ETV Bharat / politics

పిన్నెల్లిని అరెస్ట్ చేస్తాం​ - అదనపు ఎస్పీ, డీఎస్పీలతో 8 పోలీసు బృందాలు: ఎం.కె. మీనా - CEO Meena on MLA Pinnelli Arrest

CEO Meena on MLA Pinnelli Ramakrishna Arrest: ఈవీఎం ధ్వంసం ఘటనలో పిన్నెల్లి అరెస్టునకు అదనపు ఎస్పీ, డీఎస్పీలతో 8 పోలీసు బృందాలు ఏర్పాటు చేసినట్లు సీఈఓ మీనా వెల్లడించారు. పోలింగ్‌ కేంద్రంలోని పీవో, ఏపీవోల సస్పెన్షన్‌కు ఆదేశాలిచ్చామన్నారు. మాచర్లలో ఈ సమయంలో పరామర్శలొద్దని రాజకీయనేతలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈవీఎం ధ్వంసం దృశ్యాలు ఈసీ నుంచి బయటకు వెళ్లలేదని స్పష్టం చేశారు.

ceo_meena_on_mla_pinnelli
ceo_meena_on_mla_pinnelli (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 23, 2024, 4:32 PM IST

Updated : May 23, 2024, 10:46 PM IST

CEO Meena on MLA Pinnelli Ramakrishna Arrest: మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని అరెస్టు చేసేందుకు 8 పోలీసు బృందాలు పని చేస్తున్నాయని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా (CEO Mukesh Kumar Meena) తెలిపారు. ఈ ఘటనపై సరైన సమాచారం ఇవ్వనందుకు ఆ సమయంలో విధుల్లో ఉన్న పీఓ, ఏపీఓలను సస్పెండ్ చేయాలని ఆదేశాలిచ్చినట్లు మీనా తెలిపారు. ఈ క్రమంలో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని అరెస్టు చేసేందుకు అదనపు ఎస్పీ, డీఎస్పీలతో 8 పోలీసు బృందాలు పని చేస్తున్నాయని తెలిపారు.

మాటువేసి చెరువులోకి తోసి- మహిళల మృతి కేసులో వీడిన మిస్టరీ - Three Womens Murder Case

మాచర్ల నియోజకవర్గంలో గాయపడిన కార్యకర్తల్ని పరామర్శించేందుకు టీడీపీ నేతలు వెళ్లటం ఇప్పుడు మంచిది కాదని అక్కడ ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయని అన్నారు. టీడీపీ నేతలు కాని ఇప్పుడు వెళ్తే, వైసీపీ నేతలు కూడా పరామర్శలకు వెళ్తామని అంటారు పరిస్థితులు మళ్లీ అదుపు తప్పే అవకాశం ఉందని తెలిపారు. పరామర్శలకు ఈ సమయంలో వెళ్లొద్దని రాజకీయనేతలకు ముఖేష్‌ కుమార్‌ మీనా విజ్ఞప్తి చేశారు. బయటి నుంచి నేతలు ఎవ్వరూ పరామర్శకు వెళ్లకూడదని తెలిపారు. బయటివారిని ఎవ్వరినీ ఆ గ్రామాల్లోనికి వెళ్లనీయవద్దని సూచనలు జారీ చేశామన్నారు.

'పులిరా పులిరా పెద్ద పులిరా, ఈవీఎంలు పగలగొట్టి పిల్లిలా పారిపోయేరా' - పిన్నెల్లిపై నెట్టింట్లో ట్రోల్స్ - Social Media Trolls on Pinnelli

పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన దృశ్యాలు ఈసీ నుంచి బయటకు వెళ్లలేదని మీనా తెలిపారు. దర్యాప్తు సమయంలో ఎక్కడో, ఎవరి చేతినుంచో ఆ వీడియోలు బయటలు వెళ్లాయని అన్నారు. 25వ తేది నుంచి స్ట్రాంగ్ రూంలను పరిశీలించేందుకు రాష్ట్రంలో పర్యటిస్తానని మీనా తెలిపారు. ఈవీఏంను ధ్వంసం చేసిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు విషయంలో ఈసి (Election Commission) సీరియస్​గా ఉందని, త్వరలోనే పోలీసులు అరెస్టు చేస్తారని సీఈఓ మీనా పేర్కొన్నారు.

ఎన్నికలు 2024

ఇద్దరు అధికారులపై వేటు: మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ( EVM ) ధ్వంసం కేసులో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా ఉన్న సత్తెనపల్లి జూనియర్‌ కాలేజ్ లెక్చరర్‌ సుబ్బారావు, పోలింగ్ అధికారిగా ఉన్న వెంకటాపురం జడ్పీ స్కూల్‌ ఉపాధ్యాయురాలు షహనాజ్ బేగంను విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరు అధికారులు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు

Last Updated : May 23, 2024, 10:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.