Buying A Car With Credit Card : ఈరోజుల్లో క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగింది. క్రెడిట్ కార్డుతో లావాదేవీ జరిపినట్లయితే.. EMI ఆప్షన్స్, ఆఫర్స్, రివార్డు పాయింట్స్ లభిస్తుండడంతో చాలామంది వీటిని వినియోగిస్తున్నారు. అందుకే కొందరు.. రివార్డు పాయింట్లు ఎక్కువగా వస్తాయనే ఉద్దేశంతో.. భారీ కొనుగోళ్లు కూడా జరుపుతారు. ఈ క్రమంలోనే కొందరు కార్లు కూడా క్రెడిట్ కార్డుతో కొనేస్తున్నారు. మరి.. ఇది ఎంత వరకు తెలివైన నిర్ణయం? లాభమా.. నష్టమా? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
- మీరు క్రెడిట్ కార్డుతో కారు కొనుగోలు చేస్తే మీకు రివార్డు పాయింట్లు రావొచ్చుగానీ.. మీరు చేసిన ఖర్చుపై విధించే వడ్డీ మాత్రం అధికంగా ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ విషయం గమనించాలి.
- క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసిన తర్వాత చెల్లించాల్సిన బ్యాలెన్స్ EMIలోకి మార్చేస్తే.. ఎక్కువ వడ్డీ ఛార్జ్ చేసే అవకాశం ఉంది.
- గడువు తేదీలోగా బ్యాలెన్స్ చెల్లించలేకపోతే.. మీపై భారీ వడ్డీ పడే ఛాన్స్ ఉంటుంది. ఈ భారం మీరు పొందిన రివార్డు పాయింట్లతో జరిగే మేలుకన్నా ఎక్కువగా ఉండొచ్చు.
- డీలర్లు తాము చెల్లించాల్సిన అధిక మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీల కారణంగా.. క్రెడిట్ కార్డుల ద్వారా పూర్తి చెల్లింపును అంగీకరించడానికి ఇష్టపడరు. ఒకవేళ డీలర్లు క్రెడిట్ కార్డులను అంగీకరిస్తే.. MDR ఛార్జీల భారాన్ని కూడా కొనుగోలుదారు మీదనే వేసే ఛాన్స్ ఉంటుందట. సాధారణంగా ఈ MDR ఛార్జీలు.. లావాదేవీ మొత్తంలో 2-3% మధ్య ఉంటాయి.
- MDR అంటే.. కంపెనీ డెబిట్, క్రెడిట్ కార్డు లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి విధించే రుసుము.
క్రెడిట్ కార్డ్ 'రివార్డ్ పాయింట్స్' పెంచుకోవాలా? ఈ సింపుల్ టిప్స్ పాటించండి!
- క్రెడిట్‌కార్డుతో ఏదైనా భారీ లావాదేవీలు చేసే ముందు ఫైన్ ప్రింట్‌నూ నిశితంగా చదవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. కొన్ని క్రెడిట్ కార్డ్ కంపెనీలు ఒకే కొనుగోలుపై కస్టమర్ అందుకునే రివార్డు పాయింట్ల సంఖ్యను తగ్గించి ఉండొచ్చు. అలాగే.. కొన్ని కంపెనీలు రివార్డు పాయింట్లను ఎలా వాడుకోవాలనే దానిపై రూల్స్ పెడతాయి. అందుకే.. ఫైన్ ప్రింట్‌ను చదవడం మంచిది.
- ఏదేమైనప్పటికీ.. రివార్డ్ పాయింట్‌లను సంపాదించడానికి మీ క్రెడిట్ కార్డుతో కారును కొనుగోలు చేయడం అనేది ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయమని సూచిస్తున్నారు. తిరిగి చెల్లించే విషయంలో స్పష్టమైన ప్లాన్ ఉంటే తప్ప.. క్రెడిట్ కార్డు ద్వారా కారు కొనుగోలు చేయకూడదని చెబుతున్నారు. లేదంటే.. అనవసరంగా ఆర్థిక భారం మోస్తూ అప్పులపాలవ్వాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఇలా చేస్తే మీ క్రెడిట్ స్కోర్ ఎప్పుడూ తగ్గదు! అసలు ఎలా లెక్కిస్తారో తెలుసా?