ETV Bharat / politics

ఒకే బ్రాండ్‌ తెలంగాణ కంటే ఏపీలో ఎక్కువకు కొనుగోలు - ప్రభుత్వ మద్యం అక్రమాలపై సీఐడీ ఫోకస్​ - CID Focus on Liquor Scam

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 19, 2024, 4:20 PM IST

Updated : Jul 19, 2024, 8:14 PM IST

CID Focus on Liquor Scam: వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం అక్రమాలపై సీఐడీ కూపి లాగుతోంది. అధికారుల నుంచి అక్రమాలు జరిగిన తీరుపై సీఐడీ వివరాలు తీసుకుంటుంది. వాసుదేవరెడ్డి పాత్రపై వెలుగులోకి సంచలన వాస్తవాలు వస్తున్నాయి. మద్యం కొనుగోళ్లలో భారీగా అవకతవకలకు వాసుదేవరెడ్డి తెరలేపారు. ఒకే రకమైన బ్రాండ్ మద్యాన్ని తెలంగాణ కంటే అధిక ధర పెట్టి ఏపీలో కొనుగోలు చేసినట్టు విచారణలో సీఐడీ వెల్లడించింది.

CID Focus on Liquor Scam
CID Focus on Liquor Scam (ETV Bharat)

CID Focus on Liquor Scam : గత ప్రభుత్వంలో జరిగిన మద్యం అక్రమాలపై సీఐడీ కూపీ లాగుతోంది. అధికారుల నుంచి అక్రమాలు జరిగిన తీరుపై వివరాలు సేకరిస్తోంది. లిక్కర్ అవకతవకల్లో వాసుదేవరెడ్డి (VasudevaReddy) పాత్రపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డి పాలనలో బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ, డిస్టిలరీల కమిషనర్‌గానూ వాసుదేవరెడ్డికే బాధ్యతలను అప్పగించారు. ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కమిషనర్‌లకు ఫైళ్లు పంపకుండా నిర్ణయాలు తీసుకునేలా వాసుదేవ రెడ్డికి జగన్ ప్రభుత్వం అధికారాలు ఇచ్చింది. ఉన్నతాధికారులను ట్రాన్స్​ఫర్​ చేయించగలనంటూ వాసుదేవ రెడ్డి బెదిరించినట్టు ఆరోపణలు వచ్చాయి.

మద్యం కొనుగోళ్లలోనూ వాసుదేవరెడ్డి అవకతవకలకు తెరలేపారు. ఒకే రకమైన బ్రాండ్ మద్యాన్ని తెలంగాణ కంటే అధిక ధర పెట్టి ఏపీలో కొనుగోలు చేసినట్టు విచారణలో సీఐడీ వెల్లడించింది. వాసుదేవ రెడ్డి చేసిన అక్రమాలు అంచనాకు అందటం లేదని అధికారులు చెబుతున్నారు. బినామీ పేర్లతో కొన్ని డిస్టిలరీ వ్యాపారంలోకి వాసుదేవ రెడ్డి చొరబడ్డారని, కొన్ని మద్యం బ్రాండ్​లను రాత్రికి రాత్రే తెప్పించినట్లు గుర్తించారు. తక్కువ రేటు ఉన్న మద్యం బ్రాండ్‌లు గణనీయంగా జగన్ ప్రభుత్వం తగ్గించేసింది.

కొడాలి నాని, బేవరేజెస్‌ కార్పొరేషన్ మాజీ ఎండీపై వాసుదేవరెడ్డిపై సిట్‌కు ఫిర్యాదు - Complaint on Kodali Nani

2014-2019 మధ్యలో తక్కువ రేటు ఉన్న మద్యం బ్రాండ్​లు 32 ఉంటే వాటిని రెండు బ్రాండ్‌లకు జగన్ ప్రభుత్వం కుదించింది. వాటిని అధిక ధరలకు విక్రయించి జగన్ ప్రభుత్వం సొమ్ము చేసుకుందని సీఐడీ అధికారులు ఆరోపించారు. ఒకే తరహా పేర్లు వచ్చేలా బ్రాండ్​ల పేర్లను బెవరేజ్ కార్పొరేషన్ వాసుదేవ్ రెడ్డి మార్పు చేసి వాటికే అధిక ధరల ఎమ్మార్పీలు నిర్ధారించారని తెలిపారు. కొన్ని ప్రీమియం బ్రాండ్‌ల పేర్ల తరహాలోనే పేర్లు పెట్టీ జే-బ్రాండ్ల మద్యం ఉత్పత్తి, విక్రయాలు చేశారని అన్నారు. జే-బ్రాండ్ మద్యానికీ అధిక ధరలు పెట్టి విక్రయించి జగన్ సర్కారు సొమ్ము చేసుకుందని తెలిపారు. సబ్ లీజులు పేరుతో డిస్టిలరీలను జగన్ అనుచరులు కైవసం చేసుకున్నారు. 11 డిస్టిలరీలను జగన్ అనుచరులు హస్తగతం చేసుకున్నట్టు విచారణలో గుర్తించింది.

బెవరేజెస్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు - కీలక పత్రాలు స్వాధీనం - CID Searches Vasudeva Reddy Home

జే-గ్యాంగ్ హస్తగతం చేసుకున్న డిస్టిలరీల నుంచే 65 శాతం వాసుదేవరెడ్డి మద్యం కొనుగోళ్లు చేశారు. 2014-19 మధ్య కాలంలో ఉన్న టాప్ 5 మద్యం బ్రాండ్ మద్యాన్ని 2019 తర్వాత కొనుగోళ్లు నిలిపివేశారు. మద్యం నుంచి వచ్చే ఆదాయాన్ని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తాకట్టు పెట్టింది. అప్పుల చెల్లింపుల నిమిత్తం మద్యం ఆదాయాన్ని, ఏపీ స్టేట్ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​కు రూ. 14,276 కోట్లు మళ్లించినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు.

ఏపీ బెవరేజెస్‌ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు - CID Raids at Vasudeva Reddy House

Last Updated : Jul 19, 2024, 8:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.