Pratidwani : జగన్ రెడ్డి పాలనలో యూనివర్సిటీలు రాజకీయాలకు కేంద్రాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో యూనివర్సిటీలు, వీసీలకు రాజకీయాలతో పనేంటి? విశ్వవిద్యాలయాలు వైసీపీ ఆఫీసుల్లా ఎందుకు మారాయి? వర్సిటీల్లో వైసీపీ కార్యక్రమాలు నిర్వహించడమేంటి? చదువుల కేంద్రాల్లో సీఎం పుట్టినరోజు వేడుకలా? వర్సిటీల్లో వైఎస్ జయంతి, వర్ధంతి లాంటి విపరీత పోకడలేంటి? వైస్‌ఛాన్స్‌లర్‌లు వర్సిటీలను ఎందుకింతగా దిగజార్చారు? ఇదీ నేటి ప్రతిధ్వని. నేటి చర్చలో ఉన్నత విద్యామండలి మాజీ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ నరసింహారావు, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాచేంద్ర పాల్గొన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలను కొందరు ఉపకులపతులు రాజకీయాలకు కేంద్రాలుగా మార్చేస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎంతో కాలంగా సంపాదించుకున్న ఘనకీర్తిని తన చర్యలతో ఉపకులపతి పీవీజీడీ ప్రసాదరెడ్డి గంగలో కలిపేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వీసీగా పనిచేసిన ఏయూ నేడు వివాదాలతో వార్తల్లోకెక్కుతోంది.
వీసీ ప్రసాదరెడ్డి, మాజీ రిజిస్ట్రార్ కృష్ణమోహన్ విశాఖలోని ఓ హోటల్‌లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా గతంలో సమావేశం నిర్వహించడం వివాదాస్పదమైంది. ఇదే కాదు గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహరించడంతోపాటు, ఫలితాలపై విద్యార్థులతో సర్వే చేయించినట్లు వీసీపై ఆరోపణలు వచ్చాయి.
ఎడెక్స్‌తో వింత ఒప్పందం - కోర్సు అంతర్జాతీయం - సర్టిఫికెట్లు రాష్ట్ర వర్సిటీలవి!
రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా కొన్ని వర్సిటీలు రాజకీయాలకు కేంద్రాలుగా మారుతున్నాయి. అవకాశం దొరికినప్పుడల్లా అధికార వైసీపీకి తమ స్వామి భక్తిని చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ను భజన చేయడంలో ఆ పార్టీ కార్యకర్తలను మించిపోయారు గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆచార్యులు. యూనివర్సిటీల్లోని ఆచార్యుల ఉద్యోగ విరమణ వయస్సు 62 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ కొద్ది నెలల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో సీఎంకు భజన చేసేందుకు ఆచార్య నాగార్జున వర్సిటీ ఆచార్యులు పోటీ పడ్డారు. విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత థ్యాంక్యూ సీఎం జగన్ సర్ అంటూ ఉపకులపతి కార్యాలయం నుంచి వర్సిటీ ప్రధాన ద్వారం వరకు ర్యాలీ నిర్వహించారు. సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రికి మద్దతుగా నినాదాలు చేశారు. ఈ తతంగాన్ని చూసిన వర్సిటీలోని విద్యార్థులు వీళ్లు ఆచార్యులా వైసీపీ కార్యకర్తలా అంటూ నోళ్లు వెళ్లబెట్టారు.
దీంతోపాటు వైసీపీ కార్యకర్తల్ని మించిన ప్రభుభక్తికి కారణాలేంటి? రాజకీయ అరాచకంపై విద్యార్థులు, విద్యావేత్తల వాదనేంటి? జగన్ ఏలుబడిలో విశ్వవిద్యాలయాల్లో ఏం జరిగింది? యూనివర్సిటీలకు నిధుల సమస్య ఏ స్థాయిలో ఉంది? బోధన, బోధనేతర సిబ్బంది తగినంత మంది ఉన్నారా? ఏ సమస్యకైనా ఈ ఐదేళ్లలో పరిష్కారం లభించిందా? అనే అంశాలపై వక్తలు చర్చించారు.
CM Jagan Rush For Skill Universities: 30 నైపుణ్య కళాశాలలంటూ జగన్ ప్రకటనలు.. 30శాతం యువత ఆశలపై నీళ్లు