Prathidhwani : రాష్ట్రంలో చట్టబద్ధ పాలన పునరుద్ధరించడం ఎలా ? సాధారణ ప్రజల నుంచి పెద్దలు, రాజకీయ విశ్లేషకులు, విజ్ఞులు, మేధావివర్గంలో కొన్నిరోజులుగా చర్చ జరుగుతున్న అంశం ఇదే. అయిదేళ్లలో గాడి తప్పిన వ్యవస్థలన్నింటికీ చక్కదిద్దాలి. దిక్కులేకుండా పోయిన ప్రజలహక్కులకి రక్షణ కల్పించాలి. యంత్రాంగంలో మొత్తానికి పారదర్శకత, జవాబుదారీతనం గుర్తు చేయాలి. జూన్-4 తర్వాత కొలువు దీరనున్నకొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్లు ఇవే. మరి ఆ దిశగా ఏం చేస్తే మేలు? మారే ప్రభుత్వంతో పాటు మార్చాల్సిన పద్ధతులేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు రాజకీయ విశ్లేషకులుఎం. సుబ్బారావు, విశ్రాంత గ్రూప్-1 అధికారి టి. శివశంకర్
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్ని రంగాల్లో చట్ట భద్రత లోపించింని నిపుణులు పేర్కొంటున్నారు. ఆస్తి మాదే, రికార్డుల్లోనూ మా పేరే ఉంది, మాకేం భయం అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే రాత్రికి రాత్రే రికార్డులు మారిపోతాయి. మీ పేరు స్థానంలో రాజకీయ నేత చెప్పిన పేరు వచ్చి చేరుతుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా, దురుద్దేశంతో ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం ప్రజల స్థిరాస్తులపై చట్టబద్ధ హక్కుల నిర్ణయం అధికారులదే. అధికారుల ముసుగులో పెత్తనం చెలాయించేది ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నేతలే. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే స్థిరాస్తులు మీవి కాకుండా పోవడం ఖాయం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలైతే ఇంకేమైనా ఉందా? ఏపీ ప్రజలరా పారాహుషార్ అంటూ న్యాయవాదులు సైతం జనాన్ని హెచ్చరిస్తున్నారు.