ప్రతిధ్వని: ధరల పెంపు.. సామాన్యుడిపై ప్రభావం
వంట గ్యాస్ ధరలు భగ్గుమంటున్నాయి. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధర కేవలం 15 రోజుల్లోనే రూ.100 పెరిగింది. సహజంగా ధరల నిర్ణయ సమయంలోనే రాయితీ ఎంతన్నది కేంద్ర ప్రభుత్వం ప్రకటించి.. నగదు బదిలీ రూపంలో వినియోగదారుడు ఖాతాలో జమచేస్తుంది. ఈనెలలో రెండుసార్లు ధర పెంచినా.. రాయితీపై కేంద్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. అటు నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చాయి. ఇటు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా.. పెట్రోల్ ధరలు తగ్గలేదు. ఫలితంగా సామాన్యులపై ఆర్థిక భారం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ధరల పెంపు ప్రభావం సామాన్యుడిపై ఏవిధంగా ఉంటుంది.. ఎలాంటి ప్రభావం చూపుతోందనే అంశంపై ప్రతిధ్వని చర్చ చేపట్టింది.