ETV Bharat / health

చికెన్​ వర్సెస్​ గుడ్డు - ఏది ఎక్కువ బలాన్నిస్తుందో తెలుసా? - Egg VS Chicken - EGG VS CHICKEN

Chicken VS Egg : కోడి ముందా! గుడ్డు ముందా! అనేది అసలు సమస్యే కాదు. చికెన్​ బెటరా, గుడ్డు బెటరా? అన్నదే ఇంపార్టెంట్​ అంటున్నారు మాంసాహార ప్రియులు. నాన్​ వెజ్​ ప్రియులకు ముక్క లేనిదే ముద్ద దిగదు. శాఖాహార ప్రియులు సైతం అప్పుడప్పుడూ గుడ్డు వరకు వెళ్లొస్తున్నారు. గుడ్డు పచ్చసొన వదిలేసి తెల్ల సొన తీసుకుంటున్నారు. ఇది పక్కన పెడితే ఆరోగ్య పరంగా చికెన్​, గుడ్డు ఏది బెటర్​ అని ఆలోచిస్తున్నవారంతా ఈ కథనం చదవాల్సిందే.

chicken_vs_egg
chicken_vs_egg (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 21, 2024, 2:25 PM IST

Egg VS Chicken : వారం రోజుల ఫుడ్ మెనూలో కనీసం రెండుసార్లు నాన్​వెజ్​ ఉండాల్సిందే. సండే వచ్చిందంటే చికెన్, మటన్​, చేపలు సర్వసాధారణం. ఇక మిగతా రోజుల్లో బాయిల్డ్ గుడ్డు, ఆమ్లెట్ ఏదో ఒకటి రుచి చూడాల్సిందే. ప్రొటీన్స్​, విటమిన్స్​ పరంగా చికెన్, గుడ్డులో ఏది విన్నర్​ అనే విషయాన్ని తెలుసుకుందాం.

కోడిగుడ్డు, చికెన్​లో ఏది బెటర్​ అనే సందేహం వస్తే సూటిగా సమాధానం చెప్పడం కష్టమే. చికెన్​లో పోషకాలు ఎక్కువగా ఉంటే గుడ్డులో విటమిన్లు అధికం. ప్రోటీన్ల పరంగా చూస్తే చికెన్, గుడ్లు దేనికదే సాటి అని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. చికెన్​లో ముఖ్యంగా బ్రెస్ట్ పీస్​లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దాదాపు 100 గ్రాముల చికెన్ కర్రీలో సుమారు 27 గ్రాముల ప్రోటీన్‌ అందుతుంది. అంటే 100గ్రాముల చికెన్​ రోజువారీ అవసరాలు తీర్చేందుకు సహకరిస్తుంది. ఇందులో తక్కువ మొత్తంలో కొవ్వు, అధిక ప్రోటీన్​ అందుతుంది. ఫిట్‌నెస్ ఔత్సాహికులు, ఆరోగ్య స్పృహ కలిగిన వారంతా చికెన్​ బ్రెస్ట్ ఎక్కువగా ఇష్టపడతారు.

సంపూర్ణ ఆరోగ్యానికి ఇదొక్కటి చాలు- అత్యంత చవకైన దివ్యౌషధం - Perfect medicine for health

ఇక గుడ్డు విషయానికొస్తే తెల్లసొన అధిక ప్రోటీన్ కంటెంట్ కలిగి ఉంటుంది. ఒక పెద్ద గుడ్డులో దాదాపు 6 గ్రాముల ప్రొటీన్‌ ఉంటుంది. గుడ్డులోని తెల్లసొనలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. కోడి మాంసంతో పోలిస్తే గుడ్లు కొంచెం తక్కువ ప్రొటీన్‌ అందించినా యాంటీ ఆక్సిడెంట్లు, అరుదైన విటమిన్లను కలిగిఉంటాయి. చికెన్​లో మాంసకృత్తులతో పాటు, నియాసిన్, సెలీనియం, ఫాస్పరస్, బి విటమిన్లు తదితర పోషకాలు ఉంటాయి.

మీకు డైలీ చేపలు తినే అలవాటు ఉందా? - మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి! - Benefits of Eating Fish Daily

ప్రోటీన్లు, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వుల సమాహారం కోడిగుడ్లు. విటమిన్ D, విటమిన్ B12, రిబోఫ్లావిన్​తో పాటు కోలిన్ వంటి విటమిన్లు, ఖనిజాలు గుడ్డులోనే దొరుకుతాయి. కంటి ఆరోగ్యానికి మేలు చేసే లుటిన్, జియాక్సంతిన్ యాంటీఆక్సిడెంట్లకు గుడ్లు గుప్తనిధుల్లాంటివి. చికెన్, గుడ్లలో అమైనో యాసిడ్ ప్రొఫైల్ సంపూర్ణంగా ఉంటుంది. శరీరానికి అవసరమైన మొత్తం తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలను అందిస్తాయి. కండరాల మరమ్మత్తు, అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తాయి. చికెన్‌లో అధిక ప్రోటీన్ కంటెంట్ ఉన్నా విటమిన్లు, ఖనిజాలు యాంటీఆక్సిడెంట్లను అందించడంలో గుడ్డు విలువ అమూల్యం.

రోజ్​మేరీ TEA : డైలీ ఒక కప్పు తాగితే నమ్మలేని లాభాలు! - మీరూ ట్రై చేస్తారా! - Rosemary Tea Health Benefits

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.