Chandrababu Met Muslim Minority Communities Leaders: వైఎస్ జగన్కు అన్ని అస్త్రాలు అయిపోయి కుల, మత రాజకీయాలపై పడ్డాడని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ముస్లింలకు మేలు చేసింది చేసేది తెలుగుదేశమేనని స్పష్టం చేశారు. పేద ముస్లింలకు ఇచ్చే రంజాన్ తోఫా రద్దు చేసిన జగన్ నేడు మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి, పలువురు ముస్లిం సంఘాలు చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు.
కోడ్ అమల్లోకి వచ్చినా మారని అధికారుల తీరు- చంద్రబాబు ఇంటివద్ద బెంచీలు ధ్వంసం
పొత్తులపై వైసీపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలని ముస్లిం సంఘాలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మొహంలో ఓటమి భయం కొట్టొచ్చినట్లు కనబడుతోందని అభిప్రాయపడ్డారు. కోడికత్తి డ్రామా నుండి బాబాయ్ హత్య వరకూ అన్ని అస్త్రాలు ఉపయోగించిన జగన్ ఇప్పుడు మతాలు, కులాలపై పడ్డాడన్నారని విమర్శిచారు. జనసేనతో పొత్తు సమయంలో కుల రాజకీయం చేసి బోల్తాపడ్డ జగన్ అండ్ టీం ఇప్పుడు బీజేపీతో పొత్తు (TDP Janasena and BJP alliance) అనంతరం మత రాజకీయానికి తెరతీసిందని ధ్వజమెత్తారు.
శాండ్, ల్యాండ్, వైన్, మైన్, అన్ని రంగాల్లో సీఎం జగన్ దోపిడీ: చంద్రబాబు
టీడీపీ- బీజేపీ పొత్తుతో ముస్లీం మైనారిటీలకు నష్టం అంటూ వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలను నమ్మరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం సంఘాల నేతలు కూడా వైసీపీ మత రాజకీయాలను ఎండగట్టాలని సూచించారు. ముస్లింలపై జగన్కు నిజంగా ప్రేమ ఉంటే వారికి ఇచ్చే రంజాన్ తోఫా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ముస్లింలకు ఇచ్చే దల్హన్ పథకం, దుకాన్ మాకాన్ సహా పది సంక్షేమ పథకాలను రద్దు చేసిన జగన్ ఎన్నికలు రాగానే మత రాజకీయంతో లబ్ధి పొందాలని చూస్తున్నాడని చంద్రబాబు ఎద్దేవా చేసారు.
ఎన్నికల షెడ్యూల్ రాకతో ఏపీ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చింది - వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైంది: చంద్రబాబు
Senior Party Leaders Met Chandrababu in Undavalli: అధినేత చంద్రబాబును పార్టీ సీనియర్ నేతలు ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. నిన్నటి ప్రజాగళం సభ జరిగిన తీరుపై సీనియర్ నేతలతో చంద్రబాబు సమీక్షించారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున భవిష్యత్ కార్యాచరణపై నేతలతో చర్చించారు. ప్రజాగళం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని సభలు నిర్వహించాలని తెలుగుదేశం నిర్ణయించింది. పల్నాడులో ప్రధాని నిన్న పాల్గొన్న సభ విఫలం చేయాలని పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారని నేతలు ఆరోపించారు.
పోలీసుల ప్రయత్నాలను ప్రజలు తిప్పి కొట్టారని తెలిపారు. అధికార పార్టీ ఒత్తిడితో సభకు పోలీసులు అనేక ఆటంకాలు కలిగించారని విమర్శించారు. ఎవరు ఎన్ని ఆటంకాలు కలిగించిన రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ విజయాన్ని ఆపలేరని స్పష్టంచేశారు. ఏపీలో కూటమికి 160 సీట్లు రావడం ఖాయమని నేతలు తేల్చిచెప్పారు.