ప్రతిధ్వని: జాతీయ నూతన విద్యా విధానం.. కీలక సంస్కరణలు - etv prathidwani
డాక్టర్ కస్తూరి రంగన్ రూపొందించిన జాతీయ నూతన విద్యా విధానానికి కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. 34 సంవత్సరాలు తర్వాత కీలక మార్పులతో ముందుకొచ్చిన కొత్త విధానం.. విద్యార్థుల సమగ్ర వికాసానికి పెద్ద పీట వేసింది. ఐదో తరగతి వరకు మాతృభాషలోనే బోధన, ఉన్నత విద్యలోనూ అమ్మ భాషకు ప్రాధాన్యం, విద్యార్థులు ఇష్టమైన కోర్సులు చదువుకునే వెసులుబాటు, పాఠశాల విద్య పూర్తిచేసుకునే నాటికి వృత్తి విద్యా నైపుణ్యం ఉండేలా నూతన విద్యా విధానాన్ని రూపొందించారు. అన్ని కోర్సుల్లో హోలిస్టిక్ మల్టీ డిసిప్లెనరీ విధానాన్ని తీసుకొచ్చారు. డిగ్రీ విద్యార్థి ఏ సంవత్సరంలో చదువు మానేసినప్పటికీ ప్రయోజనం పొందేలా కీలకమైన సంస్కరణలు తెచ్చారు. ఈ నేపథ్యంలో జాతీయ నూతన విద్యా విధానంలోని ప్రధాన అంశాలపై ప్రతిధ్వని చర్చ చేపట్టింది.