ETV Bharat / politics

టెన్త్​ ఫలితాల్లో 17 పాఠశాలల్లో జీరో రిజల్ట్ - రాష్ట్రవ్యాప్తంగా 86.69% ఉత్తీర్ణత - AP SSC RESULTS 2024 - AP SSC RESULTS 2024

AP 10th Class Results 2024: పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 17 పాఠశాలల్లో ఉత్తీర్ణతే నమోదు కాలేదు. ఇందులో అత్యధికంగా 13 ప్రైవేటు పాఠశాలలు ఉండగా 3 ఎయిడెడ్ మరో ప్రభుత్వ పాఠశాల ఉంది. ఇక 4737 జడ్పీ ఉన్నత పాఠశాలలకు గాను 436 పాఠశాలలు నూరు శాతం ఫలితాలు సాధించాయి. గతేడాది 38పాఠశాలల్లో జీరో ఫలితాలు రాగా వాటిలో 22 ప్రైవేటు, 7 ఎయిడెడ్ మరో 5 జడ్పీ, 3 ఆశ్రమ, మరో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి.

ssc_results_2024
ssc_results_2024
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 22, 2024, 12:46 PM IST

Updated : Apr 22, 2024, 1:18 PM IST

AP 10th Class Results 2024: పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 17 పాఠశాలలు జీరో శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి. ఇందులో అత్యధికంగా 13 ప్రైవేటు పాఠశాలలు ఉండగా 3 ఎయిడెడ్ మరో ప్రభుత్వ పాఠశాల ఉంది. ఇక 4737 జడ్పీ ఉన్నత పాఠశాలలకు గాను 436 పాఠశాలలు నూరు శాతం ఫలితాలు సాధించాయి. గతేడాది 38 పాఠశాలల్లో జీరో శాతం ఫలితాలు రాగా వాటిలో 22 ప్రైవేటు, 7 ఎయిడెడ్ మరో 5 జడ్పీ, 3 ఆశ్రమ, మరో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. నాడు-నేడు పనులతో పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని చెప్పిన ప్రభుత్వం విద్యార్థుల సామర్థ్యాలను పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది.

మార్చి 18 నుంచి 30వరకు ఎస్​ఎస్​సీ పరీక్షలు నిర్వహించగా ఏప్రిల్​ 1 నుంచి 8వ తేదీ వరకు పరీక్ష పత్రాల వాల్యుయేషన్​ క్యాంపులు కొనసాగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 26 క్యాంపుల్లో మూల్యాంకనం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 6,156, 615 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. రెగ్యులర్‌ అభ్యర్థుల ఉత్తీర్ణత శాతం 86.69% నమోదు కాగా, బాలురు 84.32%, బాలికలు 89.17% ఉత్తీర్ణత సాధించారు. బాలికల మొత్తం ఉత్తీర్ణత శాతం బాలుర కంటే 4.85% ఎక్కువగా నమోదైంది. 2803 పాఠశాలలు 100% ఉత్తీర్ణతను సాధించగా, 17 పాఠశాలలు సున్నా (0) ఫలితాలు నమోదు చేశాయి. పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రంలో అత్యధిక శాతం అంటే 96.37% ఉత్తీర్ణత సాధించి అగ్రస్థానంలో నిలవగా, అత్యల్పంగా కర్నూలు జిల్లా అంటే 62.47% ఫలితాలతో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఇక రెసిడెన్షియల్​, బీసీ సంక్షేమ పాఠశాలలు అత్యధికంగా 98.43% ఉత్తీర్ణత సాధించాయి. మొత్తం 616615మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, వీరిలో 314610 బాలురు, 302005 బాలికలు ఉన్నారు.

Zero Results: 22 ప్రభుత్వ పాఠశాలల్లో 'సున్నా' ఫలితాలు.. దీనికి బాధ్యత ఎవరిది ?

తెలుగు మీడియం విద్యార్థులు 161881 మందికి గాను 115060 (71.08శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు 450304 మందికి గాను 15743 (92.32శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది 2803 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించగా, 17 పాఠశాలలు 0 % ఉత్తీర్ణత నమోదు చేశాయి. అంటే ఆయా పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఒక్కరు కూడా పాస్​ కాలేదని తెలుస్తోంది.

AP 10th Class Results 2023: పదవ తరగతిలో షాకింగ్​ ఫలితాలు.. 38 పాఠశాలల్లో ఒక్కరూ కూడా..

వీటిలో ప్రభుత్వ, జిల్లా పరిషత్​, మోడల్ స్కూళ్లు, మున్సిపల్​, రెసిడెన్షియల్​, సాంఘిక, గురుకుల, కేజీబీవీ, బీసీ సంక్షేమ, ఎయిడెట్​, ప్రైవేటు, ఆశ్రమ పాఠశాలలు గతేడాది 11646 పాఠశాలలు ఉండగా 38 పాఠశాలలు జీరో ఫలితాలు నమోదు చేశాయి. 933పాఠశాలలు 100శాతం ఫలితాలు సాధించాయి. ఈ ఏడాది విడుదలైన ఫలితాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పాఠశాలల సంఖ్య 11645 కాగా, 17పాఠశాలలు జీరో ఫలితాలు నమోదు చేశాయి. 2803 పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించాయి. ఎస్​ఎస్​సీ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24నుంచి జూన్​ 3వరకు జరగనున్నాయి. ఈ నెల 23నుంచి 30 వరకు అదనపు రుసుము లేకుండా ఫీజు చెల్లించే వీలుంది. మే 1 నుంచి 23 వరకు రూ.50 అదనంగా చెల్లించి ఫీజు చెల్లించే గడువు ఉంది.

నేడే పది ఫలితాలు విడుదల - ఈ వెబ్​సైట్లలో చూసుకోండి ! - AP SSC RESULTS 2024

Last Updated : Apr 22, 2024, 1:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.