BRS Leaders Concerns in GHMC Council Meeting : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తొమ్మిదో కౌన్సిల్ సమావేశం వాడీవేడిగా ప్రారంభమైంది. సమావేశ ప్రారంభానికి ముందే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయ ఆవరణలో ఆందోళనకు దిగారు. నగరంలో పారిశుద్ధ్యం అటకెక్కిందని, దీనిపై మేయర్ సహా అధికారులు చోద్యం చూస్తున్నారని కమలం నేతలు మండిపడ్డారు.
రసవత్తరంగా కౌన్సిల్ భేటీ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండోసారి జరుగుతున్న ఈ సమావేశంలో, అధికార, విపక్ష కార్పొరేటర్ల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్, మరికొంత మంది కార్పొరేటర్లు అధికార పార్టీలో చేరడంతో ఈసారి కౌన్సిల్ భేటీ రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్న మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత రాజీనామాల కోసం గులాబీ పార్టీ సభ్యులు పట్టుబట్టాలని, గ్రేటర్ హైదరాబాద్ భారత్ రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు నిర్ణయించారు.
GHMC: జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశంలో రసాభాస
GHMC Council Meeting 2024 : అందులో భాగంగా సమావేశాలు ప్రారంభం కాగానే మేయర్ విజయలక్ష్మి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని, బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. వారి ఆందోళనపై మేయర్ విజయలక్ష్మి స్పందించారు. గులాబీ పార్టీయే ఫిరాయింపులను ప్రోత్సహించిందని ఆమె పేర్కొన్నారు. భారత్ రాష్ట్ర సమితి కార్పొరేటర్ల నిరసనతో జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని 15 నిమిషాలు వాయిదా వేసిశారు. దీంతో మేయర్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. వాయిదా అనంతరం సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి.
ఇక సమావేశంలో పాల్గొన్న నేతలు జీహెచ్ఎంసీ పరిధిలోని సమస్యలు ఏకరువుపెట్టారు. వర్షాకాలం సమీపించినా నాలాల్లో పూడికల తీత పనులు జరగట్లేదని, నేతలు ప్లకార్డులతో ఆందోళన నిర్వహించారు. చెరువులు కబ్జాకు గురవుతున్నాయని తెలిపారు. ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని ఆరోపించారు. ఖాళీ పైపులు, గుర్రం డెక్కలతో కార్పొరేటర్లు తమ నిరసన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని నినాదాలు చేశారు. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశానికి అఫీషియో సభ్యులు తలసానితో పాటుగా గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హజరయ్యారు.
GHMC: నెల నెల గండం.. జీతాలు చెల్లించలేని స్థితిలో జీహెచ్ఎంసీ..!