Sandeep Raj Chandini Rao Marriage : 'కలర్ ఫొటో' డైరెక్టర్ సందీప్ రాజ్, నటి చాందినీ రావు మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. తిరుమల వేదికగా శనివారం ఈ ఇద్దరి పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు వైవా హర్ష హీరో సుహాస్ తదితరులు హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు, వీడియోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఇక సందీప్ -చాందినీ వివాహ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఈ కొత్త జంటకు కంగ్రాజ్యూలేషన్స్ తెలుపుతున్నారు.
లవ్ స్టోరీ మొదలైంది ఇలా :
సందీప్ డైరెక్ట్ చేసిన 'కలర్ ఫొటో'లో చాందినీ రావు కీ రోల్ ప్లే చేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఈ ఇద్దరి మధ్య పరిచయం పెరిగి, అది కాస్త ప్రేమగా మారింది. ఇక కొంత కాలం ప్రేమించుకున్న ఈ జంట పెద్దల అంగీకారంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు. అయితే 'కలర్ ఫొటో' తర్వాత 'హెడ్స్ అండ్ టేల్స్' అనే వెబ్‌సిరీస్‌లోనూ చాందిని నటించారు. 'రణస్థలి' అనే చిత్రంలోనూ మెరిశారు.
Sandeep Raj Movies : ఇక సందీప్ కెరీర్ విషయానికి వస్తే, షార్ట్ ఫిల్మ్స్‌తో తన సినీ జర్నీ మొదలుబెట్టిన సందీప్, ఆ తర్వాత 'హెడ్స్ అండ్ టేల్స్' వెబ్ సిరీస్‌తో పాటు 'ముఖ చిత్రం' సినిమాలకు కథలు అందించారు. 'కలర్ ఫొటో' సినిమాతో ఆయన ప్రతిష్టాత్మక నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఉత్తమ తెలుగు చిత్రం విభాగంలో ఆయనకు ఈ జాతీయ అవార్డు లభించింది.
ఇదిలా ఉండగా, సందీప్ ప్రస్తుతం రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల లీడ్ రోల్లో 'మోగ్లీ' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీంతో పాటు మాస్ మహారాజా రవితేజ హీరోగా ఓ సినిమా చేసేందుకు సిద్ధమైనట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇవే కాకుండా మరికొన్ని కథలు కూడా ఆయన దగ్గర ఉన్నాయట. 2025లో ఆయన తెరకెక్కిస్తున్న ఈ కొత్త సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
డైరెక్టర్ సందీప్‌రాజ్ భావోద్వేగం.. రాష్ట్రపతి చేతులు మీదుగా జాతీయ పురస్కారం