తెలంగాణ

telangana

కోజికోడ్​లో స్కూటర్​ను ఢీకొట్టిన లారీ

ETV Bharat / videos

అటు బస్​.. ఇటు ట్రాలీ ఆటో​.. మధ్యలో స్కూటీపై యువతులు.. యాక్సిడెంట్​ జస్ట్​ మిస్​! - కేరళలో స్కూటీ ప్రమాదం

By

Published : Jun 7, 2023, 9:02 PM IST

Road Accident in Kerala : కేరళలోని కోజికోడ్‌ జిల్లా మవూర్‌లో.. ఇద్దరు యువతులు రోడ్డు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. అరీకోడే నుంచి ప్రైవేటు బస్సు బయలుదేరగా.. దాని వెనకే ఇద్దరు యువతులు స్కూటీపై ప్రయాణించారు. మవూర్ వద్ద వారు బస్సును దాటి ముందుకు వెళ్లే ప్రయత్నం చేయగా.. అదే సమయంలో ఎదురుగా ట్రాలీ ఆటో వచ్చింది. ట్రాలీ ఆటోకు, బస్సుకు మధ్య స్కూటీ చిక్కుకోగా.. వారిద్దరూ కిందకు పడిపోయారు. స్కూటీ నడుపుతున్న యువతి హెల్మెట్‌ ఊడి కింద పడిపోయింది. ఆ సమయంలో బస్సు, ఆటో వేగంతో పాటు స్కూటీ వేగం తక్కువగా ఉండడం వల్ల యువతులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రైవేటు బస్సుకు అమర్చిన సీసీటీవీల్లో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ ప్రమాద దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. వీళ్లు చాలా లక్కీ గురూ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అతివేగం ప్రమాదకరం అని పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details