Pratidwani : కాలంతో పాటు యువత ఆకాంక్షలు ఆశయాల్లో అనేక మార్పులు వస్తున్నాయి. ఏటా డిగ్రీలు, పీజీలు చేతపట్టుకుని ఉద్యోగాల వేట మొదలుపెట్టే వారి సంఖ్య లక్షల్లో ఉంటోంది. కానీ వారిలో 20% మందికే ఆశించిన కొలువులు లభిస్తుండగా 15 నుంచి 20% మంది చదివిన చదువుకు సంబంధం లేని రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. మిగిలిన 60 శాతం మంది ఎలాంటి ఉపాధి లేక ఏం చేయాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఇదే సమస్య. యువతకు చదువుకు తగిన నైపుణ్యాలు లేకపోవడమే అందుకు ప్రధాన కారణమని అనేక జాతీయ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే యువతలోని నిస్తేజం తొలగించి నైపుణ్యాలు మెరుగుపరిచే దిశగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నైపుణ్యగణన. ఈ విషయంలో ప్రభుత్వ ఆలోచనలు ఏమిటి? పరిశ్రమ వర్గాలు ఏం కోరుకుంటున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో మంగళగిరికి ఏపీఎన్‌ఆర్టీ అధ్యక్షుడు డా. రవి వేమూరి, చెన్నైకి చెందిన ఎస్‌ఆర్‌ఎం గ్రూప్ విద్యాసంస్థలు ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ప్రొ. డీ నారాయణరావు పాల్గొన్నారు.
స్కిల్ గ్యాప్ వల్ల యువతరం, ఉద్యోగ విపణి ఎదుర్కొంటున్న సవాళ్లులను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ఏం చేయనుందని నిపుణులు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల యువతకు ఎలాంటి ప్రయోజనం చేకూరనుందని సర్వక్త ఆసక్తి నెలకొంది. వేగంగా మారుతున్న ప్రపంచతో పాటే అనేక సంప్రదాయ కోర్సులు ఉనికి దెబ్బ తినకుండా ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తోందో చూడాలని నిపుణులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
AI ఎంత డెవలప్ అయినా ఈ స్కిల్ ఉంటే చాలు - జాబ్ గ్యారెంటీ! - Best Job Skills
ఏపీ ఎన్‌ఆర్టీ ద్వారా మీరు ఇప్పటికే ఎంతోకాలంగా యువత, నైపుణ్యాభివృద్ధి రంరంలో విస్తృత సేవలు అందిస్తున్నారు. మన యువతకున్న బలాలు, అవకాశాలేంటి అంశంపై దృష్టి సాగిస్తుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ స్థాయి వరకు ఈ స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్ల నెట్‌వర్క్‌ల ఏర్పాటు అనుగుణంగా కూటమి ప్రభుత్వం కసరత్తు చేయాలని నిపుణులు సూచనలు చేస్తున్నారు. యువత నైపుణ్యాలకు సానబట్టడం ఒకెత్తయితే వారికి స్థానికంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కూటమి ప్రభుత్వం ముందున్న మరో అతిపెద్ద సవాల్.