విదేశీ ముద్దుగుమ్మల ముచ్చటైన రంగవళ్లులు
ఓరుగల్లులో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న విదేశీయులు ముచ్చటైన రంగవళ్లులు తీర్చిదిద్దారు. ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి, సంక్రాంతి పాటలు పాడి అలరించారు. గంగిరెద్దు విన్యాసాలు చూసి ఆశ్చర్యపోయారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని బాలవికాస్ కేంద్రంలో... తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా నిర్వహించిన ఈ ఉత్సవాలు తమలో జోష్ నింపాయని విదేశీయులు అన్నారు. అరిసెలు, సకినాలు, గారెలు వంటి పిండి వంటలు రుచి చూసి మైమరిచిపోయారు.