ETV Bharat / health

ఇంట్రస్టింగ్ : మీ బొడ్డులో దూదిలాంటి వ్యర్థాలు ఏర్పడుతున్నాయా? - పరిశోధనలో ఏం తేలిందో తెలుసా? - Reasons For Wastage Formed in Navel

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 27, 2024, 11:45 AM IST

Reasons For Wastage Formed in Navel : నాభి.. మన బాడీలో చాలా సున్నితమైన ప్రాంతాలలో ఒకటి. అయితే.. రోజూ శుభ్రంగా స్నానం చేసినప్పటికీ.. కొంతమందిలో బొడ్డులో దూది వ్యర్థాలు ఏర్పడుతుంటాయి. అసలు, బొడ్డులోకి ఆ వ్యర్థాలు ఎక్కడి నుంచి వస్తాయి? అవి ఎలా ఏర్పడతాయో మీకు తెలుసా??

Reasons For Wastage Formed in Navel
WASTAGE FORMED IN NAVEL REASONS (ETV Bharat)

Why Cotton Like Material Are Found in Belly Button? : మన శరీరంలో అత్యంత సున్నితమైన ప్రాంతాలలో ఒకటి.. నాభి. ఎందుకంటే.. ఈ ప్రాంతం చాలా నరాలకు నిలయంగా ఉంటుంది. ఈ నరాలు నాభి చుట్టూ ఉన్న చర్మం(Skin) నుంచి సమాచారాన్ని మెదడుకు తీసుకువెళతాయి. అలాగే బొడ్డు చుట్టూ ఉన్మ చర్మం చాలా సాఫ్ట్​గా ఉండి స్పర్శకు సున్నితంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

అయితే.. కొంతమంది రోజూ స్నానం చేసేటప్పుడు నాభి ప్రాంతాన్ని శుభ్రం చేసుకుంటున్నప్పటికీ.. అక్కడ దూదిలాంటి వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. ఈ క్రమంలోనే చాలా మందికి వచ్చే సందేహాలు ఏంటంటే.. అసలు బొడ్డులో మెత్తని దూదిలాంటి వ్యర్థాలు ఎక్కడి నుంచి వస్తాయి? అవి ఎలా ఏర్పడతాయి? అందుకు గల కారణాలేంటి? దీనివల్ల ఏమైనా సమస్య కలుగుతుందా? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బొడ్డులో ఏర్పడే దూదిలాంటి వ్యర్థాలను శాస్త్రీయ పరిభాషలో బెల్లీ బటన్ లింట్(బీబీఎల్) అని అంటారు. అలా నాభిలో వ్యర్థాలు ఏర్పడడానికి ప్రధాన కారణం.. బొడ్డు చుట్టూ ఉన్న వెంట్రుకలే అంటున్నారు నిపుణులు. దుస్తుల లోపలి నుంచి చిన్న ఫైబర్‌, కాటన్ ముక్కలను లాక్కుని, వాటిని బొడ్డులో నిక్షిప్తం చేస్తాయని చెబుతున్నారు. అదేవిధంగా.. వెంట్రుకల చివరలు ఒక రకమైన 'హుక్స్'లా పనిచేస్తాయని కూడా నిపుణులు పేర్కొన్నారు. కొన్ని పరిశోధనల్లో.. దుస్తుల కాటన్, ఫైబర్​ జమకావడం వల్ల నాభిలో దూదిలాంటి వ్యర్థాలు ఏర్పడినట్లు వెల్లడైంది.

2019లో "ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. నాభిలో దూదిలాంటి వ్యర్థాలలో ఫైబర్స్, బ్యాక్టీరియా, చర్మం కణాలు ఉంటాయని, నాభి చుట్టూ ఉన్న వెంట్రుకలు ఈ వ్యర్థాలు ఏర్పడడానికి దోహదపడతాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ హాంబర్గ్​కు చెందిన ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ జోహన్నెస్ వోల్ఫ్ పాల్గొన్నారు. నాభి చుట్టూ ఉండే వెంట్రుకలు లింట్, ఇతర కణాలను బంధించి బొడ్డులో దూది లాంటి వ్యర్థాలు పేరుకుపోవడానికి దారితీస్తాయని ఆయన పేర్కొన్నారు.

సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? - రోజూ ఇవి తింటే పిల్లలు పుట్టడం గ్యారెంటీ!

బొడ్డులో పేరుకుపోయే వ్యర్థాలలో దుమ్ము, చర్మపు కణాలు, కొవ్వు, ప్రోటీన్లు, చెమట వంటివి కలిసి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఎప్పటికప్పుడు నాభిని శుభ్రం చేసుకోకపోతే ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్‌ వంటి సూక్ష్మజీవుల నిలయంగా మారే అవకాశం ఉంటుందంటున్నారు. ఈ వ్యర్థాలలో 2,368 రకాల బ్యాక్టీరియా కనిపించిందని పరిశోధకులు చెబుతున్నారు.

ఎవరిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందంటే?

నాభిలో దూదిలాంటి వ్యర్థాలు ఏర్పడే సమస్య అందరిలో ఒకేలా ఉండదంటున్నారు నిపుణులు. మధ్య వయస్కులు, పొట్ట మీద వెంట్రుకలు ఎక్కువగా ఉన్న పురుషులు, బరువు పెరిగిన వారి నాభిలో ఈ వ్యర్థాలు ఎక్కువగా ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేస్తే ఏమవుతుంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.