ETV Bharat / international

ఇజ్రాయెల్​కు షాకిచ్చిన అమెరికా- కీలక ఆయుధాల సరఫరా నిలిపివేత! ఆ పని చేయబోతుందనే! - US Stopped Bomb Supply To Israel

US Stopped Bomb Supply To Israel : గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్‌ దాడి ఖాయమన్న సంకేతాల నేపథ్యంలో అమెరికా షాక్​ ఇచ్చింది. ఇజ్రాయెల్‌కు సరఫరా చేయాల్సిన ఆయుధాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ విషయాన్ని అగ్రరాజ్య రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ ధ్రువీకరించారు.

లాయిడ్‌ ఆస్టిన్‌, అమెరికా రక్షణ మంత్రి
లాయిడ్‌ ఆస్టిన్‌, అమెరికా రక్షణ మంత్రి (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : May 9, 2024, 7:19 AM IST

Updated : May 9, 2024, 8:25 AM IST

US Stopped Bomb Supply To Israel : దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్‌ దాడి చేయడం ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో అమెరికా బిక్​ షాక్​ ఇచ్చింది. ఇజ్రాయెల్‌కు సరఫరా చేయాల్సిన ఆయుధాలను తాత్కాలికంగా నిలిపివేసింది. సరఫరా చేయాల్సిన వాటిలో 2000 పౌండ్ల బరువైన 1800, 500 పౌండ్ల బరువైన 1700 బాంబులు ఉన్నాయి. భారీ స్థాయిలో విధ్వంసం సృష్టించే ఈ బాంబులను సరఫరా చేస్తే, రఫాపై ఇజ్రాయెల్‌ దాడి చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అమెరికా వీటి సరఫరాను ఆపినట్లు సమాచారం. దీన్ని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ కూడా ధ్రువీకరించారు. తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన ఆయుధాలను ఇజ్రాయెల్‌కు సరఫరా చేస్తామని, కానీ రఫాలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో గత వారం ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

ప్రస్తుతం దాదాపు 13 నుంచి 14 లక్షల మంది పాలస్తీనియన్లు రఫాలో తలదాచుకుంటున్నారు. ఈ నగరంపై దాడి చేస్తే భారీ మానవ సంక్షోభం తప్పదని అగ్రరాజ్యం భావిస్తోంది. ఈ విషయాన్ని అనేక సార్లు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చెప్పారు. అయినా ఆ మాటలను ఇజ్రాయెల్‌ ఖాతరు చేయడంలేదు. అమెరికా సహా ఎవరూ తమను ఆపలేరని నెతన్యాహు బహిరంగంగానే ప్రకటన చేస్తున్నారు. అమెరికా ఎంతగా నచ్చచెబుతున్నా, రఫాపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ అంటోంది. ఒక వేళ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా, రఫాలోని హమాస్‌ను నాశనం చేస్తామని హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా బాంబుల సరఫరా నిలిపివేసింది. కాగా, ఇది అంత పెద్ద విషయం కాదని, అమెరికాతో మాట్లాడుకొని ఈ సమస్యను పరిష్కరించుకుంటామని ఇజ్రాయెల్‌ చెబుతోంది.

కీలక పాస్‌ను తెరిచాం
రఫా తూర్పు ప్రాంతంలో ఈజిప్టు, గాజా మధ్య కీలక కరెమ్‌ షాలూమ్‌ పాస్‌ను తెరిచినట్లు బుధవారం ఇజ్రాయెల్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మార్గంపై ఆదివారం రాత్రి హమాస్‌ రాకెట్లతో దాడి చేసింది. దీంతో ఈ పాస్‌ను తాత్కాలికంగా ఇజ్రాయెల్ భద్రత​ దళాలు మూసివేశాయి. ఈ మార్గాన్ని తెరిచినా గాజాకు మానవతా సాయం అందడం లేదని ఐరాస తెలిపింది. పాలస్తీనా వైపు ఎవరూ సాయం అందుకోవడానికి లేరని తెలిపింది. ఇదిలా ఉండగా, అమెరికా యూనివర్సిటీల్లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. బుధవారం జార్జి వాషింగ్టన్‌ యూనివర్సిటీలోకి ప్రవేశించి గాజా యుద్ధానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న 33 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

చైనా మాజీ రక్షణ మంత్రి సేఫ్​- సుదీర్ఘ కాలం తర్వాత కనిపించిన ఫెంఘే - chinese defense minister missing

ఆస్ట్రాజెనెకా సంచలన నిర్ణయం- మార్కెట్​ నుంచి కొవిడ్ 'వ్యాక్సిన్' ఉపసంహరణ- కారణమిదే! - AstraZeneca Withdraws Covid Vaccine

Last Updated : May 9, 2024, 8:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.