Perfect medicine for complete health : ఆరోగ్యపరంగా ఆయుర్వేద షాపుల్లో చూసినా, ఆన్లైన్లో వెతికినా ఉసిరి (Amla) కాయ గురించే చర్చ. ఉసిరి కాయ, పొడి, రసం గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఉసిరి కాయతో పోల్చదగినవి అతి తక్కువే. నిగనిగలాడే చర్మ కాంతి కోసం ఉసిరి ఎంతో ఉపయోగ పడుతుంది. చర్మం నిగారింపుతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఉసిరి ఆయుర్వేదంలో అగ్రస్థానంలో నిలిచింది.
ఉసిరి రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ఎన్నో ప్రయోజనాలను కల్పిస్తుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తి బూస్టర్‌గా పనిచేస్తుంది. శరీరానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు, గుండె, కాలేయం పనితీరుపై చక్కని ప్రభావం చూపిస్తుంది. తరచుగా వింటున్న ఫ్యాటీ లివర్ (Fatty liver) సమస్యకు ఉసిరి దివ్యౌధం అని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.
ఉసిరి రసం శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అందులో పుష్కలంగా లభించే విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఉసిరి రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ల బారి నుంచి ఉపశమనం పొందవచ్చు. క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం (Diabetic) వంటి దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో ఉసిరి పాత్ర కీలకంగా ఉంటుంది.
క్రమం తప్పకుండా ఉసిరి పొడి, రసాన్ని తీసుకోవడం వల్ల జీర్ణ క్రియను మెరుగుపర్చుకోవచ్చు. తద్వారా జీర్ణ క్రియ మెరుగుపడి మలబద్దకం సమస్యకు చెక్‌పెట్టొచ్చు. రసంలోని అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియలో సహాయపడడంతో పాటు మధుమేహ బాధితులకు మెడిసిన్ లా ఉపయోగపడుతుంది.
హృదయ సంబంధ వ్యాధులను దూరం చేయడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఉసిరి రసం ఎంతో ఉపకరిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతో పాటు రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్త ప్రసరణను క్రమబద్ధీకరిచడం ద్వారా గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఫ్యాటీ లివర్ సమస్యకు చక్కని పరిష్కారంగా ఆయుర్వేద నిపుణులు ఉసిరిని సూచిస్తున్నారు. టాక్సిన్స్‌ను తొలగించడంతో పాటు కాలేయ కణాలను పెంపొందిస్తాయి. ఫ్యాటీ లివర్, లివర్ సిర్రోసిస్ వంటి అనారోగ్య సమస్యలకు క్రమం తప్పకుండా ఉసిరి పొడి, రసాన్ని తీసుకోవడం చక్కని పరిష్కారం అని ఆయుుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
సీ విటమిన్ తోపాటు చర్మ సంరక్షణకు అవసరమైన పోషకాలు ఉసిరిలో అత్యధికంగా ఉంటాయి. ఎంతో సహజసిద్ధంగా చర్మ సౌందర్యంతో పాటు వృద్ధాప్యాన్ని కలిగించే శరీర ముడతలను నివారిస్తుంది. మొటిమలు సహా చర్మ సంబంధ వ్యాధులను అదుపు చేయడంలో ఉసిరి రసం సూపర్ మెడిసిన్.
జుట్టు రాలిపోవడం, బట్టతల, విటమిన్, ఐరన్ లోపాలకు ఉసిరి రసం చక్కని ఔషధం. వెంట్రుకలు రాలిపోకుండా కుదుళ్లను బలోపేతం చేయడంతోపాటు, పెరుగుదలకు సహకరిస్తుంది.
రోజువారి ఆహారంలో ఉసిరి రసాన్ని చేర్చడం మధుమేహ బాధితులకు మేలైన పరిష్కారం. షుగర్ రోగుల్లో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడం, ఇన్సులిన్ మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
బీ అలర్ట్: భోజనానికి ముందు, తర్వాత చాయ్ తాగుతున్నారా? - ICMR Instruction to Avoid Tea