ETV Bharat / education-and-career

ఏంది బ్రో మీరు చెప్పే చదువు - ఒకటో తగరతి బుడ్డోడి స్కూల్‌ ఫీజు అక్షరాల రూ.4.27లక్షలా!

చదువు చెప్పించడం కన్నా లగ్జరీకే పిల్లలను అలవాటు చేస్తున్నామని ఓ తండ్రి ఆవేదన

1st class Student School Fee
1st class Student School Fee (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

1st class Student School Fee: చదువుకునే రోజులు పోయి చదువు "కొనే"రోజులొచ్చాయి. కార్పొరేట్‌ విద్య పేరిట తల్లిదండ్రులు మనోవేదన అనుభవిస్తున్నారు. లక్షల్లో వేతనాలున్నా టీచర్ల పనితీరు కారణంగా ప్రభుత్వ పాఠశాలలు బలహీనపడ్డాయి. ఇదే అదునుగా గల్లీకి ఒకటిగా పుట్టుకొచ్చిన ప్రైవేట్‌ విద్యా సంస్థలు వందలు, వేల రూపాయలు దాటి లక్షల్లో ఫీజులు వస్తూలు చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన చదువు చెప్పరేమో భావన, సమాజంలో సోషల్‌ స్టేటస్‌ తగ్గుతుందేమో అన్న ఓరకమైన ఆత్మనూన్యతతో తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురువుతున్నారు. కార్పొరేట్‌ స్కూల్స్‌పై ఉన్న మమకారంతో ప్రెస్టీజ్‌గా భావించి చదువుకోవటం కాదు చదువు "కొనే"ందుకు వెనుకాడటం లేదు. ఎంత ఎక్కువ ఫీజు ఉన్న పాఠశాలకు పంపితే తమ స్టేటస్‌ అంత ఎక్కువ అన్న భావనలో కొట్టుకుపోతున్నారు. ఫలితంగా కార్పొరేట్‌ విద్యా వ్యాపారం విరాజిల్లుతోంది. మధ్య తరగతి వారికి ప్రైవేటు విద్య అందని ద్రాక్షగా మారిందన్న ఆందోళనలతో ఫీజు నియంత్రణ చట్టం తెచ్చామని పాలకులు చెబుతున్నా అది అమలు కావటం లేదు. ఈ క్రమంలో ఓ విద్యార్థి తండ్రి ప్రైవేటు ఫీజు దోపిడీపై సోషల్‌ మీడియాలో చేసిన పోస్టు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. తన కూతురును చేర్పించాలనుకుంటున్న పాఠశాలలో ఒకటో తరగతి ఫీజే రూ.4.27 లక్షలని ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.

ప్రైవేటు విద్య అందని ద్రాక్ష : ప్రైవేటు చదువులు మధ్య తరగతికి అందని దాక్షలా మారిందన్న ఆవేదన పై పోస్టులో మనకు అర్థం అవుతోంది. తన కూతురును చేర్పించే పాఠశాలలో ఒకటో తరగతి ఫీజు రూ.4.27 లక్షలని పేర్కొన్నాడు. జైపూర్‌కు చెందిన రిషబ్‌ జైన్‌ భారీ స్కూల్‌ ఫీజు గురించి సోషల్‌ మీడియాలో పోస్టు ద్వారా చాలా మందికి తెలియజేశారు. చిన్నారి కోసం ఓ స్కూల యాజమాన్యాన్ని సంప్రదించగా అక్కడ ఫీజు రూ.4.,27 లక్షలని పేర్కొన్నట్లు తెలిపాడు. దేశంలో మిడిల్‌ క్లాస్‌ వారికి నాణ్యమైన విద్య ఓ లగ్జరీగా మారిందన్న విషయాన్ని ఈ పోస్టు తేటతెల్లం చేస్తోంది. ఒకటో తరగతి చేర్పించేందకు రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.2 వేలు, ఇక అడ్మిషన్‌ ఫీజు రూ.40 వేలు అని, రిఫండబుల్‌ ఫీజు రూ.5 వేలుగా ఆ పాఠశాల ఇచ్చిన రశీదులో ఉంది. వార్షిక ఫీజు రూ.2.52 లక్షలు, బస్సు ఫీజు రూ.1.08 లక్షలుగా పోస్టులో పేర్కొన్నారు. పాఠశాల యూనిఫామ్‌కు రూ.20 వేలు, ఇలా మొత్తం కలిపితే ఒకటో తరగతి బుడ్డోడి ఫీజు అక్షరాల రూ.4.27 లక్షలుగా తేలింది.

ఏ మాధ్యమంలో ఉంటుందో?- పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో గందరగోళం

ఏటా రూ.20 లక్షల సంపాదన ఉన్న తల్లిదండ్రులు కూడా ఈ పాఠశాలో తమ పిల్లలను చేర్చాలంటే బయపడుతున్నారని రిషబ్‌ జైన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 20లక్షలు జీతం వస్తే అందులో 50 శాతం ఆదాయాన్ని పన్ను, జీఎస్‌టీ, పెట్రోల్‌పై వ్యాట్, రోడ్‌ ట్యాక్స్, టోల్‌ ట్యాక్స్, ప్రొఫెషనల్‌ ట్యాక్స్‌ క్యాపిటల్‌ గెయిన్‌ ట్యాక్స్, లాండ్‌ రిజిస్ట్రేషన్‌ చార్జీలు తదితరాలు ప్రభుత్వం లాక్కుటుందని వెల్లడించాడు. ఇక జనరల్‌ ఇన్సూరెన్స్, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ వంటి ప్రీమియంలో, పీఎఫ్, ఎన్‌పీఎస్‌ వంటివి మనమే కట్టుకోవాలని తెలిపాడు. ఇలా రూ.20 లక్షల వార్షిక ఆదాయం ఉంటే ఐటీ 30 శాతం చెల్లించాలి అని వెల్లడించాడు.

1st class Student School Fee
1st class Student School Fee (ETV Bharat)
రిషబ్‌ జైన్‌ చేసిన ఈ పోస్టు కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. పోస్టును చూసిన నెటిజన్లు, పేరెంట్స్‌ ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. ఇంత డబ్బు వెచ్చించినా నాణ్యమైన విద్య దొరుకుతుందన్న గ్యారెంటీ లేదని వాపోతున్నారు.

వచ్చారు అంటే నిజంగా రాలేదు : రిజిస్టర్​​లో ప్రజెంట్​ - రియల్​గా ఆబ్సెంట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.