ETV Bharat / politics

ప్రజాగళం సభ సూపర్​ హిట్​ - ప్రజలు, కార్యకర్తలకు చంద్రబాబు ధన్యవాదాలు - prajagalam Meeting success - PRAJAGALAM MEETING SUCCESS

Chandrababu Tweet on Prajagalam: కృష్ణా జిల్లా పెడన, మచిలీపట్నంలో తెలుగుదేశం, జనసేన ఉమ్మడిగా నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలకు విశేష స్పందన లభించింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు పోటెత్తి జన ప్రభంజనాన్ని తలపించాయి. చంద్రబాబు, పవన్‌ రోడ్‌ షోలో అడుగడుగునా పూలదండలతో స్వాగతం పలకుతూ జనం నీరాజనాలు పలికారు. ప్రజాగళం సభలు విజయవంతంపై ప్రజలకు, కార్యకర్తలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

Chandrababu Tweet on Prajagalam
Chandrababu Tweet on Prajagalam
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 18, 2024, 9:18 AM IST

Updated : Apr 18, 2024, 1:55 PM IST

Chandrababu Tweet on Prajagalam : కృష్ణా జిల్లాలో ప్రజాగళం సభ, రోడ్డు షోకు భారీ స్పందన లభించింది. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పోటెత్తి జన ప్రభంజనాన్ని తలపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ రాకతో ఉత్సాహం ఉప్పొంగింది. ప్రజలు వేల సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చి చంద్రబాబు, పవన్‌కు స్వాగతం పలికారు. పెడన బస్టాండ్‌ కూడలి, మచిలీపట్నం కోనేరు సెంటరు జనసంద్రంగా మారిపోయాయి. గతంలో ఒక్క అవకాశం అన్న జగన్​ను నమ్మి ఓటేశామని, ఈ సారి మాత్రం వేసేది లేదు అంటూ పెడన, బందరు వాసులు ముక్తకంఠంతో నినదిస్తున్నారు.

ప్రజాగళం సభ సూపర్​ హిట్​ - ప్రజలు, కార్యకర్తలకు చంద్రబాబు ధన్యవాదాలు

పెడనలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ వద్దకు వేర్వేరుగా హెలీకాఫ్టర్లలో చంద్రబాబు, పవన్‌ చేరుకున్నారు. తొలుత చంద్రబాబు చేరుకోగా, ఆ తర్వాత పవన్‌ వచ్చారు. అక్కడి నుంచి వీరిద్దరూ కలిసి పెడన బస్టాండ్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభ వద్దకు ఒకే వాహనంలో రోడ్‌షోగా వచ్చారు. దారి పొడుగునా ప్రజలు, అభిమానులు స్వచ్ఛందంగా తండోపతండాలుగా తరలివచ్చి ఇద్దరికీ స్వాగతం పలికారు. ఒకవైపు పవన్, మరోవైపు చంద్రబాబు వాహనంలో నిలబడి ప్రజలకు అభివాదం చేసుకుంటూ తరలివస్తుండడంతో మూడు పార్టీల అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండాపోయింది. ఇద్దరికీ జయ జయ ధ్వానాలు పలుకుతూ స్వాగతం పలికారు.

మద్య నిషేధం అన్నారు - సారా వ్యాపారం చేస్తున్నారు: పవన్​ కల్యాణ్​ - Pawan Kalyan Key Comments

బాబు, పవన్‌ రోడ్‌షోకు జనం నీరాజనాలు పలికారు. అడుగడుగునా పూలదండలు, స్వాగత తోరణాలతో నింపేశారు. క్రేన్‌లను తీసుకొచ్చి భారీ గజమాలలతో తమ అభిమానాన్ని చూపించారు. మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చి హారతులిస్తూ ఇద్దరికీ స్వాగతం పలికారు. పూలు జల్లుతూ, తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కేరింతలు కొట్టారు.

పెడన ప్రజాగళం సభ తర్వాత మచిలీపట్నం వరకూ చంద్రబాబు, పవన్‌ రోడ్‌షోగా తరలివచ్చారు. వారి వెంట వేలాదిగా ద్విచక్రవాహనాలు, కార్లలో ఎక్కి అభిమానులు వెంబడించారు. దారిపొడుగునా పెద్దఎత్తున అభిమానులు నిలబడి, ఇద్దరికీ అభివాదం చేస్తూ స్వాగతించారు. ఇసుకవేస్తే రాలనంతమంది జనం తరలివచ్చారు. పవన్, తాను మూడోసారి వారాహి ఎక్కి వచ్చామని చంద్రబాబు తెలిపారు. ఇద్దరం కలిసి వారాహి ఎక్కి మూడు జిల్లాలకు వెళితే మూడోచోట్లా సభలు సూపర్‌ డూపర్‌ హిట్టయ్యాయ్యాని చంద్రబాబు అన్నారు.

నవరత్నాలు కాదు - నకిలీ రత్నాలు : చంద్రబాబు - Chandrababu criticized YCP MLAs

కార్యకర్తలకు చంద్రబాబు ధన్యవాదాలు : పెడన, మచిలీపట్నంలో ప్రజాగళం సభలు విజయవంతంపై చంద్రబాబు ట్వీటర్ (X) వేదికగా స్పందించారు. ప్రజాగళంను విజయవంతం చేసిన ప్రజలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. పండుగ రోజు కూడా సామాజిక బాధ్యతను ప్రజలు మర్చిపోలేదని ఆయన అన్నారు.

బాబు రాకతో అప్రమత్తమైన అధికారులు- హడావుడిగా రోడ్డుపై గుంతల పూడ్చివేత - Chandrababu Election Campaign

Last Updated : Apr 18, 2024, 1:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.