ETV Bharat / business

వాట్సాప్​లో ITR ఫైల్ చేయాలా? ఇదీ ప్రాసెస్!​ - How To File ITR Via WhatsApp - HOW TO FILE ITR VIA WHATSAPP

How To File ITR Via WhatsApp : మీరు ఇంకా ఐటీఆర్​ ఫైల్ చేయలేదా? ఎలా చేయాలో కూడా తెలియడం లేదా? డోంట్ వర్రీ! ఇప్పుడు వాట్సాప్​ నుంచే నేరుగా ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడూ తెలుసుకుందాం.

income tax returns via WhatsApp
ITR Filing 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 24, 2024, 5:12 PM IST

Updated : Jul 24, 2024, 5:17 PM IST

How To File ITR Via WhatsApp : ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) ఫైలింగ్ అనేది ఇప్పుడు చాలా ఈజీ. ఎంతగా ఈజీ అంటే? చివరకు మన వాట్సాప్ నుంచి కూడా ఐటీఆర్‌ను ఫైల్ చేసేయొచ్చు. ClearTax వేదిక ద్వారా మనం ఈ సౌకర్యాన్ని పొందొచ్చు. ప్రస్తుతానికి వాట్సాప్ నుంచి మనం ఐటీఆర్-1, ఐటీఆర్-4 ఫామ్‌లను ఆదాయపు పన్నుశాఖకు సమర్పించవచ్చు. ఈ ఫామ్‌లు అతితక్కువ ఆదాయ వర్గాల వారికి సంబంధించినవి. అంటే దేశంలోని సామాన్యులు వాట్సాప్‌లోనే క్లియర్ ట్యాక్స్ (ClearTax) వేదిక ద్వారా సులభంగా ఐటీఆర్‌ ఫైలింగ్‌‌ చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

వాట్సాప్‌లో ఐటీఆర్‌ ఫైలింగ్ ఇలా!

  • తొలుత క్లియర్ ట్యాక్స్ కంపెనీకి చెందిన వాట్సాప్ అఫీషియల్ నంబర్​కు మెసేజ్‌ పంపించాలి.
  • మనం మెసేజ్‌ను పంపిన తర్వాత, ఐటీఆర్ దాఖలుకు సంబంధించిన డిజిటల్ ప్రక్రియను క్లియర్ ట్యాక్స్ టీమ్ మొదలుపెడుతుంది.
  • మన ప్రాథమిక వివరాలను వారికి వాట్సాప్‌లోనే అందించాలి.
  • చివర్లో మనకు ఐటీఆర్-1, ఐటీఆర్-4 ఫామ్‌లను చూపిస్తారు.
  • మన అవసరాలకు సరిపోయే ఐటీఆర్ ఫామ్‌ను ఎంపిక చేసుకొని, దానిలో వివరాలను నమోదు చేయాలి.
  • రూ.5వేలలోపు వ్యవసాయ ఆదాయం కలిగిన రైతులు ఐటీఆర్-1 ఫామ్‌ను ఎంపిక చేసుకోవాలి.
  • రూ.5వేలకుపైగా వ్యవసాయ ఆదాయం కలిగిన రైతులు ఐటీఆర్-2 ఫామ్‌ను ఎంపిక చేసుకోవాలి.
  • ఈ ఫామ్‌లు నింపే క్రమంలో పన్ను చెల్లింపుదారులు అవసరమైన సమాచారాన్ని ఫొటోలు, ఆడియో, టెక్ట్స్ రూపంలో అందించవచ్చు. ఇందులో వ్యక్తిగత వివరాలు, ఆదాయ వివరాలు, అవసరమైన పత్రాలు ఉంటాయి.
  • క్లియర్ ట్యాక్స్ కంపెనీ ఐటీఆర్ ఫైలింగ్‌ సేవలను ప్రస్తుతం 10 భాషలలో అందిస్తోంది. ఈ జాబితాలో ఇంగ్లీష్, హిందీ, కన్నడం సహా పలు భాషలు ఉన్నాయి.

ఐటీఆర్ - 1 ఫామ్ అంటే?
ఐటీఆర్ -1 ఫామ్‌ను ‘సహజ్’ అని కూడా పిలుస్తారు. పెన్షన్, జీతం, ఇంటి అద్దె, ఇతర వనరుల ద్వారా ఆదాయం సంపాదించే వారు ఐటీఆర్ ఫైలింగ్ కోసం ఈ ఫామ్‌ను ఎంపిక చేసుకోవాలి. బెట్టింగ్, జూదం, లాటరీల ద్వారా ఆదాయం ఆర్జించేవారు ఈ ఫామ్ నింపడానికి వీలుండదు.

ఐటీఆర్ -4 ఫామ్ అంటే?
ఐటీఆర్-4 ఫామ్‌ను ‘సుగమ్’ అని కూడా పిలుస్తారు. వ్యాపారం, వృత్తి కార్యకలాపాల ద్వారా ఆదాయాన్ని సంపాదించే వ్యక్తులు ఐటీఆర్ ఫైలింగ్ కోసం ఈ ఫామ్‌ను ఎంపిక చేసుకోవాలి. హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్), భాగస్వామ్య వ్యాపారం చేసే సంస్థలకు ఈ ఫామ్ వర్తిస్తుంది.

మరికొద్ది రోజులే ఛాన్స్​
ఎలాంటి పన్నుల భారం లేకుండా ఉచితంగా ఐటీఆర్‌ను ఫైల్ చేయడానికి చివరి తేదీ జులై 31. ఆ తర్వాత ఫైలింగ్ చేస్తే ఆదాయానికి అనుగుణంగా జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది. అందుకే వీలైనంత త్వరగా ఐటీఆర్ దాఖలు చేయడం చాలా మంచిది.

గూగుల్ నుంచి రూ.2లక్షల కోట్ల ఆఫర్​ - కానీ నో చెప్పిన స్టార్టప్ - ఎందుకో తెలుసా? - Wiz Rejected Google Offer

రూ.7 లక్షల్లో మంచి కారు కొనాలా? టాప్-10 ఆప్షన్స్ ఇవే! - Cars Under 7 Lakh

Last Updated : Jul 24, 2024, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.