7Kgs Gold Ramayana To Ayodhya Ram Mandir : ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రాముడికి కానుకల వెల్లువ ఆగట్లేదు. కొందరు భక్తులు ఇప్పటికే భారిగా విరాళాలను అందించగా తాజాగా ఓ రామభక్తుడు చరిత్రలో నిలిచిపోయే కానుకను ఆ అయోధ్య రామయ్యకు సమర్పించాడు. రూ.5కోట్ల విలువ చేసే ఏడు కిలోల 'బంగారు రాణాయణాన్ని' బాలక్రాముడి(రాంలల్లా)కు కానుకగా ఇచ్చాడు. ఈ స్వర్ణ రామాయణం మహాకావ్య రచనను 500 బంగారు పేజీల్లో లిఖించారు.
పేజీలకు 24 క్యారెట్ల బంగారు పూత
శ్రీ రామనవమి సందర్భంగా అయోధ్య రామయ్యకు భక్తులు కానుకలు అందించే ప్రక్రియ కొనసాగుతోంది. 500 స్వర్ణ పేజీలపై రాసిన ఈ రామాయణాన్ని రాంలల్లా గర్భగుడిలో ప్రతిష్టించారు. అయోధ్య ప్రాణప్రతిష్ట సమయంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ్ తన జీవిత సంపాదన మొత్తాన్ని ఆ రాంలాల్లాకు అంకితం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఆ మాట ప్రకారం ఆయన రూ.5 కోట్లు ఖర్చు చేసి 151 కిలోల బరువున్న రామ్‌చరిత్ మానస్(రామాయణం)ను సిద్ధం చేయించారు. 10,902 శ్లోకాలతో కూడిన ఈ బంగారు రామాయణానికి సంబంధించిన ప్రతి పేజీపై 24 క్యారెట్ల బంగారు పూత పూశారు. ఈ స్వర్ణ రామాయణంలో 480-500 వరకు పేజీలు ఉన్నాయి. దీని తయారీలో 140 కిలోల రాగిని కూడా వినియోగించారు.
మరోవైపు రామమందిరంలో కలశ స్థాపనతో 9 రోజుల శ్రీ రామనవమి వేడుకలు ప్రారంభం అయ్యాయి. మొదటి రోజు 2 లక్షల మంది భక్తులు అయోధ్యకు చేరుకున్నారు. సరయూ నదిలో స్నానాలు చేసి ఆ రామయ్యను దర్శించుకున్నారు. నవరాత్రుల ప్రారంభంలో రామాలయంలో తెల్లవారుజామున నాలుగు గంటలకే రాంలల్లా జలాభిషేకం చేసి శృంగార పూజ నిర్వహించారు.
కాగా, రాముడి ప్రాణప్రతిష్ట తర్వాత తొలిసారిగా స్వామివారి వస్త్రాల శైలిని మార్చినట్లు అయోధ్య రామాలయ ట్రస్ట్ తెలిపింది. ఆలయ గర్భగుడిలో వెండి కలశం కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 11 మంది వేద ఆచార్యులతో వాల్మీకి రామాయణంలోని నవః పారాయణం, రామ రక్షాస్త్రోత్, దుర్గా సప్తశతి పఠనంతో 9 రోజుల నవమి వేడుకలకు సంబంధించి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఆలయంలో రామకథా కార్యక్రమం ప్రారంభమైంది. మంగళవారం మఠంలో శ్రీరాముడి జయంతి వేడుకలూ ప్రారంభమయ్యాయి. అయోధ్యలో మఠాలయాల్లో రామకథ, రాంలీలా, భజన సంధ్య కార్యక్రమాలు జరుగుతున్నాయి.
అయోధ్య రాముడికి 2,500 కేజీల భారీ గంట- ఓంకార నాదం వచ్చేలా తయారీ
అయోధ్య రామయ్యకు కానుకగా 1100కిలోల తబలా- వాయిస్తే కొన్ని కి.మీ వరకూ శబ్ధమే!