CM orders to CS : కొందరు ప్రభుత్వ అధికారులు అత్యుత్సాహంతో తమ పరిధి దాటి రాజకీయ స్టేట్మెంట్లు ఇవ్వకుండా కట్టడి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) ని ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. అధికారులు మీడియా ముందు పరిపాలన సంబంధిత అంశాలు మాత్రమే మాట్లాడాలని, రాజకీయ అంశాలు నాయకులు చూసుకుంటారని చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. వివిధ అంశాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో సమస్యలు ఉన్నా, వాటిని కప్పిపుచ్చి వాస్తవ పరిస్థితులు తమకు తెలియకుండా ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం అంతా బాగుందనే తప్పుడు సమాచారం ఇచ్చినా సహించనని సీఎం తెగేసి చెప్పినట్లు సమాచారం. ఇటీవల విశాఖలో ఇసుక ధరకు సంబంధించి క్షేత్రస్థాయి పరిస్థితి నాయకులు తమకు వివరించినా, ఉన్నతాధికారులు అదేమీ లేదన్నట్లుగా వాస్తవాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన ఘటన కు సంబంధించి ఇలా స్పందించినట్లు తెలుస్తోంది.
అనంతపురం లో రాములోరి రథం వైఎస్సార్సీపీ నేతలు తగలపెడితే రాజకీయ ప్రమేయం లేదని అక్కడి ఎస్పీ ప్రకటించటం, విజయవాడ వరదలకు సంబంధించి కొందరు అధికారులు అత్యుత్సాహం తో చేసిన ప్రకటనలు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేవిలా ఉన్నాయనే పలు ఉదాహరణలకు సంబంధించిన అంశాలను మంత్రి నారా లోకేశ్ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మంత్రివర్గ సమావేశం ప్రారంభానికి ముందు లోకేశ్ ప్రస్తావించిన అంశాలకు సహచర మంత్రులు మద్దతు తెలపడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎస్ కు పలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఒకరి మెప్పు కోసం కొందరు అధికారులు తమ పరిధి దాటి అన్ని అంశాల్లో మితిమీరిన జోక్యంతో బహిరంగ ప్రకటనలు తగదని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది.
మద్యం టెండర్లలో ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుంటే సహించేది లేదని, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఎవరు ప్రవర్తించినా ఉపేక్షించనని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. కొద్ది రోజుల కిందట మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా సీఎం చంద్రబాబు మద్యం టెండర్లు పారదర్శకంగా నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే ప్రజలను ఇబ్బంది పెట్టడం కాదని చెప్తూ ప్రజలకు మంచి చేయడానికే ఉపయోగించుకోవాలని అన్నారు. వర్షాలు, వరదల వల్ల ఇసుక తవ్వకాలు నిలిచిపోయి కొంత ఇబ్బంది ఎదురైందని వివరించారు. రాత్రిపూట తవ్వకాలు జరపకూడదన్న ఎన్జీటీ నిబంధనలు కూడా అడ్డంకిగా మారాయని చంద్రబాబు పేర్కొన్నారు.
డిసెంబరులో అమరావతి పనులు ప్రారంభం - 2027 నాటికి బుల్లెట్ ట్రైన్: సీఎం చంద్రబాబు
కొండమోడు రహదారి విస్తరణకు సర్కార్ నిర్ణయం- అమరావతి, హైదరాబాద్ మధ్య మార్గం సుగమం - KONDAMODU ROAD