తెలంగాణ

telangana

Speaker Pocharam

ETV Bharat / videos

Speaker Pocharam on Assembly Elections 2023 : 'నా కొడుకు కాదు.. మళ్లీ నేనే పోటీ చేస్తా' - వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానన్న పోచారం

By

Published : May 29, 2023, 9:24 AM IST

Speaker Pocharam on Assembly Elections 2023  : కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండల కేంద్రంలో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం స్థానికంగా ఉన్న మున్నూరు కాపు సంఘంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో తన స్థానంలో తన కుమారుడు పోటీ చేయనున్నారనే వార్తలపై స్పందించారు. 

ఈ సందర్భంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా మళ్లీ తానే పోటీ చేస్తానని పోచారం శ్రీనివాస్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయమై.. ఇటీవల సీఎం కేసీఆర్ తనను ప్రత్యేకంగా హైదరాబాద్‌కు పిలిపించుకున్నారని తెలిపారు. సర్వేలు తనకే అనుకూలంగా ఉన్నాయని.. ఈ ఒక్కసారికి మాత్రం ఎమ్మెల్యేగా నిలబడాలని కోరారన్నారు. తాను గెలిచాక కుమారులకు ఏదో అవకాశం ఇద్దామన్నారని పేర్కొన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఈసారీ ఎన్నికల్లో తానే పోటీ చేయనున్నట్లు స్పీకర్ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details