ETV Bharat / politics

తెలంగాణలో మరో నలుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్‌ - brs mp candidates 2024

BRS Announced Chevella and Warangal MP Candidates: లోక్‌సభ ఎన్నిలకు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో మరో నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. చేవెళ్ల అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, వరంగల్‌ - డాక్టర్ కడియం కావ్య, జహీరాబాద్‌ - అనిల్‌కుమార్‌, నిజామాబాద్‌ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్‌ను భారాస అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్‌, తాజా ప్రకటనతో మొత్తం తొమ్మిది అభ్యర్థిత్వాలు ప్రకటించినట్లైంది.

BRS Announced Chevella and Warangal MP Candidates

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 13, 2024, 10:22 PM IST

BRS Announced Chevella and Warangal MP Candidates : పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలోని మరో నలుగు స్థానాలకు భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను ప్రకటించింది. చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్(Kasani Gnaneshwar), వరంగల్‌ నుంచి కడియం శ్రీహరి కుమార్తె కావ్య, జహీరాబాద్‌ నుంచి అనిల్‌కుమార్‌, నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి బాజిరెడ్డి గోవర్ధన్‌ పేర్లను బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. వరంగల్ లోక్‌సభ పరిధిలోని నేతలతో సమావేశం అనంతరం అభ్యర్థిత్వాలను ఖరారు చేసి ప్రకటించారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ పాలన చూస్తే సమైక్య పాలకులే నయమనిపిస్తోంది: కేసీఆర్‌

రెండు చోట్లా గులాబీ పార్టీకి సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. అయినప్పటికీ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మళ్లీ పోటీకి ఆసక్తి చూపకపోవడంతో అక్కడ కాసాని జ్ఞానేశ్వర్‌కు అవకాశం ఇచ్చారు. వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్(MP Pasunuri Dayakar) రెండు దఫాలుగా ప్రాతినిధ్యం వహించారు. మరోమారు పోటీకి సిద్దమన్న ఆయన, అవకాశం ఇవ్వకపోయినా పార్టీలో కార్యకర్తగా పనిచేస్తానని అన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో సీనియర్ నేత, స్టేషన్‌ఘన్‌పూర్‌ కడియం శ్రీహరి కుమార్తె డాక్టర్ కడియం కావ్య పేరును ఖరారు చేశారు.

BRS MP Candidates 2024 : ఇప్పటికే ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్‌, తాజా ప్రకటనతో మొత్తం తొమ్మిది అభ్యర్థిత్వాలు ప్రకటించినట్లైంది. కాగా తొలి జాబితా వివరాలు గమనిస్తే కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌, పెద్దపల్లి(SC Reserve) స్థానం నుంచి కొప్పుల ఈశ్వర్‌, ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ, ఆ పార్టీ లోక్‌సభాపక్షనేత నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్‌(ఎస్టీ రిజర్వ్‌) నుంచి సిట్టింగ్‌ ఎంపీ మాలోత్‌ కవిత, మహబూబ్‌నగర్‌ నుంచి మన్నె శ్రీనివాస్‌ రెడ్డి(Manne Srinivas Reddy) బరిలో ఉన్నారు.

బీజేపీ రెండో జాబితా విడుదల - తెలంగాణ నుంచి ఆరుగురి పేర్లు ఖరారు

కేసీఆర్‌ ఆఫర్‌కు నో చెప్పిన ఆరూరి : అంతకుముందు బంజారాహిల్స్ నందినగర్​లోని తన నివాసంలో వరంగల్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేసిన కేసీఆర్, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) త్వరగా వ్యతిరేకత మూటగట్టుకొందని అన్నారు. పాలనపై సర్కార్ ఏ మాత్రం దృష్టి సారించడం లేదని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రకారం చూస్తే తొమ్మిది లోక్‌సభ నియోజకవర్గాల్లో పార్టీకి మెజారిటీ ఉందని, నేతలు అందరూ కలిసికట్టుగా కృషి చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు.

వరంగల్ పార్లమెంట్‌ అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేసినా గెలిపించుకుంటామని నేతలు తెలిపారు. తాను పోటీ చేయబోనన్న వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌, ఎవరు అభ్యర్థి అయినా గెలిపించుకుంటామని తెలిపారు. ఒత్తిళ్లు వస్తుంటాయని, రాజకీయంగా అనవసర నిర్ణయాలు తీసుకొని భవిష్యత్ పాడు చేసుకోవద్దని రమేశ్‌కు కేసీఆర్ సూచించారు. భారతీయ జనతా పార్టీకి అభ్యర్థులు లేక తమ వెంట పడుతున్నారన్న ఆరూరి, తనను కూడా బీజేపీలోకి రావాలని అడిగారని చెప్పారు.

తెలంగాణలో 9 మంది బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన - మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.