ETV Bharat / bharat

పిల్లల బాధ్యతలను బంధువులకు అప్పగించినా తండ్రే సంరక్షకుడు!: సుప్రీంకోర్టు - Father Custodial Rights On Kids

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 21, 2024, 5:32 PM IST

Sc On Father Custodial Rights On Kids : తమ పిల్లల(మైనర్లు) బాధ్యతలను బంధువులకు అప్పగించినంత మాత్రన తండ్రే సంరక్షకుడిగా ఉంటాడని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరిస్థితుల దృష్ట్యా తన పిల్లల సంరక్షణను వేరే వాళ్లకు అప్పగించినా సరే సహజ సంరక్షకుడిగా తండ్రే ఉంటాడని పేర్కొంది. ఓ కేసు విషయంలో ఈమేరకు వ్యాఖ్యానించింది.

SC On Father Custodial Rights On Kids
SC On Father Custodial Rights On Kids (ANI)

SC On Father Custodial Rights On Kids : తన పిల్లల(మైనర్లు) బాధ్యతలను బంధువులకు అప్పగించినా సరే తండ్రి సహాజ సంరక్షకుడిగా ఉండే హక్కును కలిగి ఉంటాడని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బంధువుల దగ్గర ఉన్న తన కుమార్తెను అప్పగించాలని కోరుతూ ఓ తండ్రి వేసిన పిటిషన్​పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. పిల్లలను సంరక్షకుడిగా ఉండే హక్కు తల్లికే కాకుండా తండ్రికి కూడా ఉంటుందని పేర్కొంది.

'కూతురిని చూసుకునే బాధ్యత తండ్రికి లేదు'
కరోనా సమయంలో గౌతమ్​ కుమార్ దాస్ దంపతులకు ఆడపిల్ల పుట్టింది. అప్పటికే ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఆడపిల్ల పుట్టిన 10 రోజులకే ఆ శిశువు తల్లి మరణించింది. దీంతో ఆ పిల్లలిద్దరినీ సంరక్షణను అతడి భార్య సోదరీమణులకు అప్పగించాడు. ఆ తర్వాత కొంతకాలానికి అతడు మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. పిల్లలిద్దరినీ తనకు అప్పగించాలని కోరాడు. అయితే వాళ్లు కుమారుడు ఇచ్చి, కుమార్తెను వాళ్లే దగ్గరే ఉంచుకున్నారు. పాపను కూడా ఇవ్వాలని కోరగా దానికి బంధువులు నిరాకరించారు. తమ దగ్గరే ఉంటుందని అన్నారు. దీంతో ఆయన దిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఆ అమ్మాయిని చూసుకునే బాధ్యతను ఆ మహిళలకే అప్పగించి, గౌతమ్​ను కేవలం అప్పుడుప్పుడు వెళ్లి చూసుకునే అవకాశం మాత్రం కల్పించింది. ఈ తీర్పును గౌతమ్​ సవాల్​ చేస్తూ సుప్రీం కోర్టులో పిటషన్​ దాఖలు చేశాడు.

తండ్రికి అప్పగించాలి!
దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్​లతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. 'పిటిషనర్ అప్పుడున్న పరిస్థితులు కారణంగా తన పిల్లల సంరక్షణ బాధ్యతను ఆ మహిళలకు అప్పగించాడు. కొంతకాలం వేరే వాళ్లు పిల్లల బాధ్యతలను చూసుకున్నంత మాత్రన తండ్రికి సంరక్షణ హక్కును తిరస్కరించేందుకు కుదరదు. పిటిషనర్ కూడా దిల్లీలో ఉంటూ మంచి ఉద్యోగం చేస్తున్నాడు. తన పిల్లలను చదివించే స్తోమత ఉంది. అందుకే అతడి కుమార్తెను తండ్రికి అప్పగించాలి. తొందరగానే తండ్రికి అలవాడు పడుతుంది. అయితే పిల్లలను అప్పుడప్పుడు వచ్చి చూసే హక్కు ఆ మహిళలకు ఉంటుంది' అని ధర్మాసనం పేర్కొంది.

'తండ్రి ఆస్తుల్లో.. వారి కంటే కుమార్తెలకే ప్రాధాన్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.