MLA Annabattuni Shivakumar Beat Voter : రాష్ట్రంలో సామాన్యుడికి భద్రత కొరవడింది. ప్రశ్నించడమే పెద్ద నేరమైంది. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో దళిత, బీసీ వర్గాలు బిక్కుబిక్కుమంటూ గడపగా సామాన్యుడు స్వేచ్ఛగా బయట తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. అన్యాయంపై గళమెత్తాలన్నా, అక్రమాలను ప్రశ్నించాలన్నా పెద్ద సాహసమే అనే పరిస్థితి తలెత్తింది. ఇసుక అక్రమ తరలింపును అడ్డుకునేందుకు వచ్చిన అధికారులపై బెదిరింపులు చూశాం. ట్రాక్టర్ పైకెక్కించి చేసిన హత్యా ప్రయత్నాలనూ గమనించాం. తాజాగా ఎన్నికల వేళ అధికార పార్టీ ఎమ్మెల్యే అహంకారం, అనుచరగణం చేసిన హత్యాయత్నానికి వందలాది ఓటర్లే ప్రత్యక్ష సాక్ష్యం. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం ఐతానగర్‌లో జరిగిన ఈ ఘటన సభ్యసమాజానికి ఎలాంటి సందేశం ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధికార పార్టీ నేతల అహంకారానికి పరాకాష్టగా నిలుస్తున్న ఈ దారుణం ప్రతి ఒక్కరిలో నెత్తురు మరిగిస్తోంది.
బారులుదీరిన ఓటర్లు - ఉదయం 9 గంటలకు 9.21శాతం పోలింగ్ నమోదు - POLL PERCENTAGE
గుంటూరు జిల్లా తెనాలిలో అధికార పార్టీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ రెచ్చిపోయారు. ఓటరుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శివకుమార్ దాడికి తెగబడ్డారు. ఐతనగర్ పోలింగ్ బూత్‌లో ఓటు వేయటానికి వచ్చిన ఎమ్మెల్యే క్యూ పద్ధతి పాటించకుండా నేరుగా లోపలికి వెళ్లబోయారు. క్యూలైన్ లో రావాలంటూ అభ్యంతరం చెప్పిన ఓటర్‌పై ఎమ్మెల్యే రెచ్చిపోయారు. ఏ మాత్రం ఆలోచించకుండా అహంకారంతో అతడి దగ్గరకు వెళ్లి చెంపదెబ్బ కొట్టారు. వెంటనే ఓటరు కూడా ఎమ్మెల్యే శివకుమార్ చెంప చెళ్లుమనిపించారు. దీంతో ఎమ్మెల్యే అనుచరమూక విచక్షణారహితంగా దాడి చేయడంతో ఓటరు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనతో పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఐతానగర్‌లో ఓటర్‌పై జరిగిన దాడిపై స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ మిశ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐతానగర్ పోలింగ్ బూత్ వద్ద పరిస్థితిని తెలుసుకున్న దీపక్ మిశ్రా సీసీ ఫుటేజ్‌ను తెప్పించాలని ఆదేశించారు. హింసాత్మక ఘటనలు జరిగిన మరో 5 ప్రాంతాల్లోని పరిస్థితిపై నివేదిక కోరారు. పోలింగ్ సరళిని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించారు. హింసాత్మక ఘటనలు జరగకుండా చూడాలని చెప్పారు. ఇప్పటివరకు జరిగిన పోలింగ్ సరళిని ఎం.కె.మీనా మిశ్రాకు వివరించారు. 42 వేల సీసీ కెమెరాలు పెట్టినా హింసాత్మక ఘటనలేంటని దీపక్ మిశ్రా ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.
వైఎస్సార్సీపీ నేతల బెదిరింపులు - భయాందోళనలో ఓటర్లు - clashes in ap elections
ఎమ్మెల్యే శివకుమార్ దాడిలో గాయపడిన గొట్టిముక్కల సుధాకర్ ను పోలీసులు టూ టౌన్ పోలీసు స్టేషన్ కు తరలించారు. ఎమ్మెల్యే శివకుమార్ అతని అనుచరులు విచక్షణారహితంగా కొట్టడంతో సుధాకర్ కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన సుధాకర్ ను వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించకుండా పోలీసు స్టేషన్ కు తరలించడంపై స్థానికులు, తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. మొదట దాడి చేయడమే కాకుండా నలుగురైదుగురు కలిసి ఏ తప్పూ చేయని సుధాకర్ ను కొడితే ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోకుండా బాధితుడిని అదుపులోకి తీసుకోవడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఘటన జరిగిన తర్వాత నుంచి దాదాపు మూడు నాలుగు గంటలు ఎవరని కలవనీయకుండా స్టేషన్ లోనే ఉంచడం పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయితే ఎమ్మెల్యే శివకుమార్ పై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఓటింగ్ అయ్యే వరకు గృహ నిర్భందం చేయాలని ఆదేశించింది.