ETV Bharat / politics

మంత్రివర్గ సమావేశంలో 18 అంశాలపై చర్చ - నిర్ణయాలివే - Cabinet meeting decisions - CABINET MEETING DECISIONS

AP Cabinet Decisions : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో రెండో ఇ-కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 18 అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి వివరించారు.

cabinet_meeting_decisions
cabinet_meeting_decisions (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 18, 2024, 5:21 PM IST

AP Cabinet Decisions : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో రెండో ఇ-కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 18 అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. అంశాలవారీగా నిర్ణయాలు ఈ విధంగా ఉన్నాయి.

సాధారణ పరిపాలనా విభాగం (GAD) : ముఖ్యమంత్రి సహాయనిధి కేసులు, సీఎం ఫిర్యాదులు తదితర అంశాలను పరిష్కరించేందుకు అవసరమైన యంత్రాంగాన్ని పటిష్ఠం చేసేందుకు వివిధ కేటగిరీల్లో (58) పోస్టులను తాత్కాలికంగా సృష్టించేందుకు మంత్రి మండలి ఆమోదించింది.

అందుబాటులోకి నాణ్యమైన బ్రాండ్లు - రూ.99కే మద్యం - AP Cabinet Meeting Today

గ్రామ, వార్డు సచివాలయాలు : గ్రామ/వార్డు వాలంటీర్లు, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు నెలకు రూ.200 చొప్పున అదనపు ఆర్థిక సాయం అందించాలని గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరణకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.205 కోట్లు నష్టం వాటిల్లిందని, దీనిపై కమిటీ వేసి పూర్తి వివరాలను సేకరించాలని మంత్రి మండలికి ముఖ్యమంత్రి సూచించారు.

పరిశ్రమలు, మౌలిక సదుపాయాల శాఖ : విజయనగరం జిల్లాలో నిర్మాణంలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి "అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం" గా పేరు మార్చడానికి రాష్ట్ర శాసనసభ ఉభయ సభల ముందు ఆమోదం తెలిపే తీర్మానం, కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయడానికి చేసిన ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదించింది.

పరిశ్రమలు, వాణిజ్యం : 203 పారిశ్రామిక భూ కేటాయింపులను ఆమోదించడానికి చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమం : రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత నిస్తూ ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ప్రాక్షన్ (STEMI - స్టెమీ) కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కమ్యునిటీ స్థాయిలో సమగ్ర క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించేందుకు మంత్రి మండలి ఆమోదించింది. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తవుతున్న సందర్బంగా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో (RBSK-అర్బీఎస్కే) భాగంగా అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

పరిశ్రమలు, వాణిజ్యం : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ) లకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.100 కోట్లతో ప్రాథమిక కార్పస్ ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీం ద్వారా సుమారు 35,000 కొత్త గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులు ప్రయోజనం కలుగనుంది.

హోం శాఖ : రూ.3 కోట్ల కార్పస్ నిధితో ఆంధ్రప్రదేశ్ ఎక్స్-సర్వీస్మెన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APEXCO) ఏర్పాటుకు రాష్ట్ర మంత్రి మండలి చేసిన ప్రతిపాదన, ముఖ్యమంత్రి రూ.10 కోట్ల కార్పస్ నిధి ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

పరిశ్రమలు, వాణిజ్యం : కడప జిల్లా కొప్పర్తిలోని మెగా ఇండస్ట్రియల్ హబ్​లో గతంలో ఆమోదించిన ప్రదేశానికి బదులుగా అమరావతిలో రెండో ఎంఎస్​ఎంఈ టెక్నాలజీ సెంటర్ (టీసీ) కమ్ టెస్టింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఆర్​డీఏ ద్వారా రాజధాని ప్రాంతంలో 20 ఎకరాల భూమిని అందజేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

ప్రణాళిక శాఖ : విజన్ డాక్యుమెంట్ వికసిత్ ఆంధ్ర 2047 పేరును స్వర్ణాంధ్ర @ 2047గా మార్చడానికి చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

మానవ వనరుల (ఉన్నత విద్య) శాఖ : కృత్రిమ మేధ, సంబంధిత సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు అమరావతిలో ఏఐ యూనివర్సిటీ, స్కిల్లింగ్ అకాడమీని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్న ఎస్.ఆర్.ఎం.యూనివర్శిటీని యు.జి.సి. నిబంధనలు-2023 ప్రకారం డిస్టింక్టు కేటగిరీలో “డీమ్డ్​ టు బి యూనివర్శిటీ” గా కన్వర్టు చేసేందుకు అవసరమైన “నో అబ్జక్షన్ సర్టిఫికేట్” (NOC)ను ప్రభుత్వ పరంగా జారీచేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

వెనుబడిన వర్గాల సంక్షేమ శాఖ : రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల వారికి రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

వ్యవసాయం, మార్కెటింగ్ శాఖ : రాష్ట్రంలోని సహకార సంఘాల పనితీరును మెరుగుపర్చాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టం 1964లో క్లాజు (ఐ-1)ను తొలగించి, సెక్షన్ 2లో క్లాజు (ఎన్-ఐ)ను చేర్చే చట్ట సవరణ ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

జల వనరుల శాఖ : రాష్ట్ర జీవనాడి పోలవరం జాతీయ ప్రాజెక్టులో భాగమైన ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ (ఇసిఆర్ఎఫ్) గ్యాప్ 2 పనుల్లో భాగంగా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను ప్రస్తుతం ఉన్న ఏజన్సీతోనే కొనసాగించేందుకు పోలవరం చీఫ్ ఇంజినీరు ప్రతిపాదించిన రాటిఫికేన్ ఆర్డర్స్ కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

రైతు భరోసా కేంద్రాల పేరు మార్పు : గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల పేరును రైతు సేవా కేంద్రంగా మార్పు ఇప్పటికే జారీ చేసి జి.ఓ.ను ర్యాటిపై చేస్తూ మంత్రి ఆమోదం తెలిపింది.

రెవెన్యూ (ఎక్సైజ్) : నూతన ఎక్సైజ్ పాలసీ అమలుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అక్టోబరు మొదటి వారం నుంచి ఈ నూతన పాలసీ అమలు కానుంది. మద్యం ధరలు, రిటైల్ వ్యాపారం, పన్నులపై కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫార్సులను మంత్రి మండలి ఆమోదించింది. మద్యం ఆదాయ సామర్థ్యాన్ని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా మద్యం అమ్మకాల కోసం ప్రైవేట్ రిటైల్ విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నూతన విదానం రెండేళ్ల కాలపరిమితిని కలిగి ఉంటుంది, దీంతో రిటైలర్ల ఎక్కువ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని 3,736 దుకాణాల్లో గీత కులాలకు 10% అంటే 340 దుకాణాల కేటాయింపు. తక్కువ ధరకే నాణ్యమైన పలు రకాల మధ్యాలను అందుబాటులోకి తీసుకురావాలని, అందుకు అనుగుణంగా తగు చర్యలు చేపట్టాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

'జగన్ అతి పెద్ద లిక్కర్ సిండికేట్' - నూతన మద్యం విధానంపై సీఎంతో మంత్రుల సమావేశం - CM Review on New Liquor Policy

సీనియర్‌ సిటిజన్లకు గుడ్ న్యూస్- 70 ఏళ్లు పైబడిన వారికి ఆయుష్మాన్‌ భారత్‌ వర్తింపు - Ayushman Bharat 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.