Farmer Suicide Due to the Pain of Debt : అన్నం పెట్టే అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం కడవకుదురులో అప్పుల బాధతో బొప్పన శ్రీనివాసరావు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గత మూడేళ్లుగా వ్యవసాయంలో నష్టాలు రావడంతో 10 లక్షల రూపాయలు వరకు అప్పు చేశాడు. చేసిన అప్పులు ఎలా తీర్చాలని శ్రీనివాసరావు మనోవేదనకు గురయ్యారని కుటుంబసభ్యులు తెలిపారు. ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
విషాదం నింపిన విహార యాత్ర - కారు బోల్తా పడి తల్లీకుమారుడు మృతి 'బోలాపడిన బస్సు'
Road Accident in Anantapur : అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలోని రామదాసుపేట సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సుధాకర్ (26) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గుంతకల్లు మండలం నక్కనదొడ్డి గ్రామానికి చెందిన సుధాకర్, తన మిత్రుడు శివతో కలిసి ఆటోలో తన స్వస్థలానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సుధాకర్ ప్రయాణిస్తున్న ఆటోను లారీ వెనుక నుంచి ఢీ కొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలో సుధాకర్ మృతి చెందగా, అతని మిత్రుడికి స్వల్ప గాయాలయ్యాని పేర్కొన్నారు.
Women Missing in Annamayya : అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలంలో ఓ వివాహిత తన ముగ్గురు పిల్లలతో సహా అదృశ్యం అయ్యింది. చిన్నమండెం మండలం శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన భార్గవి (30) అనే వివాహిత ఈ నెల 23 (జనవరి 23) నుంచి కనిపించడం లేదని ఆమె తల్లి స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. వివాహిత వివరాల్లోకి వెళ్లితే, చిన్నమండెం మండలంలోని చాకిబండ గ్రామానికి చెందిన వ్యక్తితో భార్గవికి పదేళ్ల కిందట వివాహమైంది. ఈ క్రమంలోనే ఆమె భర్త కొంత కాలం కిందట జీవనోపాధి నిమిత్తం గల్ఫ్ దేశానికి వెళ్లారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 23న పిల్లలతో కలిసి అత్తవారింటికి వెళ్తున్నట్లు పుట్టింట్లో చెప్పి అదృశ్యం అయినట్లు భార్గవి తల్లి కృష్ణవేణి పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నది. ఈ సంఘటన కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నట్లు స్థానిక ఎస్సై రమేశ్ బాబు పేర్కొన్నారు.
Road Accident West Godavari : రహదారి ప్రమాదంలో విద్యార్థి మృతి చెందిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. మొగల్తూరు పంచాయతీ కుక్కలవారితోటకు చెందిన జోగి మురళీకృష్ణ, లక్ష్మీరాజ్యం దంపతులు కుమారుడైనా క్రాంతికుమార్ మృతి చెందాడు. అతడు స్థానిక కళాశాలలో ఐటీఐ చదువుతున్నాడు. కళాశాల నుంచి ఇంటికి వచ్చిన అనంతరం మొగల్తూరులోని తన నానమ్మను చూసేందుకు ద్విచక్ర వాహనంపై బయలు దేరాడు. సీతారామపురం వద్ద 216 జాతీయ రహదారిపై గ్రావెల్‌తో వెళ్తున్న లారీ సడన్‌గా రహదారి పక్కకు నిలుపుదల చేశాడు. దీంతో క్రాంతికుమార్ లారీని వెనుక నుంచి ఢీ కొట్టడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు.
Prakasam District : నగదు లావాదేవీల విషయంలో ఓ వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు గడ్డపారతో దాడి చేసిన సంఘటన ప్రకాశం జిల్లాలో చోటుచోసుకుంది. ఈ దాడిలో కార్తీక్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన కార్తీక్‌ను స్థానికులు గమనించి కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కార్తీక్ గతంలో రంగయ్య అనే వ్యక్తికి రూ.20 వేలు అప్పు ఇచ్చాడు. రంగయ్య కార్తీక్‌కు రూ.15 వేలు చెల్లించి రూ.5000 తరవాత ఇస్తానని పేర్కొన్నాడు. నెలలు గడుస్తున్న రంగయ్య తన అప్పు చెల్లించకపోవడంతో కార్తీక్ అతడిని నిలదీశాడు. దీంతో ఆగ్రహించిన రంగయ్య కార్తీక్‌పై దాడికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ అధికారులు తెలియజేశారు.