ETV Bharat / politics

అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయానికి పెద్దపీట - ఆశీర్వదించి గెలిపించాలి: చంద్రబాబు - Chandrababu Request

Chandrababu Request to People for Blessing to TDP Candidates : తెలుగుదేశం అభ్యర్థులందరినీ ఆశీర్వదించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రజలను కోరారు. 34 మంది అభ్యర్థులతో రెండో జాబితా ప్రకటించిన చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సముచిత స్థానం కల్పించారు. జాబితాలో 35 ఏళ్ల లోపువారే అధికం కావడం గమనార్హం.

chandrababu_appeal_to_the_people
chandrababu_appeal_to_the_people
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 14, 2024, 3:27 PM IST

Chandrababu Request to People for Blessing to TDP Candidates : తెలుగుదేశం అభ్యర్థులందరినీ ఆశీర్వదించి గెలిపించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రజలను కోరారు. తొలి జాబితాలో 94 మందిని ప్రకటించగా ఇప్పుడు మరో 34 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను మీ ముందుకు తీసుకొచ్చామన్నారు. అభ్యర్థుల ఎంపికలో ఎప్పటిలాగే ఈ జాబితాలో కూడా ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చామని వివరించారు. వచ్చే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను ఇప్పటికే ప్రజల ముందు ఉంచామని చంద్రబాబు గుర్తుచేశారు. తెలుగుదేశం విడుదల చేసిన రెండో జాబితాలో 27 మంది పురుషులు, ఏడుగురు మహిళలకు చోటు కల్పించారు. వీరిలో పీహెచ్ డీ చేసిన వారు ఒక్కరు ఉండగా, పీజీ చేసిన వారు 11 మంది ఉన్నారు. 9 మంది గ్రాడ్యుయేట్లు (Graduates) కాగా ఎనిమిది మంది ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 10వ తరగతి చదివిన వాళ్లు ఏదుగురు అభ్యర్థులు ఉన్నారు.

ఆశావహులు, అసంతృప్తులతో చంద్రబాబు భేటీ - రాజకీయ భవిష్యత్తుకు హామీ

రెండో జాబితాలో 35 ఏళ్ల లోపు వారు ఇద్దరు ఉండగా, 36-45ఏళ్ల మధ్య వారు 8 మంది ఉన్నారు. 46-60 ఏళ్ల వయస్సు మధ్య వారు అత్యధికంగా 19మంది ఉన్నారు. 61-75ఏళ్ల మధ్య వారు ముగ్గురు, 75 ఏళ్లు పైబడిన వారు ఇద్దరున్నారు. రెండో జాబితాలో వారసులు, రాజకీయ కుటుంబ సభ్యులకు చోటు కల్పించారు. రెండో జాబితాలో రాజకీయ కుటుంబం నుంచి ఏడుగురికి అవకాశం లభించింది. ఏడుగురు రాజకీయ వారసులు తొలిసారి ఎన్నికల బరిలో దిగనున్నారు.

'ఎందుకు? ఏమిటి? ఎలా?' టీడీపీ సీనియర్లలో టెన్షన్ - బాబు నివాసం వద్ద హైడ్రామా

ప్రత్తిపాడు స్థానానికి దివంగత వరపుల రాజా భార్య సత్యప్రభకు, నెల్లూరు పార్లమెంట్ కోవూరుకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (MP Vemireddy Prabhakar Reddy) భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి అవకాశం కల్పించారు. వెంకటగిరి స్థానానికి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె కురుగొండ్ల లక్ష్మీ ప్రియ, శ్రీకాళహస్తి నుంచి బొజ్జల గోపాల కృష్ణరెడ్డి కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డి పోటీ చేయనున్నారు. కమలాపురం స్థానానికి పుత్తా నరసింహారెడ్డి కుమారుడు పుత్తా చైతన్య రెడ్డికి చోటు కల్పించారు. పుట్టపర్తి స్థానం నుంచి పల్లె రఘునాథరెడ్డి కోడలు పల్లె సింధూరరెడ్డి, కదిరికి మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ భార్య యశోదా దేవికి అవకాశం కల్పించారు.

'వారసులొస్తున్నారు'- ఎన్నికల బరిలో గెలుపే లక్ష్యంగా ముందడుగు!

తెలుగుదేశం అభ్యర్థుల రెండో జాబితా (Telugu desam candidates Second list) లో ఏడుగురు బీసీలకు చోటు కల్పించారు. బీసీ నేతలు బగ్గు రమణమూర్తి, పల్లా శ్రీనివాస్, పైలా ప్రసాద్, వాసంశెట్టి సుభాష్, పిడుగురాళ్ల మాధవి, కందికుంట యశోదాదేవి, రాఘవేంద్రకు చోటు దక్కింది. రెండో జాబితాలో ఐదు ఎస్సీ, మరో ఎస్టీ స్థానానికి అభ్యర్థులను ఖరారు చేశారు.

టీడీపీ తొలి జాబితాలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం

బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తుల నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 144 స్థానాల్లో పోటీ చేయనున్న తెలుగుదేశం పార్టీ ఇప్పటికి రెండు జాబితాల్లో 128 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. తొలి జాబితాలో 94, రెండో జాబితాలో 34 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. మరో 16 మంది అసెంబ్లీ అభ్యర్థుల్ని మాత్రమే ప్రకటించాల్సి ఉంది.

మొత్తం 25 ఎంపీ స్థానాల్లో 17స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుండగా 16 అసెంబ్లీ, 17ఎంపీ కలిపి మొత్తం 33మంది అభ్యర్థుల్ని ఇంకా ప్రకటించాల్సి ఉంది. కాగా, 12పార్లమెంట్ స్థానాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలకు పూర్తి స్థాయి అభ్యర్థుల్ని తెలుగుదేశం ప్రకటించింది. అన‌కాప‌ల్లి, అర‌కు, రాజ‌మండ్రి, అమ‌లాపురం, న‌ర‌సాపురం, ఏలూరు పార్ల‌మెంట్, గుంటూరు, నెల్లూరు, క‌డ‌ప, నంద్యాల, హిందూపురం, చిత్తూరు పార్ల‌మెంట్ పరిధిలో పూర్తిస్థాయిలో అభ్యర్థుల్ని తెలుగుదేశం ప్రకటించింది. ఇదిలా ఉండగా తొలి జాబితా అభ్యర్థుల్లో ఒకటీ, రెండు స్థానాలు మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.