ETV Bharat / bharat

2024 ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన ప్రశాంత్ కిషోర్! - Lok Sabha Elections 2024

Prasant Kishore On BJP Seats : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గతసారి ఫలితాలనే దక్కించుకుంటుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ జోస్యం చెప్పారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన, ప్రధాని మోదీపై ప్రజలకు నిరాశ ఉన్నప్పటికీ ఎక్కువగా కోపం మాత్రం లేదని పేర్కొన్నారు. ఒకవేళ బీజేపీకు నష్టం జరిగితే అది ఉత్తర, పశ్చిమ భారతంలో మాత్రమే జరుగుతుందని, దక్షిణాదిన కాదని వివరించారు. చార్‌ సౌ పార్‌ వినాదంతో గెలుపోటముల చర్చ కేంద్రకాన్ని మార్చిన క్రెడిట్‌ మోదీకే చెల్లుతుందన్నారు.

Prasant Kishore On Modi
Prasant Kishore On Modi (Source : Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : May 21, 2024, 5:54 PM IST

Prasant Kishore On BJP Seats : లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఇంచుమించు గతసారి ఫలితాలే వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ అంచనా వేశారు. బీజేపీ మీద దేశంలో పెద్దగా కోపం గానీ సవాల్‌ విసిరే వ్యక్తులు గానీ లేరని, ఆ పార్టీని మోదీ మరోసారి విజయతీరాలకు చేరుస్తారని వివరించారు. 2019లో బీజేపీకి 303 సీట్లు వచ్చినట్లే ఈసారీ అటూఇటుగా, లేదా కాస్త ఎక్కువే వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. హామీలు నెరవేర్చని కారణంగా మోదీపై ప్రజలకు కొంత నిరాశ ఉండొచ్చు కానీ.. కోపంగా అయితే లేరని పేర్కొన్నారు.

కాంగ్రెస్ మద్దతుదారుల్లో తప్ప!
రాహుల్‌ గాంధీ వస్తే పరిస్థితి ఇంకొంత మెరుగవుతుందన్న భావన ఆయన మద్దతుదారుల నుంచి మాత్రమే కనిపిస్తోందని, అయితే క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించలేదని ప్రశాంత్‌ కిషోర్‌ అభిప్రాయపడ్డారు. 325 లోక్‌సభ స్థానాలు ఉండే ఉత్తర, పశ్చిమ భారతం 2014 నుంచి బీజేపీకి కంచుకోటగా ఉందన్నారు. 225 నియోజకవర్గాలు ఉన్న తూర్పు, దక్షిణ భారతంలో బీజేపీకి ప్రస్తుతం 50 కంటే తక్కువ సీట్లున్నాయని వివరించారు. అయితే ఈసారి దక్షిణాదిలో బీజేపీ కాస్త మెరుగయ్యే అవకాశం ఉందన్నారు. బీజేపీకి నష్టం అంటూ వస్తే అది ఉత్తర, పశ్చిమ భారత్‌లోనే జరుగుతుందని చెప్పారు.

ఆ చర్చ ఎక్కడా లేదు!
బీజేపీ ఓడిపోతుందా లేదా విజయం సాధిస్తుందా అన్న చర్చ ఎక్కడా లేదని ప్రశాంత్‌ కిషోర్‌ వివరించారు. కేవలం బీజేపీ 370 సీట్లు సాధిస్తుందా లేదా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశం అయిందని పేర్కొన్నారు. చర్చ కేంద్రకాన్ని చార్‌ సౌ పార్‌ నినాదంతో మోదీ మార్చివేశారన్న ప్రశాంత్‌ కిషోర్‌, ఇందుకు మోదీకి క్రెడిట్ ఇవ్వాల్సిందే అని వ్యాఖ్యానించారు.

ప్రధాని అభ్యర్థిని ప్రకటించకపోవడమే మైనస్​!
విపక్ష ఇండియా కూటమి బీజేపీని ఎదుర్కొనే అవకాశాలను చాలాసార్లు చేజార్చుకుందని ప్రశాంత్‌ కిషోర్‌ అన్నారు. ఇండియా కూటమి ఏర్పడే సరికే చాలా ఆలస్యం అవడం ఒక వైఫల్యమన్న ఆయన, అప్పటికే బీజేపీ కోల్పోయిన స్థానాన్ని తిరిగి ఆక్రమించిందని అభిప్రాయపడ్డారు. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిని ప్రకటించకపోవడం మరింత నష్టానికి దారితీసిందన్నారు.

క్యాచ్‌లను మిస్‌ చేస్తూ ఉంటే!
ఇండియా కూటమిలో అంతర్గత కుమ్ములాటలను పీకే ప్రస్తావించారు. సీట్ల సర్దుబాటు విషయంలో ఎస్పీ, టీఎంసీతో విభేదాలను వివరించారు. నోట్ల రద్దు తర్వాత గుజరాత్‌లో బీజేపీ ప్రాభవాన్ని కోల్పోయినా, కొవిడ్‌ తర్వాత బంగాల్‌లో బీజేపీ తీవ్ర నష్టాన్ని చవిచూసినా ఆ రెండు అవకాశాలను కాంగ్రెస్‌ చేజార్చుకుందని తెలిపారు. క్యాచ్‌లను మిస్‌ చేస్తూ ఉంటే బ్యాట్స్‌మెన్‌ సెంచరీలు చేస్తూనే ఉంటారని వివరించారు.

ఏపీ ఎన్నికల్లో జగన్​కు దారుణ పరాభవం : ప్రశాంత్​ కిషోర్​ - Prashant Kishor on AP Elections

'ఇదీ మూన్నాళ్ల ముచ్చటే-ఎన్నికల వరకు కూడా కష్టమే!' బిహార్ పాలిటిక్స్​పై పీకే సంచలన వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.