ETV Bharat / politics

నేడే తేలనున్న అసలు సిసలు ఫలితాలు - ఎగ్జిట్‌పోల్స్‌ ఎగ్జాట్‌ పోల్స్‌గా మారాయా? - andhra pradesh election 2024 - ANDHRA PRADESH ELECTION 2024

Andhra Pradesh Election 2024 Results: పల్లె నుంచి పట్నం వరకు, సామాన్యుడి నుంచి రాజకీయ నేతల వరకు ఒకటే ఉత్కంఠ! ఆంధ్రా పీఠాన్ని అధిష్టించేదెవరు? ఓటర్ల వరమాల దక్కేది ఎవరికి? పోలింగ్‌ పూర్తి అయిన మే 13 నుంచి అంతటా ఇదే చర్చ. రాజకీయంగా అత్యంత ఉత్కంఠ రేకెత్తించిన రాష్ట్ర ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమినే విజయం వరించబోతోందని అత్యధిక ఎగ్జిట్‌పోల్స్‌ సంస్థలు అంచనా వేశాయి. మరి ఆ ఎగ్జిట్‌పోల్స్‌ ఎగ్జాట్‌ పోల్స్‌గా మారాయా లేదా అన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

Andhra Pradesh Election 2024 Results
Andhra Pradesh Election 2024 Results (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 4, 2024, 7:09 AM IST

Andhra Pradesh Election 2024 Results: రాష్ట్ర ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో తెలిసే సమయం ఆసన్నమైంది. అయితే మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం తెలుగుదేశం కూటమికే పట్టం కట్టాయి. ఏకపక్ష విజయంతో కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు సర్వేలన్నీ ఢంకా బజాయించాయి. సైకిల్ స్పీడ్‌కు వైఎస్సార్సీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడం ఖాయమని తేల్చిచెప్పాయి. ఎగ్జిట్‌ ఫలితాల్లో ఎనిమిది ప్రధాన సర్వేలను పరిశీలిస్తే అందులో ఏడు ఎన్డీయే కూటమి ఈసారి ఆంధ్రావనిలో అధికారంలోకి వస్తోందని స్పష్టం చేశాయి! ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జాగ్రత్తపడి పొత్తులతో కలసికట్టుగా బరిలోకి దిగిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి దాదాపు అన్ని సర్వేలూ 100కుపైగా సీట్లు వస్తాయని చెప్పాయి.

ప్రముఖ జాతీయ ఛానెళ్ల సర్వేల్లో ఒకటి తప్ప అన్నీ ఎన్డీయే కూటమి విజయం ఖాయమని ముక్తకంఠంతో చెప్పాయి. ఇటీవలి కాలంలో దాదాపు కచ్చితమైన ఫలితాలను అంచనా వేస్తున్న ఇండియా టుడే-యాక్సిస్‌ మై ఇండియా సర్వే లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమికి 21 నుంచి 23 సీట్లు వచ్చే అవకాశాలున్నాయని వెల్లడించింది. కూటమికి ఈసారి రికార్డు స్థాయిలో 53శాతం ఓట్లు రావొచ్చని అధికార వైఎస్సార్సీపీ 41శాతం ఓట్లతో కేవలం 2నుంచి 4 సీట్లకు పరిమితం కావొచ్చని అంచనా వేసింది.

అసెంబ్లీ ఫలితాల్లో తెలుగుదేశం సొంతంగా 78 నుంచి 96 స్థానాల్లో విజయం సాధిస్తుందని మిత్రపక్షాలు జనసేన 16 నుంచి 18 స్థానాల్లో, బీజేపీ 4 నంచి 6 స్థానాల్లో గెలుపొందుతాయని ఇండియా టుడే- మై యాక్సిస్‌ అంచనా వేసింది. మొత్తంగా NDAకు 98 నుంచి 120 సీట్లు వస్తాయని ఎగ్జిట్‌పోల్స్ ప్రకటించింది. ఇక అధికార వైఎస్సార్సీపీకి 55 నుంచి 77 స్థానాలు వస్తాయని జోస్యం చెప్పింది. కాంగ్రెస్‌కు జీరో నుంచి 2 సీట్లు వస్తాయని తెలిపింది. కూటమికి 51 శాతం, వైఎస్సార్సీపీకి 44 శాతం, కాంగ్రెస్‌కు 2 శాతం ఓట్లు వచ్చినట్లుగా వెల్లడించింది.

ఔను భయ్యా!! ఈసారి బాబు వస్తారా? లేదా మళ్లీ జగన్ మామేనా?- ఏపీ ఫలితాలపై హైదరాబాద్​లో చర్చలు - AP Election Result 2024

ఇండియా టీవీ కూడా రాష్ట్రంలో కూటమిదే ఆధిపత్యమని తేల్చింది. 25 లోక్‌సభ సీట్లలో తెలుగుదేశం 13 నుంచి 15, బీజేపీ 4 నుంచి 6, జనసేన 2 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. ఇక వైఎస్సార్సీపీ 3 నుంచి 5 స్థానాలతో సరిపెట్టుకోవాల్సిందేనని అంచనా వేసింది. CNX అనే సంస్థ కూడా కూటమిదే హవా అని తేల్చింది. తెలుగుదేశం 13 నుంచి 15 , బీజేపీ 4 నుంచి 6, జనసేన 2, వైఎస్సార్సీపీ 3 నుంచి 5 స్థానాలు గెలుచుకుంటాయని తెలిపింది. ఏబీపీ - సీ ఓటర్‌ సంస్థ తెలుగుదేశం కూటమికి 21 నుంచి 25 స్థానాలు కట్టబెట్టగా వైఎస్సార్సీపీ నాలుగు స్థానాల వరకూ గెలుచుకోవచ్చని తెలిపింది.

ఇండియా న్యూస్- డీ-డైనమిక్స్‌: ఇండియా న్యూస్- డీ-డైనమిక్స్‌ కూడా తెలుగుదేశం కూటమి 18 స్థానాలు గెలుచుకోనుండగా వైఎస్సార్సీపీ 7 స్థానాలతో సరిపెట్టుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. న్యూస్‌-18 సంస్థ కూడా తెలుగుదేశం కూటమిదే విజయమని తేల్చింది. టీడీపీ కూటమి అత్యధికంగా 19 నుంచి 22 స్థానాలు కైవసం చేసుకోనుండగా వైఎస్సార్సీపీ 5 నుంచి 8 స్థానాలకు పరిమితం కావాల్సిందేనని స్పష్టం చేసింది. మరో జాతీయ సంస్థ టుడేస్‌ చాణక్య కూడా తెలుగుదేశం కూటమికే పట్టం కట్టింది. ఆ కూటమి 19నుంచి 25 స్థానాలు గెలుచుకోనుండగా వైఎస్సార్సీపీ సున్నా నుంచి 6 స్థానాలు దక్కించుకోవచ్చని తెలిపింది.జాతీయ మీడియా సంస్థ టైమ్స్‌ నౌ మాత్రం వైఎస్సార్సీపీకి 13 నుంచి 15 లోక్‌సభ స్థానాలు గెలవొచ్చని తెలిపింది. తెలుగుదేశం 7 నుంచి 9 స్థానాలు, జనసేన 1, బీజేపీ 2 సీట్లు కైవసం చేసుకుంటాయని అంచనా వేసింది.

కొవ్వూరు, నరసాపురంలో 5 గంటల్లో ఫలితాలు: సీఈవో మీనా - CEO Meena on Counting Arrangements

కేకే సర్వే: ఏపీ అసెంబ్లీ ఫలితాల్లో టీడీపీ కూటమి రికార్డు స్థాయి మెజార్టీతో విజయం సాధించబోతున్నట్లు కేకే సర్వేస్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేసింది. 175 స్థానాలకుగాను కూటమి 161 సీట్లు సాధించనుందని, వైఎస్సార్సీపీ కేవలం 14 సీట్లకే పరిమితం అయ్యే అవకాశాలున్నాయని కేకే సర్వేస్‌ అధినేత కేకే మూర్తి తెలిపారు. 144 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ 133 సీట్లు, జనసేన పోటీ చేసిన 21, బీజేపీ 10 సీట్లకుగాను 7 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయన్నారు. పార్లమెంట్‌ స్థానాల్లో 25కి 25 సీట్లను కూటమి కైవసం చేసుకుని క్లీన్‌ స్వీప్‌ చేయవచ్చన్నారు. టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 స్థానాలు గెలుస్తుందని అంచనా వేశారు. శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో వైఎస్సార్సీపీ ఖాతా కూడా తెరవదని చెప్పారు.

రైజ్‌ సంస్థ: రైజ్‌ సంస్థ కూటమికి 113నుంచి 122 స్థానాలు వస్తాయని చెప్పింది. వైఎస్సార్సీపీకి 48నుంచి 60 స్థానాలు రావొచ్చని అంచనా వేసింది. పార్టీల వారీగా తెలుగుదేశం పార్టీకి 92 నుంచి 99 సీట్లు, జనసేనకు 11 నుంచి 16 సీట్లు, బీజేపీకి 0 నుంచి 3 స్థానాలు రావొచ్చని తెలిపారు. కూటమికి 50.49 శాతం ఓట్లు, వైఎస్సార్సీపీకి 44.86 శాతం ఓట్లు వస్తాయని చెప్పారు. ఇతరులకి 4.65 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేశారు. కూటమి 17 నుంచి 20 లోక్‌సభ స్థానాలు, వైఎస్సార్సీపీకి 7 నుంచి 10 లోక్‌సభ స్థానాలు వస్తాయని తెలిపారు.

ఓటమిని తట్టుకోలేక వైఎస్సార్సీపీ నేతలు హింసకు పాల్పడే ప్రమాదం ఉంది: చంద్రబాబు - Chandrababu Naidu

మిగతా సర్వేలు గమనిస్తే చాణక్య స్ట్రాటజీస్‌ సర్వే ప్రకారం కూడా ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. తెలుగుదేశం కూటమి114 నుంచి 125 సీట్లు చేజిక్కించుకోనుండగా వైఎస్సార్సీపీ 39 నుంచి 49 స్థానాలకు మించదని తేల్చిచెప్పింది. ఇతరులు ఒక స్థానం గెలుచుకోవచ్చని అంచనా వేసింది. ఇక లోక్‌సభ విషయానికొస్తే తెలుగుదేశం కూటమి అత్యధికంగా 17 నుంచి 18 సీట్లు దక్కించుకోనుండగా వైఎస్సార్సీపీ 6 నుంచి 7 స్థానాలకే పరిమితం కాబోతోందని వెల్లడించింది.

తెలుగుదేశం కూటమి ఏకపక్ష విజయాన్నందుకోబోతున్నట్లు పయనీర్ అనే సర్వే సంస్థ స్పష్టం చేసింది. తెలుగుదేశం కూటమి అత్యధికంగా 144 స్థానాలు గెలుచుకోనుండగా వైఎస్సార్సీపీ 31 సీట్లతో చతకిలపడడం ఖాయమని తేల్చింది. ఇక లోక్‌సభ సీట్లలో తెలుగుదేశం 20, వైఎస్సార్సీపీ 5 స్థానాలు దక్కించుకుంటాయని అంచనా వేసింది. జనగళం సర్వే సంస్థ కూడా కూటమికే జనామోదమని స్పష్టం చేసింది. తెలుగుదేశం కూటమి 104 నుంచి 118 స్థానాలు గెలుచకోనుండగా వైఎస్సార్సీపీ 44 నుంచి 57 స్థానాలకు పరిమితం కాబోతోందని తెలిపింది.

మోదీ 3.0 vs ఇండియా కూటమి- కౌంటింగ్​కు అంతా రెడీ- నెహ్రూ రికార్డు సమం చేస్తారా? - lok sabha election results 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.