Bachina Krishna Chaitanya Granite Quarry: నాలుగున్నరేళ్లుగా బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్న బాచిన కృష్ణచైతన్యను తొలగించి ఆయన స్థానంలో పాణెం హనిమిరెడ్డిని సమన్వయకర్తగా ఇటీవలే జగన్ నియమించారు. దీనిపై కృష్ణ చైతన్య అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోకవర్గంలోని అన్ని మండలాల నేతలతో సమావేశాలు నిర్వహించారు. అద్దంకిలో తానే పోటీచేస్తానని అనుచరులకు చెప్పారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం కృష్ణ చైతన్యను సీఎంవోకు పిలిచింది! ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించవద్దని హెచ్చరించింది. అయినా హనిమిరెడ్డితో కలిసి పనిచేసేందుకు కృష్ణచైతన్య విముఖత చూపారు.
అయినా పాణెం హనిమిరెడ్డితో కలిసి పనిచేసేందుకు ఆయన విముఖత చూపారు. నియోజకవర్గంలో మళ్లీ సర్వే చేయించి ప్రజల మద్దతు ఎవరికి ఎక్కువగా ఉంటే వారికే సీటు కేటాయించాలని అధిష్ఠానాన్ని కోరారు. అయితే సమన్వయకర్తతో కలసి పనిచేయాల్సిందేనని వైసీపీ పెద్దలు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో తనకు సీటు వచ్చే అవకాశం లేదని భావించిన కృష్ణచైతన్య పార్టీ మారే యోచనలో ఉన్నట్లు రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో చేరి ప్రకాశం జిల్లాలోని మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి.
ఏపీలో మరోసారి బయటపడ్డ ఫ్యాక్షన్ రాజకీయం - పార్టీ మారలేదని కక్షగట్టిన వై'ఛీ'పీ
ఈ నేపథ్యంలోనే బాపట్ల జిల్లా మల్లాయపాలెంలో కృష్ణచైతన్యకు చెందిన ఆర్ణ స్టోన్స్ గ్రానైట్ క్వారీలో, బుధవారం బాపట్ల జిల్లా మైనింగ్ ఆర్‌ఐ రాజు సిబ్బందితో కలిసి తనీఖీలు చేశారు. క్వారీలో ఎంత పరిమాణంలో రాళ్లు తీసేందుకు భూగర్భగనులశాఖ నుంచి అనుమతి తీసుకున్నారన్న విషయాలు పరిశీలించారు. క్వారీలో ఎంత వెడల్పు, పొడవు, లోతు వరకు తవ్వకాలు చేశారని కొలతలు సేకరించారు.
అదే విధంగా ప్రభుత్వం కేటాయించిన హద్దుల్లోనే తవ్వకాలు చేపట్టారా? పరిధి దాటి తవ్వకాలు చేశారా? అనే కోణంలో క్వారీ హద్దు రాళ్లను పరిశీలించారు. క్వారీ నుంచి వెలికి తీసిన ముడిరాళ్లను లెక్కించి వాటిపై యూడీబీ నంబర్లను నమోదు చేశారు. ఈక్రమంలో చాలావరకు పనికిరావని వృథాగా పడేసిన రాళ్లకు కూడా నంబర్లు వేసినట్లు తెలిసింది. దీనివల్ల ప్రభుత్వం అనుమతించిన వాటికంటే అధిక పరిమాణంలో రాళ్లను తవ్వి తరలించారని అభియోగం మోపే అవకాశం ఉంది.
వైఎస్సార్సీపీలో గొంతెత్తి ప్రశ్నిస్తే - వేటేస్తారు జాగ్రత్త సుమీ!
కృష్ణ చైతన్య వర్గీయులను భయపెట్టి, బెదిరించి తనవైపు తిప్పుకునేందుకే తనిఖీల కొరడా తీశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఆయన మద్దతుదారులైన సహకార సొసైటీల ఇన్‌ఛార్జులను బెదిరించారు. అధిష్టానం మాట వినకపోతే సొసైటీల లావాదేవీలపై విచారణ చేయిస్తామని హెచ్చరికలు పంపారు.
అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం గతంలో తెలుగుదేశం ఎమ్మెల్యే గొట్టిపాటి రవి క్వారీల్నీ వేధించి మూసేయించింది. ఇప్పుడు ధిక్కార అడుగులు వేస్తున్న కృష్ణచైతన్యకూ అదే ట్రీట్‌మెంట్ ఇచ్చేపనిలో ఉంది. 14 నెలలుగా క్వారీలో కనిపించని తప్పులు, ఇప్పుడే ఎందుకు కనిపిస్తున్నాయంటూ కృష్ణచైతన్య మద్దతుదారులు నిలదీస్తున్నారు. తనిఖీల పేరుతో వ్యాపారాలను దెబ్బతీసి దారికి తెచ్చుకోవాలని కుట్రపన్నారని ఆరోపిస్తున్నారు.
ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జ్ మార్పు - అసంతృప్తిలో ఎమ్మెల్యే కుమారుడు