ETV Bharat / politics

సర్దుబాట్లు కొలిక్కి వచ్చినట్లేనా! ఒకేరోజు రెండుసార్లు చంద్రబాబు, పవన్​ల భేటీపై సర్వత్రా ఆసక్తి - JANASENA

Chandrababu Pawan Kalyan Meeting: చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ ఉదయం నుంచి రెండు సార్లు సమావేశం అయ్యారు. ఉదయం సీట్ల సర్దుబాటుపై చర్చించిన ఇరువురు నేతలు, మరోమారు భేటీ అయ్యారు. జనసేన పోటీ చేసే స్థానాలపై ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చిన పవన్, చంద్రబాబుతో మరోమారు భేటీ అయ్యారు.

Chandrababu_Pawan_Kalyan_Meeting
Chandrababu_Pawan_Kalyan_Meeting
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 4, 2024, 1:09 PM IST

Updated : Feb 4, 2024, 10:52 PM IST

Chandrababu Pawan Kalyan Meeting: సీట్ల సర్దుబాటుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉదయం నుంచి రెండుసార్లు​ భేటీ అయ్యారు.. సీట్ల ఖరారుపై చంద్రబాబు- పవన్ కల్యాణ్‌ దాదాపు 3గంటల పాటు సుదీర్ఘంగా చర్చించిన ఇరువురు సాయంత్రం మరోసారి భేటీ అయ్యారు. పొత్తుల వల్ల రెండు పార్టీల్లో సీట్లు కోల్పోతున్న ఆశావహులకు ఆయా పార్టీల అధిష్టానం నచ్చజెప్పి... వారి రాజకీయ భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే నిర్ణయానికి వచ్చారు. ఆపై సీట్ల సర్దుబాటుపై ఉమ్మడిగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు, పవన్‌ ఈ రాత్రికే తిరిగి మరోసారి భేటీ అవుతారనే చర్చ... ఇరు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

సీట్ల సర్దుబాటుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తుది కసరత్తు ముమ్మరం చేశారు. ఈ విషయమై ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్, కీలక భేటీలో పాల్గొన్నారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం నుంచి తన సొంత వాహనంలో తానే నడుపుతూ పవన్‌ ఒక్కరే చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఆయన వెళ్లిన 15 నిమిషాల తర్వాత ఆయన భద్రతా వాహనశ్రేణి విడిగా అక్కడికి చేరుకుంది. తన నివాసానికి వచ్చిన పవన్‌ కల్యాణ్‌కు చంద్రబాబు ఆత్మీయ ఆహ్వానం పలికారు. శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానించారు. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పవన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానం పలికారు. అనంతరం చంద్రబాబు, పవన్‌ మాత్రమే భేటీలో పాల్గొన్నారు. చంద్రబాబు నివాసంలో భోజనం చేసిన పవన్‌కళ్యాణ్‌ టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. రాజోలు, రాజానగరం స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ ఇప్పటికే ప్రకటించగా, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అదే స్థానం నుంచి తిరిగి జనసేన అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

BRS​ పార్టీపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

గత 4రోజుల నుంచి హైదరాబాద్‌లోనే మకాం వేసిన చంద్రబాబు, పవన్‌ అభ్యర్థుల ఎంపికపై విడివిడిగా కసరత్తు చేశారు. తాజా భేటీలో దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబు, పవన్ భేటీపై తెలుగుదేశం - జనసేన నేతలు, శ్రేణుల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సీట్ల సర్దుబాటుపై అధికారిక ప్రకటన ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అధికార వైఎస్సార్సీపీ ఇప్పటికే 6 జాబితాలు ప్రకటించినందున, తెలుగుదేశం - జనసేన ఉమ్మడి జాబితాపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కొందరు నేతలు త్యాగాలకు సిద్ధం కావాలని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా నేతలకు ఇప్పటికే చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. పొత్తులో సీటు సర్దుబాటు కాని నేతలకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ సముచిత స్థానం కల్పిస్తానని నేతలకు స్పష్టం చేశారు. జనసేన తాము పోటీ చేసే వాటిలో ఎక్కువ స్థానాలు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోనే కోరినట్లు తెలుస్తోంది.

చంద్రబాబుతో ముగిసిన పవన్ కల్యాణ్ భేటీ.. ఆ అంశాలపై చర్చ..

తొలిసారి భేటీ అనంతరం ఇరు పార్టీల అధినేతలు తమ పార్టీల సొంత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలతో ఎల్పీ సమావేశంలో పాల్గొన్నారు. రేపటి నుంచి ప్రారంభమైయ్యే, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సి వ్యూహంపై చర్చించారు. అదే సమయంలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరీని చేర్చుకునే కార్యక్రమానికి పవన్ హజరైయ్యారు. అనంతరం ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు నివాసంలో రెండోసారి భేటీ కావడం ఇరు పార్టీ వర్గాల్లో సర్వత్రా ఆసక్తిని పెంచింది. టీడీపీ, జనసేన పార్టీలు పోటీ చేసే ఉమ్మడి జాబితాను విడుదల చేసే అంశంపైనే ఈ సమావేశంలో కీలక నిర్ణయం జరుగుతోందని రెండు పార్టీల నేతలు భావిస్తున్నారు. దీంతో ఎవరు, ఏ పార్టీ, ఎక్కడ్నుంచి పోటీ చేస్తుందనే ఉత్కంఠ ఇరు పార్టీ నేతల్లో నెలకొంది. ఈ నెల 8వ తేదీ మరో సారి ఇద్దరు నేతలు భేటీ అనంతరం ఇరు పార్టీల నుంచి సీట్ల సర్థుబాటు, ఉమ్మడి మ్యానిఫెస్టో, బహిరంగ సభలపై స్పష్టత ఇవ్వనున్నట్లు పార్టీవర్గాలు వెల్లడించాయి.

పవన్‌ కల్యాణ్‌తో చంద్రబాబు భేటీ.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ

సర్దుబాట్లు కొలిక్కి వచ్చాయా! ఒకేరోజు రెండుసార్లు చంద్రబాబు, పవన్​ల భేటీపై సర్వత్రా ఆసక్తి

Last Updated : Feb 4, 2024, 10:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.