Pratidwani : దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు అయ్యే సందర్భంగా 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు. అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని సంకల్పం తీసుకున్నారు. 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో మన దేశం ఎన్నో విజయాలను సాధించింది. ఎన్నో మైలురాళ్లను నెలకొల్పింది. అదే సమయంలో నేటికీ మనదేశం అనేక రంగాల్లో వెనుకబడి ఉంది. మనకంటే చిన్న దేశాల నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఆ దిశగా కొంత ఆత్మపరిశీలన కూడా అవసరం. ఆర్థికాభివృద్ధే కాకుండా సర్వతోముఖాభివృద్ధి సాధన ఎలా? ప్రపంచంలో భారత్ ఒక శక్తిగా మనం భావిస్తున్నాం కానీ యువశక్తి అత్యధికంగా ఉన్న మనదేశం ఒలింపిక్స్‌లో ఎందుకు ప్రభావం చూపలేదు? 2047 నాటికి అగ్రగామి దేశంగా అవతరించాలంటే మన రాజకీయ నాయకుల్లో, దేశపౌరుల్లో ఇంకా ఏఏ విషయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది? ఇదీ నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు లోక్‌సత్తా వ్యవస్థాపకులు డా. జయప్రకాష్ నారాయ, సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమీ బాలలత.
మన దేశంలో క్రీడలు అంటే కేవలం క్రికెట్టు మాత్రమే అన్నట్టు తయారైంది. కోట్లాదిమంది యువత ఉన్న మన దేశంలో క్రీడాస్ఫూర్తి అనేది కొరవడిందా? మనతో పాటు ఇంచుమించు స్వాతంత్య్రం వచ్చిన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో, పక్కనున్న శ్రీలంకతో కాకుండా చైనా, జపాన్ వంటి మెరుగైన దేశాలతో మనల్ని పోల్చుకోవటం తప్పా? మొత్తం 180 అవినీతి దేశాల్లో మనం 93వ స్థానంలో ఉన్నాం. ఇంకా ఎంతకాలం ఇలాంటి చెత్త ర్యాంకులు? మనకంటే చిన్న దేశాలు ఆటల్లోనే కాదు సుపరిపాలనలోనూ ముందున్నాయి. వీటినెలా అర్థం చేసుకోవాలి? ప్రధాని మోడీ గారు చెప్పినట్టు 2047 నాటికి భారత్ ప్రపంచంలో ప్రబల శక్తిగా అవతరించాలి అంటే మీరు మన పాలకులకు చేసే సూచనలు ఏంటి? మన దేశంలో అత్యధిక జనాభా అనేది ప్రగతికి ఒక ప్రతిబంధకంగా చాలామంది చెబుతూంటారు. అందులో ఎంతవరకు నిజం ఉంది? ఈ అంశాలపైన సమగ్ర సమాచారం ఈ ప్రతిధ్వని కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం.
'మోదీ 3.0 సర్కార్'కు అంత ఈజీ కాదు! వారు ఓకే అంటేనే అవన్నీ సాధ్యం!! - BJP Economic Reform Challenges