ETV Bharat / politics

"పోటీ చేద్దామా, వద్దా?"- ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికపై నేతలతో చంద్రబాబు చర్చ - Chandrababu on Visakha MLC Election - CHANDRABABU ON VISAKHA MLC ELECTION

Chandrababu on Visakha MLC Elections 2024 : ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై చంద్రబాబు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే విశాఖ జిల్లా టీడీపీ నేతలతో సమావేశమైన ఆయన వారి నుంచి అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీల బలాబలాలపై వారితో చర్చించారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు క్షేత్రస్థాయిలో ఓట్ల అధ్యయనానికి ఆరుగురితో కమిటీని వేశారు.

Chandrababu on Visakha MLC Elections
Chandrababu on Visakha MLC Elections (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 10, 2024, 10:19 AM IST

Vizag Local Bodies MLC By Poll 2024 : ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించిన స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా? అభ్యర్థి ఎవరు అన్న విషయాల్లో సందిగ్ధత కొనసాగుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులతో సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో సుదీర్ఘంగా చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలు ఎలా ఉంటాయి ? స్థానిక సంస్థల ప్రతినిధుల్లో ఎంత మంది తమవైపు మొగ్గు చూపుతారు వంటి అంశాలపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

NDA Alliance Candidate Vizag MLC By Elections : ఎమ్మెల్సీ స్థానానికి పోటీపై జిల్లా ఎమ్మెల్యేలు, నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జగన్‌ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై వైఎస్సార్సీపీ తరపున గెలిచిన స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కొందరు తెలిపారు. మొదటి 11 నెలలు తప్ప, ఆ తర్వాత వారికి గౌరవ వేతనం కూడా ఇవ్వలేదని చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మంది కూటమి పార్టీలవైపు మొగ్గు చూపుతున్నారని వివరించారు.

ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిచేందుకు అవసరమైనన్ని ఓట్లు కూడగట్టగలమని కొందరు భరోసా వ్యక్తం చేశారు. మరికొందరు మాత్రం పోటీకి దూరంగా ఉండటం మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై ఒక నిర్ణయానికి వచ్చేముందు మరింత లోతుగా అన్ని అంశాల్ని పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు ఆరుగురితో కమిటీని వేశారు. తెలుగుదేశం నుంచి పల్లా శ్రీనివాస్, బండారు సత్యనారాయణమూర్తి, వంగలపూడి అనిత, గంటా శ్రీనివాసరావు, జనసేన నుంచి పంచకర్ల రమేశ్‌బాబు, బీజేపీ నుంచి విష్ణుకుమార్‌రాజులను కమిటీలో నియమించారు. వారు మిగతా నేతలతోనూ చర్చించి తమ అభిప్రాయాన్ని చంద్రబాబుకి తెలియజేస్తారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశమున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Visakha Local Bodies MLC Elections : మరోవైపు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటికే ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 14న స్క్రూటినీ చేయనున్నారు. ఆగస్టు 30న పోలింగ్​ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఆగస్టు 30న ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక - వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బొత్స - Visakha MLC Election

ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో కూటమి అభ్యర్థి? - Alliance Candidate in MLC Elections

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.