ETV Bharat / offbeat

శభాష్ అనిపిస్తున్న కెనడా కుర్రాడు - పేద విద్యార్థులకు సాయం - NRI Rohan Cherla Helping

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 13, 2024, 7:31 PM IST

NRI Rohan Cherla: తనతోపాటు చుట్టూ ఉన్నవాళ్లూ ఎదగాలనుకునే మనస్తత్వం ఆ కుర్రాడిది. ఓ సమస్యకు సమాధానం అడగ్గా తల్లి చెప్పిన మాటలు అతడిని ఆలోచనలో పడేశాయి. ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూడటం ఎందుకని, తనే రంగంలోకి దిగాడు. విదేశాల నుంచి వివిధ మార్గాల్లో విరాళాలు సేకరించి మరీ ప్రతిభగల విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నాడు. ఏటా ఆ సంఖ్య పెంచుతూ పేద విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్న రోహన్ చెర్లపై స్పెషల్ స్టోరీ.

NRI Rohan Cherla
NRI Rohan Cherla (ETV Bharat)

NRI Rohan Cherla : తల్లి చెప్పిన ఒక్క మాట ఈ కుర్రాడి ఆలోచన విధానాన్నే మార్చేసింది. అప్పటి వరకు సరదాగా తిరిగిన ఈ కుర్రాడు సామాజిక బాధ్యత భుజాన వేసుకున్నాడు. చదువుకోవాలని ఉన్న పేద విద్యార్థులకు అండగా నిలుస్తూ ఔరా అనిపించుకుంటున్నాడు. అతడే రోహన్‌ జగన్నాథ భాస్కర్‌ చెర్ల.

రోహన్‌ జగన్నాథ భాస్కర్‌ చెర్ల తల్లితండ్రులు కిరణ్, హిరణ్మయి కెనడాలో స్థిరపడ్డారు. తనూ అక్కడే పుట్టి పెరిగాడు. రోహన్ తాత విశాఖ ఏవీఎన్ కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వహించారు. ఒకసారి తన తాత చదువు చెప్పిన కళాశాల చూడటానికి వచ్చినప్పుడు విద్యార్థులు చాలాచోట్ల కార్మికులుగా చేయడాన్ని చూసి చలించిపోయాడు రోహన్‌.

వేణుగానంతో మైమరిపిస్తున్న యువ కళాకారిణి - జాతీయ స్థాయిలో ప్రశంసలు - A Girl Mesmerizing with her Flute

చదువుకోవాల్సిన సమయంలో కార్మికులుగా విద్యార్థులు పని చేయడం ఏంటమ్మా అని తల్లిని అడిగాడు రోహన్‌. చదువుకోవడానికి ఆర్థికస్థోమత లేక అలా ఉండిపోయారన్న ఆమె సమాధానంతో రోహన్ మనసులో ఆలోచన మెుదలైంది. తన చుట్టూ ఉన్న వాళ్లు తనలాగే చదువుకోవాలని ఆర్థికంగా సహకరించేందుకు సిద్ధమయ్యాడు. కెనడా మిత్రుడు జోసెఫ్‌ సహకారం తోడవ్వడంతో JB ఫౌండేషన్ నెలకొల్పాడు రోహన్‌.

గతేడాది విశాఖ ఏవీఎన్ కళాశాల అధికారులతో మాట్లాడి జేబీ ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించాడు రోహన్‌. 37 మందికి 10 వేల నుంచి 20 వేల వరకు కళాశాల ఫీజు ఉపకారవేతనంగా ఇచ్చాడు. ఈ ఏడాది ఆ సంఖ్య 50 మందికి పెంచి సుమారు 6 లక్షల రూపాయల వరకు ఉపకారవేతనంగా అందించాడు. వచ్చే ఏడాది ఈ సంఖ్యను 200 మందికి పెంచాలని నిర్ణయం తీసుకున్నాడు.

నేను చెప్పిన ఒక్క మాట విని సామాజిక సేవ చేయడం మంచి విషయం అంటుంది రోహన్‌ తల్లి హిరణ్మయి. పేద విద్యార్థులకు సహాయం చేస్తానంటే సరే అని సమ్మతి చెప్పడం కంటే తానూ ఏ సహకారం అందించలేదని చెబుతున్నారు. మేము చేయలేని చాలా పనులు మా బిడ్డ చేస్తుంటే చాలా ఆనందంగా ఉందంటున్నారు హిరణ్మయి.

13ఏళ్లలో 19వేలకుపైగా పాములు- వాటి కోసమే ఆ యువకుడి పోరాటం - Kranthi of Jangareddygudem

రోహన్ చేస్తున్న సేవకు కళాశాల అధ్యాపకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వయస్సుకు మించిన సేవ చేస్తున్నారని అభినందిస్తున్నారు. ఒక గొప్ప మార్పునకు శ్రీకారం చుట్టారని ప్రశంసించారు. రోహన్ నుంచి సహకారం అందుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులకు ఆర్ధిక భారం తగ్గిందని, చదువుకోవాలనే ఉత్సాహం పెరిగిందని అంటున్నారు.

చదువుకోవాలని ఉన్న పేదవిద్యార్థి కల నిజం చేస్తూ ముందుకు సాగుతున్నాడు రోహన్‌. పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన ఒక విద్యార్థిని తనతోపాటు కెనడాకు తీసుకుని వెళ్లి చదివిస్తానని చెబుతున్నాడు. ఈ కళాశాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి యాప్‌ రూపొందించాడు. చదువుల్లో రాణిస్తూనే, వీలైనంత ఎక్కువ మందిని చదివించేందుకు విరాళాల సేకరణలో నిమగ్నమయ్యాడు రోహన్‌.

ఒలింపిక్స్​లో పతకమే లక్ష్యం- సదుపాయాలు లేకున్నా సాఫ్ట్‌బాల్‌లో సత్తా - SRIKAKULAM YOUTH IN SOFTBALL

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.