ETV Bharat / entertainment

రిలీజైన వారం రోజులకే ఓటీటీలోకి - సైలెంట్​గా స్ట్రీమ్ అవుతున్న సత్యదేవ్ మూవీ - Satyadev Krishnamma Movie - SATYADEV KRISHNAMMA MOVIE

Satyadev Krishnamma OTT Release : టాలీవుడ్ స్టార్ హీరో సత్యదేవ్ లీడ్ రోల్​లో విడుదలైన 'కృష్ణమ్మ' మూవీ ఇప్పుడు ఓటీటీలో సైలెంట్​గా స్ట్రీమ్​ అవుతోంది. ఎక్కడంటే?

Satyadev Krishnamma OTT Release
Satyadev Krishnamma OTT Release (Source : Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : May 17, 2024, 1:33 PM IST

Satyadev Krishnamma OTT Release : సపోర్టింగ్ క్యారెక్టర్స్​లో మెరుస్తూ లీడ్ రోల్​లో పలు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకునే స్థాయికి వెళ్లారు టాలీవుడ్ స్టార్ హీరో సత్యదేవ్​. ఇటీవలే ఆయన 'కృష్ణమ్మ' అనే సినిమాలో స్ట్రాంగ్​ రోల్​లో కనిపించారు. టీజర్​, ట్రైలర్​తో ఈ సినిమా అభిమానుల్లో అంచనాలు పెంచింది. అయితే ఇటీవలె ధియేటర్లలో కూడా విడుదలై రన్ అవుతోంది. అయితే ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయింది.

అయితే తాజాగా ఈ మూవీ టీమ్​ ఆడియెన్స్​కు షాకిచ్చింది. రిలీజై వారం రోజులు కూడా కాకుండానే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఈ చిత్రాన్ని సైలెంట్​గా స్ట్రీమ్​ చేస్తోంది. నేటి (మే17) నుంచి ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది.

కథేంటంటే : అనాథలైన భద్ర (సత్యదేవ్‌), శివ (కృష్ణ బూరుగుల), కోటి (లక్ష్మణ్‌ మీసాల) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులుగా మెలుగుతారు. చిన్నతనంలోనే జైలు జీవితం గడిపిన శివ, జైలు నుంచి బయటికి వచ్చాక ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌ పెట్టుకుని జీవనాన్ని సాగిస్తుంటాడు. భద్ర, కోటి మాత్రం గంజాయి స్మగ్లింగ్‌ చేస్తుంటారు. అయితే వీళ్లంతా తమకంటూ ఓ కుటుంబం ఉండాలని ఆశ పడతారు. ఈ క్రమంలోనే మీనా (అతీరా రాజ్‌)తో శివ ప్రేమలో పడతాడు.

ఆమె భద్రకు రాఖీ కట్టడం వల్ల తనూ ఆమెను సొంత చెల్లిగా చూడటం మొదలు పెడతాడు. అయితే ఓసారి మీనా తల్లి ఆపరేషన్‌కు సుమారు రూ.2లక్షలు అవసరం ఉంటుంది. దీంతో ఆ డబ్బు సంపాదించడం కోసం భద్ర, శివ, కోటి తప్పనిసరి పరిస్థితుల్లో గంజాయి స్మగ్లింగ్‌ చేయాలని అనుకుంటారు. అలా వాళ్లు పాడేరు నుంచి వైజాగ్‌కు గంజాయి తీసుకొస్తున్న సమయంలో అనుకోకుండా పోలీసులకు దొరికిపోతారు. సరిగ్గా అప్పుడే వాళ్లు ఓ యువతి అత్యాచారం కేసులోనూ ఇరుక్కుంటారు. మరి ఆ తర్వాత వాళ్లకు ఏమైంది? ఆ అత్యాచారానికి గురైన యువతి ఎవరు? ఇటువంటి విషయాలు తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

నటుడు సత్యదేవ్​ ఫ్యామిలీ ఫొటో చూశారా?

'హీరో సత్యదేవ్​ సమర్థుడు.. అతడైతేనే అలా చేయగలడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.