ETV Bharat / opinion

వరదలు వదల్లేదు- జ్వరాలు స్వారీ కి సిద్ధమయ్యాయి - Prathidhwani on How to be Healthy - PRATHIDHWANI ON HOW TO BE HEALTHY

Prathidhwani : అసలే వర్షాకాలం అనుకుంటే వరదలు ముంచెత్తాయి. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ప్రజారోగ్యానికి ఎదురయ్యే ప్రధాన సవాళ్లు ఏమిటి? కొత్తగా అనారోగ్యాలు రావడం ఒకటైతే ఇప్పటికే వివిధరకాల వ్యాధులు, జబ్బులతో ఉన్నవారు ఈ వరద పరిస్థితుల్లో ఎలాంటి సమస్యలు ఎదు‌ర్కోవాల్సి రావొచ్చు అనే పలు అంశాలను నేటి ప్రతిధ్వని కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం.

prathidhwani_on_how_to_remain_healthy_in_this_fever_season
prathidhwani_on_how_to_remain_healthy_in_this_fever_season (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 5, 2024, 10:10 AM IST

Prathidhwani : అసలే వ్యాధుల కాలం ! ఆ పై వరదల బీభత్సం! తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితి ఇదే. నిన్నామొన్నటి వరకు వణికించిన డెంగీ, విషజ్వరాల కష్టం చాలదన్నట్లు పీకల్లోతు నీటిలో మునిగి పోయాయి జనావాసాలు. రోజుల తరబడి నీళ్లల్లోనే నానుతున్నాయి. ఆ వరదలు అవి మోసుకు వచ్చిన బురద ప్రజారోగ్యానికి సవాళ్లు విసురుతున్నాయి. సాధారణంగానే ఇలాంటి సందర్భాల్లో వాతావరణం మారటమే కాదు, కలుషితమయ్యే నీరు, ముసురుకొచ్చే దోమల దండుతో దాడి చేసే జబ్బులు చాలా ఎక్కువ. ఈ పరిస్థితులతో ఇప్పటికే ఉన్న కొన్ని జబ్బులూ తీవ్రం కావొచ్చు. ఈ విపత్కర పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలి? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. మరి, వ్యాధులు ప్రబలే ఈ సమయంలో మన ఆరోగ్యానికి మనమే రక్షగా ఉండాలి. మన జాగ్రత్తలు మనమే తీసుకోవాలి. చాలా వరకు మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు సీనియర్ కన్సల్టెంట్‌ ఫిజిషియన్‌ డా. ఎంవీ రావు, జీజీహెచ్ అసోసియేట్ ప్రొఫెసర్ డా. నాగూర్‌బాషా.

అసలే వర్షాకాలం అనుకుంటే వరదలు ముంచెత్తాయి. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ప్రజారోగ్యానికి ఎదురయ్యే ప్రధాన సవాళ్లు ఏమిటి? కొత్తగా అనారోగ్యాలు రావడం ఒకటైతే ఇప్పటికే వివిధరకాల వ్యాధులు, జబ్బులతో ఉన్నవారు ఈ వరద పరిస్థితుల్లో ఎలాంటి సమస్యలు ఎదు‌ర్కోవాల్సి రావొచ్చు? మనకి సంక్రమించే వ్యాధుల్లో నీటి కారణంగా వచ్చే జబ్బులు ఏంటి? తాగే నీటి విషయంలో జాగ్రత్త తీసుకోవటం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఇలాంటి సందర్భాల్లో వచ్చే విషజ్వరాలు సాధారణ జ్వరాలకు తేడా ఏంటి? శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తే తక్షణం అప్రమత్తం కావాలి? మరీ ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు ఉన్నవాళ్లు ఆహారం పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దొరికింది తినాల్సిన పరిస్థితుల్లో ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి?

ముంపు వాసులారా! బీ అలెర్ట్‌: వణికించే వ్యాధుల జాబితా- లక్షణాలు, ముందు జాగ్రత్తలు - precautions for Seasonal diseases

ఈ సీజన్‌లో నీరు నిల్వ ఉండటం, దట్టంగా మొక్కలు ఉండటం, చెత్తచెదారం, ఓపెన్ డ్రైనేజ్ వంటివి ప్రతి చోటా మనకి కనిపిస్తాయి. దోమ అనేది చాలా చిన్న ప్రాణి కదా అని మనం నిర్లక్ష్యం చేస్తాము. దోమలు కుట్టడం వలన ఏఏ జబ్బులు వస్తాయి? దాని ప్రభావం మన ఆరోగ్యంపై ఎలా ఉంటుంది? వరద ప్రభావిత ప్రాంతాల్లో మొత్తానికి ముందు జాగ్రత్తగా ఔషధాలు, టీకాలు అందించడం ద్వారా అనారోగ్యాలను నియంత్రించే అవకాశం ఉందా? ఇంట్లో, షాపుల్లో ఎక్కడపడితే అక్కడ ఈగలు ఈ సమయంలో మనకి బాగా కనిపిస్తాయి. ఎక్కువగా ఆహార పదార్థాల మీద వాలుతూ ఉంటాయి, వాటిని చెదరగొట్టి తినేస్తూంటారు. అసలు ఈగలు అనేవి వ్యాధులను ఎలా వ్యాపింపచేస్తాయి సహా సమగ్ర సమాచారం నేటి ప్రతిధ్వనిలో తెలుసుకుందాం.

విష జ్వరాలతో అల్లాడుతున్న ప్రజలు - రోజురోజుకూ పెరుగుతున్న బాధితుల సంఖ్య - Viral Fevers Tension In AP

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.