IVF Born Celebrities: పెళ్లై ఏళ్ళు గడుస్తున్నా పిల్లలు కలగని జంటలకు తల్లిదండ్రులయ్యే అవకాశం కలిగిస్తుంది ఐవీఎఫ్ (IVF). ఎటువంటి గర్భ నిరోధక పద్ధతులు పాటించకపోయినా కొంతమందికి తల్లిదండ్రులయ్యే అదృష్టం దక్కదు. అటువంటి వారిని బిడ్డల్లేరనే బాధ నుంచి దూరం చేస్తుంది. సంతానోత్పత్తిలో సాధించిన పురోగతిని గుర్తించడానికి ప్రతి సంవత్సరం జూలై 25న ప్రపంచ IVF దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఐవీఎఫ్ ద్వారా తల్లిదండ్రులైన సెలబ్రిటీ జంటల గురించి ఒకసారి తెలుసుకుందాం.
ఇషా అంబానీ- ఆనంద్ పిరమల్: ప్రముఖ వ్యాపార వేత్త ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (IVF)ద్వారానే కవలలకు జన్మనిచ్చారు. తను కూడా తన తల్లిలాగానే ఐవీఎఫ్ ద్వారానే కొడుకు కృష్ణ, కుమార్తె ఆదియాలకు జన్మనిచ్చానని ఓ సందర్భంలో చెప్పారు. ఇందులో సిగ్గుపడి, దాచుకోవాల్సిన విషయం ఏం లేదని ఇషా గతంలోనే అన్నారు.
షారుక్ ఖాన్- గౌరీ ఖాన్: బాలీవుడ్ బాద్ షా షారుక్- గౌరీ దంపతులు తమ కుటుంబంలోకి మూడవ బిడ్డను స్వాగతించటానికి IVFని ఎంచుకున్నారు. తమ చిన్నారి అబ్రహామ్ నెలలు నిండకుండానే జన్మించినప్పుడు చాలా భయపడ్డామని, అయితే భగవంతుని కృప వల్ల తాము అతనిని పొందామని చెబుతారు.
కరణ్ జోహార్: పితృత్వాన్ని ఆస్వాదించాలన్న ఏకైక కారణంతో ఐవీఎఫ్ ద్వారా తండ్రిగా మారారు ప్రఖ్యాత సినీనిర్మాత కరణ్ జోహార్. వివాహం చేసుకోకుండానే ఇద్దరు పిల్లలచేత కరణ్, నాన్న అని పిలిపించుకుంటున్నారు.
సన్నీ లియోని- డేనియల్ వెబర్: సన్నీ లియోని- డేనియల్ వెబర్ దంపతులు 2017లో ఒక బిడ్డను దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత 2018లో సన్నీ- ఆమె భర్త డేనియల్ సరోగసీ ద్వారా ఇద్దరు అబ్బాయిలకు తల్లిదండ్రులయ్యారు. ఇప్పడు వారు తమ ముగ్గురు పిల్లలు నిషా కౌర్ వెబర్, అషెర్ సింగ్ వెబర్, నోహ్ సింగ్ వెబర్‌తో ఆనందంగా ఉన్నారు.
అక్షయ్ కుమార్- ట్వింకిల్ ఖన్నా: మొదటి బిడ్డ నితారాకు జన్మ నిచ్చిన తర్వాత రెండో బిడ్డ కోసం సినీనటులు అక్షయ్ కుమార్- ట్వింకిల్ ఖన్నా రెండో సంతానం కోసం ఐవీఎఫ్‌ను ఎంచుకున్నారు. వారికి ఈ ఆధునిక పరిష్కార మార్గం ద్వారానే కుమారుడు ఆరవ్ జన్మించాడు.
ఆమీర్ ఖాన్- కిరణ్ రావు: ఐవీఎఫ్ చికిత్స ద్వారానే సినీ నటుడు ఆమీర్ ఖాన్- కిరణ్ రావు తమ కుమారుడు ఆజాద్ రావ్ ఖాన్‌కు జన్మ నిచ్చారు.
శోభా డే : ప్రముఖ రచయిత్రి శోభా డే 46ఏళ్ళ వయసులో IVF ప్రయాణాన్ని మొదలు పెట్టి తల్లిగా మారారు. మాతృత్వానికంటే కెరీర్‌కు ప్రాధాన్యతనిచ్చే మహిళలకు ఇదొక మంచి అవకాశం.
మందిరా బేడీ- రాజ్ కౌశల్: మందిరా బేడీ- రాజ్ కౌశల్ జంట తల్లిదండ్రులుగా మారాలన్న కోరికతో IVF ద్వారా ప్రయత్నించి కుమారుడు వీర్‌ను స్వాగతించారు.
వివేక్ ఒబెరాయ్- ప్రియాంక అల్వా: IVF ద్వారానే ఈ జంట కూడా వివాన్కు తల్లిదండ్రులయ్యారు.
జాన్ అబ్రహం- ప్రియా రుంచల్: సినీ నటుడు జాన్ అబ్రహం అతని భార్య ప్రియా రుంచల్ యొక్క ఐవిఎఫ్ ద్వారా తమ కుటుంబంలోకి కవలలకు స్వాగతం పలికారు.
అక్షయ్ ఖన్నా: తనకంటూ పిల్లలు అనే బంధం కావాలని కోరుకున్న అక్షయ్ ఖన్నా IVF ద్వారా కొడుకు వివాన్‌ను పొందగలిగారు.
ఫరా ఖాన్- శిరీష్ కుందర్: ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ 2008లో కుటుంబం IVF సాంకేతికతను ఉపయోగించి ముగ్గురు పిల్లలకి జన్మనిచ్చారు. 'ఐవీఎఫ్ ద్వారా పిలల్ని కన్నాం' అని బహిరంగంగా చెప్పుకున్న తొలి బాలీవుడ్ జంట వీరిదే. ఈ విషయం గురించి ఫరాఖాన్ మాట్లాడుతూ పిల్లలు లేకుండా ఉండటమా లేదా ఐవీఎఫ్నా అనే ఆలోచన వచ్చిన రోజున తాను పిల్లలవైపే మొగ్గు చూపానన్నారు. IVF ద్వారా పిలల్ని కనే సమయానికి ఫరా ఖాన్ వయసు 43 సంవత్సరాలు.
లిసా రే: ప్రముఖ నటి, మోడల్ లిసా రే కూడా IVF సహాయంతో 40 ఏళ్ల వయస్సులో కవల కుమార్తె పొందింది.
ఏక్తా కపూర్: మనదేశంలో సింగిల్ IVF సెలబ్రిటీ తల్లులలో ఏక్తా కపూర్ ఒకరు. ఆమె సహజంగా జన్మని ఇవ్వకపోయినప్పటికి ఒక మగ బిడ్డని ఐవిఎఫ్ ద్వారా పొందారు.
తుషార్ కపూర్: ఏక్తా కపూర్ సోదరుడు తుషార్ కూడా వివాహం కాకుండానే ఐవీఎఫ్ ద్వారా తండ్రిగా మారారు. సరోగసీ ద్వారా 2016 సంవత్సరంలో లక్ష్య అనే బాలుడికి తండ్రి అయ్యారు.
సోహైల్ ఖాన్- సీమా ఖాన్: నటుడు సోహైల్ ఖాన్- అతని భార్య సీమా ఖాన్ మొదటి సంతానం కలిగిన 10 సంవత్సరాల తర్వాత రెండో బిడ్డకు సరోగసీ ద్వారా స్వాగతం పలికారు.
IVF Treatment: సహజంగా ప్రయత్నించినా సంతానం కలగకపోతే వైద్యులు చివరి ప్రయత్నంగా ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారు. దశల వారీగా జరిగే ఈ ప్రక్రియ చాలా ఖర్చుతో కూడుకున్నది కూడా. IVF చికిత్స ఖర్చు దాదాపు లక్ష నుంచి 3 లక్షల వరకు ఉంటుంది. మహిళల ప్రత్యుత్పత్తి హక్కులను పరిరక్షించడమే లక్ష్యంగా 2021లో అసిస్టెట్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్‌టీ) బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఐవీఎఫ్ పద్ధతి కూడా దీని పరిధిలోకి వస్తుంది. ఈ చట్టం మేరకు 21 నుంచి 45s ఏళ్ల లోపు వయోపరిమితి కలిగిన వారు మాత్రమే ఐవీఎఫ్ ద్వారా కృత్రిమ గర్భధారణకు అర్హులు.
ఏకంగా 200 సినిమాలకు నో - హీరో అవ్వాల్సినోడు సీరియల్స్ చేస్తున్నాడు! - Actor Rejected 200 Films