ETV Bharat / entertainment

ఆ భ్రమలో బతికేశాను - అందుకు చాలా గిల్టీగా ఫీలయ్యాను : సమంత

Samantha Take 20 Health Podcast : హీరోయిన్​ సమంత తాను ఆ జాబితాలో ఉన్నందుకు చాలా ఫీలైనట్లు తెలిపింది. రీసెంట్​గా పాడ్​ కాస్ట్​ను ప్రారంభించిన ఈమె తన మొదటి ఎపిసోడ్​ను విడుదల చేసింది. అందులోనే ఈ విషయాన్ని తెలిపింది. ఇంకా అందులో ఏం మాట్లాడిందో తెలుసుకుందాం.

ఆ భ్రమలో బతికేశాను - అందుకు చాలా గిల్టీగా ఫీలయ్యాను : సమంత
ఆ భ్రమలో బతికేశాను - అందుకు చాలా గిల్టీగా ఫీలయ్యాను : సమంత
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 20, 2024, 6:36 AM IST

Samantha Take 20 Health Podcast : ఆ మధ్యలో మయోసైటిస్‌ వ్యాధితో బాధపడిన హీరోయిన్ సమంత ప్రస్తుతం దాని నుంచి క్రమక్రమంగా కోలుకుంటోంది. మొదటి చికిత్స్ తీసుకుంటూనే సినిమాల్లో నటించిన ఈ భామ ఆ తర్వాత ఏడాది పాటు షూటింగ్​లకు బ్రేక్ ఇచ్చి మరీ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టింది. విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకుంటూనే మనసుకు నచ్చినట్టు ఇష్టమైన ప్రదేశాలను చూస్తూ లైఫ్​ను స్పెండ్ చేసింది. అయితే తాజాగా వ్యాధి(Samantha Myositis) బారిన పడిన సమయంలో అనంతరం కోలుకుంటున్న సమయంలో ఎదురైన తన అనుభవాలను అందరితో పంచుకోవడంతో పాటు దానిపై అవగాహన కలిగించేందుకు సిద్ధమైంది సామ్. తాాజాగా టేక్‌ 20 పేరుతో హెల్త్‌ పాడ్‌కాస్ట్​ను మొదలుపెట్టింది. అందుకు సంబంధించిన మొదటి ఎపిసోడ్‌ను విడుదల చేసింది. ఇందులో సమంత అడిగిన పలు ప్రశ్నలకు న్యూట్రీషనిస్ట్‌ అల్కేశ్‌ సమాధానాలిచ్చారు. ఎంతో రీసెర్చ్‌ చేసి, అనుభవజ్ఞుల సలహా, సూచనలతో ఈ వెల్‌నెస్‌ కంటెంట్‌ను అందిస్తున్నట్లు సామ్ తెలిపింది.

సమంత : ఆటో ఇమ్యూనిటీ అంటే ఏంటి? దాని గురించి చెప్పండి.

అల్కేశ్ : ఇది వ్యాధి కాదు. వైరస్‌, బ్యాక్టీరియాల నుంచి వ్యాధినిరోధక వ్యవస్థ కాపాడుతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అదే వ్యవస్థ తిరిగి మన శరీరంపై దాడికి దిగితే ఆటో ఇమ్యూన్‌ సమస్య మొదలవుతుంది.

సమంత : ఆటో ఇమ్యూన్‌ కేసులు ఎక్కువవుతున్నాయని తెలిసి ఆశ్చర్యపోయాను. ముఖ్యంగా షుగర్‌, క్యాన్సర్‌, గుండె సంబంధిత రోగాలున్న వారు దీన్ని ఎదుర్కొంటున్నారు. ఎందుకు?

అల్కేశ్‌ : ఆధునిక జీవనశైలి ప్రధాన కారణం. తినే తిండి నుంచి పీచ్చే గాలి, ధరించే దుస్తులు వరకు, ఇంకా చెప్పాలంటే సౌందర్యోపకరణాలు కూడా. ఇలా వీటన్నింటిలో ఏవైనా ఎఫెక్ట్ చూపొచ్చు. 50 ఏళ్లలో వాతావరణంలోనూ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.

సమంత : మరి నేను మంచి ఆహారం తీసుకుంటున్నాను. ఆరోగ్యంగా ఉన్నాను. ఇలాంటివి నా దరి చేరవు అని కొందరు అభిప్రాయపడుతుంటారు. అంతకుముందు నేనూ ఈ జాబితాలో ఉన్నందుకు చాలా గిల్టీగా ఫీలయ్యాను. పొద్దునే లేచి, వర్కౌట్స్‌ చేసేదాన్ని. హెల్తీ ఫుడ్ తినేదాన్ని. మనస్ఫూర్తిగా నవ్వేదాన్ని. మరి తీవ్ర ఒత్తిడి కారణమంటారా?

అల్కేశ్‌ : అవును. తీవ్ర ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లు ఆటో ఇమ్యూన్‌కు కారకాలు అవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మంచి నిద్ర ఎంతో అవసరం. ఒక్కోసారి శరీరం స్లీప్​ మోడ్​లో ఉన్నా బ్రెయిన్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్​ గురించి ఆలోచిస్తుంటుంది. అది అప్పటికి ఓకే అయినా భవిష్యత్తులో మాత్రం ఎఫెక్ట్‌ పడుతుంది.

సమంత: ఈ సమస్యను అధిగమించాలంటే ఏం చేయాలి?

అల్కేశ్‌: ఫ్రెష్​ ఫుడ్ తీసుకోవాలి. ఫిల్టర్‌ చేసిన నీరును తాగాలి. కాస్మోటిక్స్‌ తదితర వాటి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి.

వరుసగా 11 ఫ్లాప్​లు- కెరీర్​లో ఎన్నో ట్రబుల్స్- కట్ చేస్తే రూ.300 కోట్ల స్టార్

తెలుగు ఆడియెన్స్ - ఈ రెండు మలయాళ చిత్రాల గురించే చర్చంతా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.