Watermelon For Men Benefits : ఎర్రటి గుజ్జులతో తాజాగా, జ్యూసీగా కనిపించి రుచిగా ఉండే పుచ్చకాయ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. సమ్మర్ అంతా దీన్ని సలాడ్లు, స్మూతీలు, జ్యూస్‌లు అంటూ పుచ్చకాయను రకరకాలుగా తీసుకుంటూ ఉంటాం. ఇది మిమ్మల్ని చల్లబరిచి మధుమేహన్ని నియంత్రించడంలో దీర్ఘకాలిక వ్యాధులకు గురిచేసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటంలో మీకు సహాయపడుతుంది. అలాగే గుండె జబ్బులు, ఉబ్బసం, అధిక బరువు లాంటి సమస్యల ప్రమాదల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. పుచ్చకాయలో అధికంగా ఉండే నీరు మిమ్మల్ని ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ఇవన్నీ తెలిసినవే పుచ్చకాయ గురించి మీకు తెలియని మరో ఆసక్తికర విషయం ఏంటంటే పుచ్చకాయ తినడం వల్ల పురుషుడి లైంగిక జీవితంలో కొన్ని కీలక మార్పులు జరుగుతాయట. అవేంటో ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం.
శృంగార జీవితం కోసం పుచ్చకాయ
Water Melon For Men Sex Life : సాధారణంగా ఒక వ్యక్తి సెక్స్ డ్రైవ్ సామర్థ్యం అతడి టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ హార్మోన్ పనితీరులో జింక్ కీలక పాత్ర పోషిస్తుంది. పుచ్చకాయ గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది కనుక దీన్ని తీసుకోవడం వల్ల పురుషుల సెక్స్ డ్రైవ్ మెరుగవుతుంది. దీంతో పాటు పురుషుల్లో వీర్య కణాల నాణ్యతను పెంచి సంతానోత్పత్తిని మెరుగుపరిచేందుకు పుచ్చకాయ బాగా సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
పుచ్చకాయతో ఏం సంబంధం?
అలాగే పురుషుడి లైంగిక జీవితంలో ప్రధాన సమస్య అయిన అంగస్తంభన సమస్య(Erectile Dysfunction)కు పుచ్చకాయ చెక్ పెడుతుందట. పురుషాంగానికి రక్త సరఫరా తగ్గడం వల్ల వచ్చే సమస్యే ఇది. లైంగిక కోరికలు తగ్గడం, అకాల స్థలనం లాంటివి అంగస్తంభన లక్షణాలు. ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి పుచ్చకాయ మంచి పరిష్కారమవుతుందని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయలో అధికంగా ఉండ అమైనో ఆమ్లం సిట్రులిన్ ను శరీరం అర్జినైన్ గా మర్చుకుంటుందట. ఇది పురుషాంగానికి రక్త ప్రవాహాన్ని పెంచుతుందట.
2013లో ఎలుకలపై చేసినన అధ్యయనం ప్రకారం పుచ్చకాయలో లభించే సిట్రులైన్ వాటర్ అంగస్తంభన సమస్యను తగ్గించి పురుషుడి అంగానికి రక్త సరఫరాను వేగవంతం చేస్తుంది. పుచ్చకాయ తినే వారిలో శృంగారం విషయంలో ఉద్రేకం, సెక్స్ డ్రైవ్ సామర్థ్యం పెరిగనట్టు తమ అధ్యయనంలో గుర్తించామని చియాంగ్ మై యూనివర్సిటీ జర్నల్ ఆఫ్ నేచురల్ సైన్సెస్ తమ జర్నల్‌లో ప్రచురించారు.
గమనిక: ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైనా మితంగా తింటేనే దాని ప్రయెజనాలను పొందగలుగుతాం. అలాగే పుచ్చకాయను అధికంగా తినడం వల్ల గ్లూకోజ్ స్టాయిలు పెరుగుతాయి. అలాగే మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఇది మధుమేహంతో ఇబ్బంది పడుతున్నవారికి కచ్చితంగా సమస్యే. దీంతో పాటు పుచ్చకాయ వినియోగం అధికమైతే కొందరిలో దద్దుర్లు, పెదవులు, నాలుక, గొంతులకు దురద, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు లేకపోలేవు.
మరో ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
పప్పులకు పురుగు పట్టకుండా రసాయనాలు వేస్తున్నారా? - చాలా డేంజర్ - ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి!
ఈ ఫుడ్స్‌తో పోలిస్తే కోడిగుడ్డు నథింగ్ - ఫుల్ ప్రొటీన్ - మీ కండరాలు యమా స్ట్రాంగ్ అవుతాయ్!