Prathidwani Debate on CM YS Jagan Mohan Reddy: ప్రతి వ్యక్తికీ సంస్కారం, హుందాతనం అవసరం. కోట్లాదిమందికి నేతృత్వం వహించే పదవిలో ఉండేవారికి ఆ కనీసార్హతలు తప్పనిసరిగా ఉండాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి పెద్ద. ఆ సీఎం కుర్చీలో కూర్చునే వ్యక్తి ప్రవర్తన, మాటతీరు, స్వభావం, వ్యక్తిగత ప్రతిష్ఠ వీటన్నింటిపై ఆ రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సీఎం అవటం కోసం జగన్ ఏవేం చెప్పారు? సీఎం అయ్యాకా ఏవేం చేశారు? ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తిలా నడుచుకుంటున్నారా? మరోసారి ఆ కుర్చీలో కూర్చునే అర్హత ఆయనకు ఉందా? ఈ అయిదేళ్ల అనుభవాలు ఏం చెబుతున్నాయి? దీనిపై రాజకీయ విశ్లేషకులు నూర్ మహ్మద్, ఏపీ పరిరక్షణ సమితి యూత్ వింగ్ అధ్యక్షుడు ఆర్.సాయికృష్ణలు పలు వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిని కాల్చి చంపండి అని గతంలో జగన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు గురించి జగన్ హింసను ప్రేరేపించేలా మాట్లాడారు. నాలుకపై అదుపులేని వ్యక్తి చేతిలో అధికారం పెట్టడం వల్ల ఈ ఐదేళ్లలో ఏం జరిగింది? అదే దానిపై రాజకీయ విశ్లేషకులు నూర్ మహ్మద్ తన అభిప్రాయాన్ని తెలిపారు. జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి విధ్వంస పాలనను సాగిస్తున్నారని, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నారని అన్నారు. ఒక్క అవకాశం అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా జీవించే హక్కు లేకుండా చేస్తున్నారని విమర్శించారు.
వైసీపీ మంత్రులు తమ శాఖలకు ఏం న్యాయం చేశారు? - వారికి ఎన్ని మార్కులు వేయవచ్చు?
అదే విధంగా పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై కూడా పదేపదే సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవిలో ఉన్న వ్యక్తి మహిళల గురించి, ఇతరుల కుటుంబ వ్యవహారాల గురించి ఇలా మాట్లాడటం సంస్కారవంతమైన చర్య కాదని ఏపీ పరిరక్షణ సమితి యూత్ వింగ్ అధ్యక్షుడు ఆర్.సాయికృష్ణ అన్నారు. వైసీపీ మంత్రులు సైతం మహిళల గురించి పలు వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. సొంత తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి అని సీఎం జగన్, పవన్ కల్యాణ్ గురించి మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు.
ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రజలకు జగన్ వాగ్దానాలు చేశారు. తాను సింహం అని, సింగిల్‌గా వస్తానని చెప్పే జగన్, మరి స్పెషల్ స్టేటస్ విషయంలో మోసం చేశారని నూర్ మహ్మద్ విమర్శించారు. అయిదేళ్ల కాలంలో ఒక్కసారి అయినా హోదా కోసం పోరాడారా అని అన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేక హోదా గురించి మరిచిపోయారని విమర్శించారు. హోదా విషయంలో జగన్ మాట తప్పారని, మడమ తిప్పారని తెలిపారు.
ఇవే కాకుండా రాష్ట్రంలో సగభాగం ఉన్న మహిళలకు జగన్ ఎలా ఆశలు కల్పించారు. మద్యనిషేధంపై ప్రతిపక్షనేతగా జగన్ హామీ ఇచ్చారు. రాజధానిపై సైతం తీయని మాటలు చెప్పారు. యువతకు హామీల వర్షం కురిపించారు. ఉద్యోగుల కోసం సీపీఎస్ రద్దు అని ప్రకటించారు. ఇలా అనేక హామీలు ఇచ్చి, మాట తప్పిన జగన్‌కు మరోసారి సీఎంగా అవకాశం ఇవ్వాలా అనే అంశంపై ప్రతిధ్వని కార్యక్రమంలో చర్చించారు. దీనికి సంబంధించిన పూర్తి వీడియో పైన ఉన్న యూట్యూబ్ లింక్‌పై క్లిక్ చేసి చూడొచ్చు.
వివేకా హత్యను రాజకీయంగా వాడుకున్న జగన్ సునీతా ప్రశ్నలకు ఎందుకు నోరుమెదపడం లేదు?
- " class="align-text-top noRightClick twitterSection" data="">