YCP Government Not Complete Irrigation Projects: తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జలయజ్ఞం కలను ఆయన తనయుడు జగన్ ఎంతవరకు నెరవేర్చారు. వైసీపీ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన హామీలను సీఎం జగన్ నిలబెట్టుకున్నారా. పోలవరం ఈ ఐదు సంవత్సరాలలో ఎంత వరకు పూర్తి చేశారు. రాయలసీమ బిడ్డగా ఆ కరవు గడ్డ దాహర్తిని ఎంత వరకూ తీర్చారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పరిపూర్తి చేశారా. క్షామంతో అల్లాడే ప్రకాశంలో నీళ్లు పారించారా ?
జగన్ సీఎం అయ్యాక ఎన్ని లక్షల ఎకరాలకు కొత్తగా సాగు నీరు అందించారు. ఎన్ని కొత్త ప్రాజెక్టులు కట్టారు. పాత ప్రాజెక్టులు ఎన్ని పూర్తి చేశారు. సాగు, తాగునీటి రంగాలపై ఈ ప్రభుత్వం చెప్పిందేమిటి, చేసిందేమిటి? అనే అంశంపై ప్రతిధ్వని కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ నేత కుమారస్వామి, నీటి పారుదలరంగ నిపుణులు లక్ష్మీనారాయణ పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
జగన్ 2019లో సీఎం అయ్యాక రాష్ట్రంలో కొత్తగా ఏ ప్రాజెక్టును ప్రారంభించలేదని లక్ష్మీనారాయణ అన్నారు. ప్రస్తుత ప్రాజెక్టులను సైతం పూర్తి చేయలేదన్నారు. కొత్తగా ఆయకట్టును కల్పించినటు వంటి పరిస్థితులు కూడా లేవని ఆయన విమర్శించారు. పూరాతనమైన ప్రాజెక్టులను సైతం మరమ్మతులు చేసిన దాఖలాలు లేవని ఆయన అన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు వరదలకు పూర్తిగా కొట్టుకుపోయి 39 మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా అనేక గ్రామాల ప్రజలు నిరాశ్రయులుగా గుడిసెల్లో జీవిస్తున్నారని తెలిపారు. జగన్ ప్రభుత్వం నిర్వాహణ బాధ్యత కూడా సక్రమంగా చేయకపోవడం వల్ల కొన్ని ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయానని పేర్కొన్నారు.
బట్టబయలైన వైసీపీ, వాలంటీర్ల బంధం - రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం ప్రజలు ఏం చేయాలి?
శ్రీశైలం ప్రాజెక్టు కూడా మరమ్మతులు చేయకపోతే ప్రమాదం ముంచుకొస్తుందని మళ్లీ మళ్లీ నిపుణులు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. పోలవరం సంక్షోభంలోకి నెట్టివేయబడిందని ఆయన విమర్శించారు. మొత్తం ఈ ప్రాజెక్టులు అన్నింటికీ 500 కోట్ల రూపాయలు మించలేదన్నారు. నెల్లూరు ఆనకట్టను గత ప్రభుత్వం 75 శాతం పూర్తి చేస్తే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దానిని జాతికి అంకితం చేసి గొప్పలు చెప్పుకుందని మండిపడ్డారు.
హిందూ ఆలయాలపై పదేపదే దాడులు - మరోసారి వైసీపీ వస్తే పరిస్థితి ఏంటి? - Attacks on Hinduism in AP
నీటిపారుదల రంగంపై జగన్ ఏమాత్రం అవగాహన లేదని భారతీయ కిసాన్ సంఘ్ నేత కుమారస్వామి అన్నారు. వైసీపీ ప్రభుత్వ ఐదు సంవత్సరాల పనితీరు చూసుకుంటే అన్నపూర్ణగా పిలువబడే ఆంధ్ర రాష్ట్రంలో సాగునీటి సమస్యను జగన్ ప్రభుత్వం విఫలమైందన్నారు. జగన్ బటన్ నొక్కడమే పనిగా పెట్టుకున్నారు తప్ప వ్యవసాయ, నీటి పారుదల రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేశారని ఆయన విమర్శించారు.
కడప వాసిగా రాయలసీమ ప్రాజెక్టులపై ప్రత్యేకంగా లక్ష్మీనారాయణ పుస్తకాలు రాసి వాటిని అధ్యయనం చేశారు. దశాబ్దాల క్రితమే మీరు వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో కడప జిల్లాలో ఆయనతో కలిసి పనిచేశారు. అంతకు ముందే చంద్రబాబు నాయుడితో ఎస్వీ యూనివర్సిటీలో ఆయనకు పరిచయం ఉంది. ముగ్గురు ముఖ్యమంత్రుల్లో ప్రాజెక్టుల నిర్మాణానికి వేగంగా కృషి చేసింది రాజశేఖర్‌రెడ్డి అని ఆయన అన్నారు. సీఎం జగన్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టులన్నింటినీ పడకేసినటువంటి ఖ్యాతి ఆయనకే దక్కుతుందని లక్షీనారాయణ విమర్శించారు.