తెలంగాణ

telangana

Police Assaulted to Young Man in Hyderabad

By ETV Bharat Telangana Team

Published : Oct 22, 2023, 5:05 PM IST

ETV Bharat / videos

Viral Video Police Assaulted to Young Man : యువకుడిపై కానిస్టేబుల్ లాఠీతో దాడి.. వీడియో వైరల్..

Viral Video Police Assaulted to Young Man  : హైదరాబాద్‌ చాదర్‌ఘాట్‌లోని కమలానగర్​లో శనివారం రాత్రి ఓ యువకుడిపై కానిస్టేబుల్‌ లాఠీతో దారుణంగా దాడి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఈ ఘటనతో చాదర్​ఘాట్​లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటన జరిగిన కొద్దిసేపటికే చాదర్‌ఘాట్‌ పోలీస్ స్టేషన్ వద్ద జనం పెద్ద సంఖ్యలో చేరి పోలీసుల చర్యను నిరసించారు. యువకుడిని అన్యాయంగా కొట్టారంటూ స్థానిక కార్పొరేటర్ పోలీసు స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. యువకుడిని ఎందుకు కొట్టారో చెప్పాలని డిమాండ్ చేశాడు.

మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా కూడా ఠాణాకు వచ్చి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాత్రి సమయాల్లో గంజాయి సేవించి రోడ్లపై తిరుగుతున్న యువకులను ప్రశ్నించామని.. ఈ క్రమంలో తమపై వారు రాళ్లతో దాడి చేయగా తాము గాయపడ్డామని పోలీసులు తెలిపారు. యువకుల రాళ్ల దాడిని నిలువరించే ప్రయత్నంలోనే కొట్టామని పోలీసులు వివరణ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details