ETV Bharat / entertainment

ఒక్క సినిమా - కానీ బాలీవుడ్​ మోస్ట్​ రిచెస్ట్​ హీరో! - Richest Actor In Bollywood

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 1, 2024, 12:57 PM IST

ఒకప్పుడు శాలువాలు అమ్మిన వ్యక్తి, ఇప్పుడు బిజినెస్​ టైకూన్​గా మారారు. చేసింది ఒక్క సినిమాలోనే నటించారు కానీ బాలీవుడ్​లో పాపులరయ్యారు. ఇంతకీ ఆ స్టార్ ఎవరంటే?

Richest Actor In Bollywood
Richest Actor In Bollywood (Getty Images, ANI)

Richest Actor In Bollywood : సినీ ప్రపంచంలో ఎంతో మంది నటీనటలు ఏమీ లేని స్థాయి నుంచి సూపర్​ స్టార్​ రేంజ్​కు ఎదిగిన వాళ్లు ఉన్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్​ల్లోనూ సక్సెస్‌ఫుల్​గా రాణిస్తున్నారు. కానీ, ఓ నటుడు కేవలం ఒక్క సినిమాలో మాత్రమే నటించి ఇప్పుడు బాలీవుడ్​లో రిచెస్ట్ పర్సన్‌గా రికార్డుకెక్కారు. ఇంతకీ ఆయన ఎవరంటే?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్​ భర్త రాజ్ కుంద్రాకు, సినిమాల కంటే బిజినెస్​పైనే ఇంట్రెస్ట్. దీంతో ఆయన పలు రకాల వ్యాపార రంగాల్లో రాణించాలని అనుకున్నారు. కొన్నింటిలో సక్సెస్​ అయ్యారు కూడా. కానీ అనేక కాంట్రవర్సీల నడుమ చిక్కుకున్నారు. అయితే ఒకానొక సమయంలో ఆయన తన బిజినెన్​ను ఎలా ప్రారంభించారంటే?

రాజ్ కుంద్రా ఇండియాకు చెందిన వ్యక్తే అయినప్పటికీ, వారి కుటుంబం ఇంగ్లాండ్​కు వలస వెళ్లింది. దీంతో ఆయన బాల్యమంతా లండన్​లోనే గడిచింది. ఇక కాలేజీలో చదువుకుంటున్న సమయంలో ఆయన అనుకోకుండా దుబాయ్ వెళ్లారు. అక్కడి నేపాల్ వెళ్లి అక్కడ శాలువాల వ్యాపారం మొదలుపెట్టారు. బ్రిటన్​లోని ఫ్యాషన్ రిటైలర్స్‌కు వాటిని అమ్మి బాగా సంపాదించారు.

ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్​ శిల్పా శెట్టిని వివాహం చేసుకున్నారు. ఇక తన సొంత బ్యానర్​పై తెరకెక్కిన 'UT 69' అనే బయోపిక్‌లో నటించారు. కొంతకాలానికి అశ్లీల సినిమాలు చిత్రీకరిస్తున్నారంటూ ముంబయి జైలులో ఖైదీగా ఉన్నాడు. కొన్ని మీడియా సంస్థలు ప్రచురించిన కథనాల ప్రకారం ప్రస్తుతం రాజ్​ కుంద్రా ఆస్తుల విలువ సుమారు రూ.3 వేల కోట్లు ఉంటుందని అంచనా. ఇది ఇప్పటి కొంతమంది ప్రముఖ హీరోల ఆస్తుల కంటే ఎక్కువేనని సమాచారం.

ఇదిలా ఉండగా, రాజ్ కుంద్రా భార్య శిల్పా శెట్టి ఐపీఎల్​ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ సహ యజమానిగా వ్యవహరిస్తున్నారు. వీటితో పాటుగా వీరికి గ్రూప్కో డెవలపర్స్, టీఎంటీ గ్లోబల్స్​ లాంటి సంస్థల్లో భారీ పెట్టుబడులు కూడా ఉన్నాయని సమాచారం. సోషల్ మీడియా లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్​లో ఒకటైన జేఎల్ స్ట్రీమ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సీఈఓగా కూడా వ్యవహరిస్తున్నారు రాజ్​ కుంద్రా.

10 నిమిషాల పెర్ఫామెన్స్​కు రూ.కోటిన్నర- స్టార్​ హీరోల్లా ఈ సింగర్ లైఫ్​! - Star Charges Rs1Cr For 10 Min

సల్మాన్ సినిమాతో పాపులరైన హీరోయిన్​ - ఇప్పుడు మూవీస్​కు నో అంటోంది! - Actress Got Popular By Salman Movie

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.