద్రబాబుకి వివరించారు. సమస్య పరిష్కారానికి సీఎం హామీ ఇచ్చారు.

పరదాలు కట్టలేదు - చెట్లు పడగొట్టలేదు - హంగు ఆర్భాటం లేకుండా చంద్రబాబు పర్యటన - Chandrababu North Andhra Tour

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. తాడేపల్లి వద్ద హరే కృష్ణ గోకుల క్షేత్రం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీవేంకటేశ్వర ఆలయంలోని గర్భాలయంలో నిర్మించే అనంత శేష స్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభా వేదికపై ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ తుషార్ దూడి సీఎం ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం 8 గంటల నుంచి 9గంటల వరకు గోకుల క్షేత్రంలో జరిగే పూజా కార్యాక్రమాలలో పాల్గొంటారని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి చెప్పారు. పరిమిత సంఖ్యలోనే ప్రజలను అనుమతిస్తామన్నారు. ఉదయం ఏడుగంటల లోపు ప్రజలు, భక్తులు సభా ప్రాంగణానికి చేరుకోవాలని చెప్పారు.

'విద్యుత్​ రంగంపై 1,29,503 కోట్ల నష్టం'- రూ.500, 200 నోట్లను కూడా రద్దు చేయాలి : చంద్రబాబు - white paper on power sector

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.